Ennenno Janmalabandham February 23rd: కళ్ళు తెరిచిన వేద- తనని తాను నిందించుకున్న యష్, విన్నీ విలన్ గా మారతాడా?
యష్, వేద మధ్యలోకి విన్నీ రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వేద హాస్పిటల్ బెడ్ మీద చూసి యష్ విలవిల్లాడిపోతాడు. తనతో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతాడు. హాస్పిటల్ అప్లికేషన్ ఫామ్ మీద వేద డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా రాసినందుకు వసంత్ మీద యష్ నోటికొచ్చినట్టు అరుస్తాడు. ‘ఇదే నీతో ప్రాబ్లం ఎప్పుడు ఎందుకు కోపం వస్తుందో తెలియదు, నీ ఇగో నీదే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోలేవా. ఇలాగే వదినతో మాట్లాడి తనని హర్ట్ చేసి ఉంటావ్ అందుకే అలా అయ్యింది. నీ వల్లే వదినకి ఈ పరిస్థితి వచ్చిందని’ వసంత్ కోపంగా అనేసి వెళ్ళిపోతాడు. అదంతా విన్నీ చూస్తూ అభి చెప్పిన మాటలు నిజమని నమ్ముతాడు.
వేద పరిస్థితి గురించి ఖుషికి చెప్పొద్దని సులోచన తన పెద్ద కూతురితో చెప్తుంది. అప్పుడే ఖుషి వచ్చి ఏమైంది అమ్మ ఎక్కడకి వెళ్ళిందని అని అడుగుతుంది. ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు అందరూ ఎక్కడికి వెళ్లారని అంటుంది. ఏవేవో అబద్ధాలు చెప్పి ఖుషిని మాయ చేస్తుంది. ఖుషి తన తల్లితో ఉన్న అనుబంధం గురించి చెప్తుంది. యష్, విన్నీ డాక్టర్ ని కలవడానికి వస్తారు. తను రోజు టైమ్ కి తింటుంది కదా అని అడుగుతుంది. శివరాత్రి కదా అందుకే ఫాస్టింగ్ ఉంటుందని యష్ చెప్తాడు. తను ఇంతకముందు ఎప్పుడైనా ఉపవాసం చేసేదా అని డాక్టర్ అడుగుతుంది.
Also Read: మొదలైన పెళ్లి ఏర్పాట్లు - స్వప్నకి ఐలవ్యూ చెప్పిన రాహుల్, అక్కని నిలదీసిన కావ్య
యష్: లేదు తను డాక్టర్ కదా డైట్ ఫాలో అవుతుంది
విన్నీ: నో తను ప్రతి శనివారం ఉపవాసం ఉంటుంది
డాక్టర్: తనకి ఏవైనా ఫుడ్ ఎలర్జీ ఉందా?
యష్: లేదు తను అన్ని వెజిటబుల్స్ తింటుంది
విన్నీ: నో డాక్టర్ తనకి పొట్లకాయ, స్వీట్ పొటాటో పడదు
డాక్టర్: మీ భార్య వేదకి చిన్నప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా
యష్: వేదకి అలాంటివి ఏమి లేవు. మా పెళ్లి అయిన దగ్గర నుంచి కనీసం తనకి ఫీవర్ కూడా రాలేదు
విన్నీ: తనకి హెల్త్ ప్రాబ్లం ఉంది తనకి చిన్నప్పుడు స్టమక్ టీబీ ఉంది
డాక్టర్: అలాంటప్పుడు తను ఉపవాసం ఉండకూడదు. రెండు గంటలకి మించి తను ఫుడ్ తీసుకోకుండా ఉండకూడదు. తనకి ట్రీట్మెంట్ జరిగిందా. ఒక్కోసారి డిసీజ్ మళ్ళీ తిరగబడొచ్చు. తన బ్లడ్ గ్రూప్ ఏంటి?
విన్నీ: A పాజిటివ్
డాక్టర్: ఆశ్చర్యంగా ఉందే తన భర్తకంటే మీకే ఎక్కువ విషయాలు తెలుసు
Also Read: 'గృహలక్ష్మి'లోకి కొత్త విలన్- దివ్య ఇంటర్వ్యూకి వెళ్ళిన హాస్పిటల్ ముందు ధర్నాకి దిగిన తులసి
విన్నీ: తను నాకు చైల్డ్ హూడ్ ఫ్రెండ్ ని తన మానసిక పరిస్థితి కూడా నాకు తెలుసు అని యష్ వైపు కోపంగా చూస్తాడు.
వసంత్ డల్ గా ఉండటం చూసి చిత్ర వెళ్ళి పలకరిస్తుంది. అభిమన్యు కారులో రావడం తనకి నచ్చలేదని చిత్ర మీద సీరియస్ అవుతాడు. తను ఇప్పుడు జాబ్ చేసేది అభిమన్యు ఆఫీసులోనే అని చిత్ర చెప్పేసరికి వసంత్ షాక్ అవుతాడు. ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదని అరుస్తాడు. చిత్ర చేసింది కరెక్ట్ కాదని వసంత్ చెప్పేసి వెళ్ళిపోతాడు.
శివరాత్రికి మూడు రోజుల ఉపవాసం అసలు ఉండలేవని యష్ వేదని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. ప్రాణం పోయినా సరే మూడు రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను అని వేద అంటుంది. విన్నీ సులోచనని ఇంటికి తీసుకొచ్చి పాత ఫైల్స్ కోసం వెతుకుతారు. కూతురి పరిస్థితి గురించి తలుచుకుని గుండె పగిలేలా ఏడుస్తుంది. సులోచన ఏడుస్తూ ఉంటే విన్నీ వచ్చి ధైర్యం చెప్తాడు. అసలు నీ భర్తని కదా నీ గురించి అన్నీ డీటైల్స్ నాకు తెలియాలి కదా తెలుసుకుని ఉండాలి కానీ ఏమి తెలియదు నాకు. నువ్వేమో నాగురించి అన్నీ పట్టించుకుంటావ్ కానీ నేను నీ గురించి ఏమి పట్టించుకోలేదు. నిన్ను ఈ హాస్పిటల్ బెడ్ మీదకి చేర్చింది నేనే కదా నా వల్లే కదా అని యష్ తనని తాను నిందించుకుంటాడు.