Janaki Kalaganaledu December 29th: ఘోరంగా అవమానించిన అఖిల్, నిజం చెప్పేసిన రామా- గోవిందరాజులు పరిస్థితి విషమం
జానకి మళ్ళీ ఐపీఎస్ చదువుకోవడానికి ఒప్పుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి రామా రూ.20 లక్షలు అప్పు తీసుకున్నట్టు జ్ఞానంబ వాళ్ళకి తెలుస్తుంది. వడ్డీ వ్యాపారి భాస్కర్ నిజం చెప్పడంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. జానకి ఏం చెయ్యాలో అర్థం కాక బిక్కమొహం వేసుకుని ఉంటుంది. తాకట్టు పెట్టిన ఇంటి కాగితాలు తీసి భాస్కర్ జ్ఞానంబకి చూపిస్తాడు. రామా అంత డబ్బు తీసుకున్నాడు అంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని జ్ఞానంబ కొడుకుని పిలుస్తుంది. జానకి వచ్చి రామా ఇంట్లో లేడని చెప్తుంది. అప్పుడే రామా బయట నుంచి వస్తాడు. ఇంట్లో వడ్డీ వ్యాపారిను చూసి రామా షాక్ అవుతాడు. దొరికిందే సందు అనుకుని మల్లిక మంట పెట్టడానికి రెడీ అవుతుంది.
జ్ఞానంబ: మన ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నావ్ అంటున్నారు. కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తున్న నమ్మాలని అనిపించడం లేదు. నిజంగా నువ్వు అంత డబ్బు అప్పుగా తీసుకున్నావా
భాస్కర్: మీ అమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పారెంటి రామా. మరుసటి రోజు ఇస్తాను అన్నా వినకుండా అప్పటికప్పుడే డబ్బు తీసుకెళ్లావ్ కదా చెప్పు
గోవిందరాజులు: మాట్లాడవేంటి రాముడు, ఈయన దగ్గర రూ.20 లక్షలు అప్పు తీసుకున్నావా
రామా: తీసుకున్నా నాన్న
మల్లిక: నేను ఒకసారి 500 ఎక్కువ ఖర్చు పెట్టాను అని గంట సేపు తిట్టారు, మాయన అప్పు తీసుకుంటే నేరం అని నిలదీశారు. ఇప్పుడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా రూ.20 లక్షలు అప్పు తీసుకున్నారు అది తప్పు కదా అత్తయ్యగారు అడగండి
Also Read: ఊహించని ట్విస్ట్, గతం మర్చిపోయిన వేద- షాక్లో యష్, రగిలిపోతున్న మాళవిక
విష్ణు: నోరు పారేసుకోకు, ఇంటి బాధ్యత తలమీద మోస్తున్న అన్నయ్య అన్ని డబ్బులు ఎందుకు తీసుకున్నారో చెప్తాడుగా ఆగు
అఖిల్: అంత డబ్బు ఎందుకు తీసుకున్నాడో అన్నయ్య సమాధానం చెప్పాలి కదా వదినని అడగనివ్వు
తను మాట పడినా కూడా అసలు నిజం చెప్పకూడదు అని రామా మనసులో అనుకుంటాడు. ఇప్పటికైనా నిజం చెప్పకపోతే అందరి ముందు దోషిగా నిలబడతారు చెప్పండి అని జానకి మనసులో అనుకుంటుంది.
జ్ఞానంబ: మన పరిస్థితికి రూ.20 లక్షలు అప్పు తీసుకోవడం అనవసరం. అసలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది
మల్లిక నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అఖిల్ కూడా ఇష్టం వచ్చినట్టు అంటాడు. విష్ణు కూడా రామా సమాధానం చెప్పకపోయే సరికి అనుమానించాల్సి వస్తుందని అంటాడు. తండ్రి మాత్రం రామాని వెనకేసుకొస్తాడు. భార్య వచ్చింది, తను బాగా చదువుకున్నది, తనే ఇలా చేయించి ఉంటుందని మల్లిక మంట పెడుతుంది. కావాలంటే జానకిని అడగండి ఈ విషయం తెలిసే ఉంటుందని అంటుంది. జ్ఞానంబ జానకిని విషయం ముందే తెలుసా అని అడగ్గా తెలుసని చెప్పేసరికి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తాను అని రామా అందరినీ అడుగుతాడు. కానీ అఖిల్ మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడతాడు.
Also Read: తులసి కోసం చెయ్యి కాల్చుకున్న సామ్రాట్- శ్రుతి కడుపు పోతుందా?
వదిన చెప్తే మాత్రం ఇలా చేస్తావా ఇంత స్వార్థపరుడివి అయిపోతావా, రూ.20 లక్షలు అప్పు చేసి పొలమో, ఫ్లాట్ ఎలా కొనుక్కోవాలి అనిపించిందని అఖిల్ నిలదీస్తాడు. ఆ మాటకి రామా కోపంగా మా కోసం కాదు నీ ఉద్యోగం కోసం అప్పు చేశానని నిజం చెప్పేస్తాడు. అసలు ఏం చేస్తున్నావ్ అని జ్ఞానంబ అడుగుతుంది. ఈ విషయం చెప్పకూడదు అనుకున్నా కానీ ఎవరికోసం అప్పు చేశానో వాళ్ళే నన్ను దోషిని చేశారని అంటాడు.
తరువాయి భాగంలో..
రామా వాళ్ళందరూ కలిసి చరణ్ ఆఫీసు దగ్గరకి వెళతారు. కానీ అక్కడ చరణ్ ఉండదు. అందరూ ఇంటికి డిగాలుగా వస్తారు. చరణ్ ఆఫీసు ఎత్తేశాడని గోవిందరాజులు చెప్పేసరికి కలిసి ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు వాటాలు పంచాల్సిందే అని మల్లిక గొడవపెడుతుంది. ఆ మాటకి గోవిందరాజులకి గుండె పోటు, పక్షవాతం వచ్చి పడిపోతాడు.