News
News
X

Janaki Kalaganaledu February 23rd: నిజం తెలిసి రామ షాక్- జ్ఞానంబకి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కి జానకి ఏర్పాట్లు

జ్ఞానంబ ఆరోగ్యం క్షీణించడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

జానకి డాక్టర్ ని కలుస్తుంది. నిజం తెలిస్తే ఇంట్లో ఎవరు తట్టుకోలేరని జానకి అంటుంది. అత్తయ్యని కాపాడుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పమని అడుగుతుంది. ఈ కండిషన్ లో ఉన్న పేషెంట్ కి డోనర్ దొరికితే ట్రాన్స్ ప్లాంటేషన్ చేయొచ్చు, డబ్బుల కోసం కొంతమంది కిడ్నీలు అమ్ముతారు కానీ అది ఖర్చుతో కూడుకున్నదని చెప్తుంది. ఇంట్లో ఎవరో ఒకళ్ళ కిడ్నీ పెట్టొచ్చు అని డాక్టర్ చెప్పడంతో వాళ్ళకి తెలియకుండా ఎలా టెస్ట్ చేయడం అని జానకి అడుగుతుంది. డాక్టర్ వేరే అడ్రస్ ఇచ్చి వెళ్ళి తనని కలవమని చెప్తుంది. మావయ్య తెలివితేటలు ఉపయోగించి అందరితో డబ్బులు ఇప్పించేలా చేశారని మల్లిక గోవిందరాజులని తిట్టుకుంటుంది.

Also Read: కళ్ళు తెరిచిన వేద- తనని తాను నిందించుకున్న యష్, విన్నీ విలన్ గా మారతాడా?

మలయాళం దగ్గరకి మల్లిక దొంగచాటుగా వచ్చి చికెన్ పకోడీ చేశావా అని అడుగుతుంది. చేశానని చెప్పి పకోడీ తనకి ఇస్తాడు. గిన్నె మొత్తం తీసుకుని అందులో ఒక చిన్న ముక్క ఏరి మరీ ఇస్తుంది. ఖచ్చితంగా మల్లిక తినెటైమ్ కి తిలోత్తమ వస్తుంది. తన చేతిలో పకోడీ గిన్నె బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతుంది. అది క్యాలీఫ్లవర్ పకోడీ కాదు చికెన్ పకోడీ అని తెలిస్తే గొడవలు అయిపోతాయని టెన్షన్ పడతారు. జ్ఞానంబ నడుస్తూ ఉంటే కళ్ళు తిరిగి ఇబ్బంది పడుతుంటే గోవిందరాజులు చూసి తనని తీసుకొచ్చి కూర్చోబెడతాడు. తిలోత్తమ ఆ పకోడీ తీసుకొచ్చి గోవిందరాజులు చేతిలో పెడుతుంది. కానీ మలయాళం వచ్చి గిన్నె లాక్కుని చివరికి చికెన్ పకోడీ చేతిలోనె పెడతారు. క్యాలీఫ్లవర్ పకోడీ అన్నావ్ ఇందులో ఎముకలు ఉన్నాయని గోవిందరాజులు అంటాడు. తిలోత్తమ అది చూసి చికెన్ పకోడీ అని చెప్తుంది.

Also Read: మొదలైన పెళ్లి ఏర్పాట్లు - స్వప్నకి ఐలవ్యూ చెప్పిన రాహుల్, అక్కని నిలదీసిన కావ్య

మల్లిక వచ్చి తను దొరకకుండా తప్పించుకోవడం కోసం మలయాళంని తిడుతూ కాసేపు డ్రామా ఆడుతుంది. కానీ జ్ఞానంబ మాత్రం విషయం పసిగట్టేస్తుంది. నీకు నచ్చినట్టు ఉండమన్నాను నువ్వు తినడానికి వాడిని తిట్టించాల్సిన అవసరం లేదని జ్ఞానంబ అంటుంది. ఆ చికెన్ పకోడీని తను అరిగిస్తానని తిలోత్తమ అంటుంది. జ్ఞానంబ పర్మిషన్ ఇచ్చేసరికి మల్లిక వాటిని ఎంజాయ్ చేస్తూ లాగించేస్తుంది. జానకి వెళ్ళి మరొక డాక్టర్ ని కలుస్తుంది. రామ దగ్గరకి ఒకతను వచ్చి విష్ణు షాపు పెట్టుకోవడానికి బ్యాంక్ లో లోన్ తీసుకున్నాడని ఈనెల వాయిదా ఇంకా కట్టలేదని చెప్తాడు. అది విని రామ షాక్ అవుతాడు. గతంలో విష్ణు, మల్లిక షాపు తన ఫ్రెండ్ ది అని చెప్పిన అబద్ధం గుర్తు చేసుకుంటాడు. జ్ఞానంబకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆపరేషన్ చేయించాలని డాక్టర్ జానకితో చెప్తుంది. హ్యపీగా చికెన్ పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తున్న మల్లిక తిక్క కుదర్చడానికి తిలోత్తమ వచ్చేస్తుంది. గోంగూర వలువు అని తెచ్చి ముందు పెడుతుంది. 

Published at : 23 Feb 2023 01:52 PM (IST) Tags: janaki kalaganaledu serial today episode Janaki Kalaganaledu Serial Written Update Janaki Kalaganaledu Serial Janaki Kalaganaledu Serial February 23rd Update

సంబంధిత కథనాలు

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Rashmi Gautam Lifestyle : రష్మి వెనుక ఇంత తలనొప్పి ఉందా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ యాంకర్

Rashmi Gautam Lifestyle : రష్మి వెనుక ఇంత తలనొప్పి ఉందా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ యాంకర్

టాప్ స్టోరీస్

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!

KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!