Ennenno Janmalabandham January 26th: విన్నీ చూసి షాకైన యష్, మురిసిన వేద- మాళవికని బలి ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్న భ్రమరాంబిక
యష్ వేద మధ్యలోకి విన్నీ రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
సులోచన, మాలిని కుటుంబాలు భోగి పండుగ ఘనంగా జరుపుకుంటారు. భోగి మంట దగ్గర కూర్చుని మాట్లాడుకుంటారు. భోగి పండుగ అంటే ఏంటి ఎందుకు జరుపుకుంటారని అడుగుతుంది. సులోచన, మాలిని తనకి అర్థం అయ్యేలా చక్కగా చెప్తారు. ఖుషి సంతోషంగా వచ్చి వేద వాళ్ళకి కూడా చెప్తుంది. మీ పాత అలకలు, చిరాకులు అన్నీ ఈ భోగి మంటలో వేసెయ్యండి, కొత్తగా మళ్ళీ డిఫరెంట్ గా అలకలు, చిరాకులు పడండి అని చెప్తుంది. అది విని అందరూ నవ్వుతారు. అందరూ సరదాగా భోగి మంట దగ్గర డాన్స్ చేస్తూ ఉంటారు. వేద తన ఫ్రెండ్ విన్నీ ఇక్కడికి వస్తున్నాడని ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. ఇప్పుడు ఈ పిడత మొహం చూడాలా అని యష్ అక్కడ నుంచి జారుకుంటాడు.
Also Read: నందుని అడుగడుగునా అవమానించిన కుటుంబం- లాస్యని పనిమనిషి చేసేసిన భాగ్య
విన్నీని ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది. తనని తీసుకెళ్ళి యష్ కి పరిచయం చేస్తుంది. యష్ విన్నీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. ఇద్దరూ ఒకేసారి నువ్వా.. అని అనుకుంటారు. అది చూసి మీరిద్దరు ఒకరికొకరు తెలుసా ఎప్పుడు కలిశారు నాకు చెప్పలేదేంటి అని వేద అడుగుతుంది. హోటల్ దగ్గర అని యష్ చెప్తాడు. కలవడం అంటే కలవడం కాదు పెద్ద గొడవ జరిగిందని విన్నీ చెప్తాడు. అది విని వేద ఇద్దరికీ సోరి చెప్తుంది. అయినా ఇద్దరూ కోపంగా ఉండటంతో వేద టెన్షన్ పడుతుంది. అది చూసి జస్ట్ జోక్ చేశాను అని విన్నీ అంటాడు. తర్వాత యష్ కూడా నవ్వు పులుముకుని అవునని చెప్తాడు.
Also Read: పెళ్ళాం ఫోటో చూసుకుని మురిసిపోయిన యష్- భ్రమరాంబిక అవమానం, ఆగ్రహించిన మాళవిక
విన్నీ పక్కకి వెళ్లిపోగానే హోటల్ కి వచ్చారా? నాతో రానని చెప్పి వచ్చారు, వచ్చిన వాళ్ళు నన్ను ఎందుకు కలవలేదని యష్ ని అడుగుతుంది. మాట చెప్పకుండా తప్పించుకుని వెళ్ళిపోతాడు. పైకి కనిపించకపోయినా లోపల మాత్రం నన్ను ఫాలో అవుతారా, జలస్ ఫీల్ అవుతున్నారా క్యూట్ గా ఉండి ఉండండి మీ సంగతి చెప్తాను అని వేద అనుకుంటుంది. మాళవిక నిద్రపోతుంటే ఖైలాష్ పరిగెత్తుకుంటూ వచ్చి నిద్రలేపుతాడు. భ్రమరాంబిక ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటుంది. మాళవిక వచ్చి భ్రమరాంబికకి సోరి చెప్తుంది. తనతో ప్రేమగా మాట్లాడటం చూసి ఖైలాష్ బిత్తరపోతాడు. విన్నీ యష్ వాళ్ళ ఇంట్లో అందరితో సరదాగా మాట్లాడుతూ జోక్స్ చెప్పి నవ్విస్తాడు. అది చూసి యష్ తల పట్టుకుంటాడు. అందరూ విన్నీ జోక్స్ కి నవ్వుతూ ఉంటే సీరియస్ గా అమెరికా నుంచి నేను ఎందుకు వచ్చానో తెలుసా అని అంటాడు. విన్నీ అలా అనడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. వేదు చేసే ఫిల్టర్ కాఫీ తాగడానికి అని చెప్పడంతో అందరూ నవ్వేస్తారు.
Ennenno Janmala Bandham - Promo | 25th Jan 2023 | Mon-Fri at 9.30 pm Only on #StarMaa #StarMaaSerials #EnnennoJanmalaBandham pic.twitter.com/HpIJhlQfde
— Starmaa (@StarMaa) January 25, 2023