Janaki Kalaganaledu January 26th: తల్లి కోరిక తీర్చిన రామా- మళ్ళీ జానకిని దూరం పెట్టిన జ్ఞానంబ
రామా చేసిన తప్పు వల్ల జ్ఞానంబ కుటుంబం అప్పుల పాలు అవుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
మల్లిక జ్ఞానంబ చనిపోయిన తమ్ముడి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడటంతో జానకి తనని తిడుతుంది. మేనమామ గురించి అలా మాట్లాడుతుంటే చూస్తూ నిలబడతావా అని విష్ణుకి కూడా కాస్త గడ్డి పెడుతుంది. వెన్నెల వచ్చి గుడిలో మొక్కుబడి ఉందని అబద్ధం చెప్పి జ్ఞానంబని అనాథ ఆశ్రమానికి తీసుకొస్తుంది. గుడికని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావ్ ఏంటి ఒట్టి చేతులతో పిల్లల్ని కలవడం బాగోదాని అంటుంది. అనాథ ఆశ్రమం వ్యక్తి వచ్చి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చేసినందుకు కృతజ్ఞత తెలుపుతాడు. జ్ఞానంబ ఆశ్రయంలోకి రాగానే పిల్లలు వచ్చి పూలు ఇచ్చి వెల్కం చెప్తారు. అది చూసి జ్ఞానంబ బాధపడుతుంది. పిల్లల దగ్గరకి ఒట్టి చేతులతో వచ్చి ఏం లాభం అని అంటుంది.
Also Read: విన్నీ చూసి షాకైన యష్, మురిసిన వేద- మాళవికని బలి ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్న భ్రమరాంబిక
ఒట్టి చేతులతో ఏమి కాదు అని అక్కడ రామా, జానకి చేసిన ఏర్పాట్లు చూపిస్తారు. వాటిని చూసి జ్ఞానంబ ఆశ్చర్యంగా ఎవరు చేశారని అడుగుతుంది. మేమే అని రామా, జానకి వస్తారు. ఇవన్నీ రాత్రంతా అన్నయ్య, వదిన కష్టపడి చేశారని వెన్నెల చెప్తుంది. పరిస్థితి బాగోనప్పుడు వచ్చే సంవత్సరం చేసుకునే వాళ్ళం కదా జ్ఞానంబ అంటుంది. మీరు ఏటా చేసే కార్యక్రమం చేయలేకపోతున్నారని బాధపడటం రామా అర్థం చేసుకున్నారని జానకి అంటుంది. జ్ఞానంబ వాటన్నింటినీ సంతోషంగా పిల్లలకి పంచి పెడుతుంది. ఆస్తులు పంచుకునే పిల్లల్ని చూశాను కానీ తల్లి కోరిక నెరవేర్చే పిల్లల్ని చూస్తున్నా, భర్తకి తగిన భార్యగా అత్తగారి కోరికగా కాకుండా అమ్మ కోరికగా తీసుకుని జరిపించారు. వీళ్ళిద్దరూ ఉండగా మిమ్మల్ని చిన్న కష్టం కూడా పడనివ్వరు అని ఆశ్రమం అతను అంటాడు.
జానకి పని చేసే అత్తయ్యకి దగ్గర అయిపోతుందని మల్లిక తిట్టుకుంటుంది. జ్ఞానంబ ప్రశాంతంగా ఉండటం చూసి మల్లిక తన మనసు చెడగొట్టేందుకు చూస్తుంది. ఫోన్ మాట్లాడుతున్నట్టు నాటకం ఆడుతూ జానకి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. తను ఎన్ని తప్పులు చేసినా క్షమించి కలిసిపోతారు, వెన్నెలని అడ్డం పెట్టుకుని జానకి మార్కులు కొట్టేయాలని చూస్తుందని అంటుంది. ఆ మాటలన్నీ జ్ఞానంబ వింటుంది. అత్తగారు బాధపడకుండా ఇంత పని చేశారు అని గోవిందరాజులు జానకిని మెచ్చుకుంటాడు. అది చూసి మల్లిక కుళ్ళుకుంటుంది. అప్పుడే వచ్చిన జ్ఞానంబకి మజ్జిగ ఇస్తుంది జానకి. ఒకరితో సేవలు చేయించుకోలేనంత వయసు ఏమి రాలేదు, నా పనులు నేను చేసుకోగలను అని అంటుంది. ఆ మాటకి జానకి, రామా బాధపడతారు.
Also Read: సీక్రెట్ గా నందుకి ఉద్యోగం ఇప్పించిన మాజీ భార్య- తులసమ్మ వాకిట్లో ముగ్గుల పోటీ
బాగా ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు కుటుంబం ఈ పరిస్థితికి రావడానికి కారణం అయ్యారని అంటుంది. కోడళ్ళు రాగానే అత్త పెత్తనం పోతుంది అన్నారు, అది పోవడం కాదు ఇంటి బాధ్యతలు చూసుకోవడం పెద్ద కోడలిగా తన బాధ్యత అని జానకి అంటుంది. అదంతా విని మల్లిక కుళ్ళుకుంటుంది. మమ్మల్ని అపార్థం చేసుకున్న పరవాలేదు మా అభిమానం అపార్థం చేసుకోవద్దని జానకి బాధగా వెళ్ళిపోతుంది. నువ్వు అపార్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోవడానికి చూస్తున్నారు. ఇల్లు ముక్కలు కాకూడదని అత్తగారి కోరిక నెరవేర్చాలని చూసే జానకి లాంటి కోడళ్ళు ఎంత మంది ఉంటారని గోవిందరాజులు అంటాడు.