News
News
X

Ennenno Janmalabandham December 29th: ఊహించని ట్విస్ట్, గతం మర్చిపోయిన వేద- షాక్లో యష్, రగిలిపోతున్న మాళవిక

వేద, యష్ వెకేషన్ కి వెళ్లడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

రాజా రాణిని పిలిచి మగాడు పెళ్లి చేసుకునేందుకు ఎందుకో తెలుసా అని అడుగుతాడు. ఎందుకు అంటే వీపు గోకించుకోవడానికి అని సరదాగా సమాధానం ఇస్తాడు. అప్పుడే వేద, యష్ ఊరు చూడటానికి వెళ్ళడానికి రెడీ అయ్యాం అని వస్తారు. మనవడా వేదతో ఎప్పుడైనా వీపు గోకించుకున్నావా అని కాసేపు క్లాస్ తీసుకుంటాడు. రాణి అడ్డుపడి ఆపండి మీ గోకుడు పురాణం అని వేద వాళ్ళని వెళ్ళమని చెప్తుంది. మాళవిక వేద మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ రగిలిపోతుంది.

Also Read: తులసి కోసం చెయ్యి కాల్చుకున్న సామ్రాట్- శ్రుతి కడుపు పోతుందా?

‘వేద నాకు కాల్ చేసి నిప్పులు చిమ్ముతుందా? ఎక్కడిది వేదకి ఈ ధైర్యం, తెగింపు. ఒక వేళ వేద మందు పెట్టి యశోధర్ ని లొంగదీసుకుందా? ఇద్దరూ కాపురం చేశారా? ఆదిత్యని ఎరగా చూపించి యశోధర్ ని లొంగదీసుకుని వాళ్ళ మధ్య చిచ్చు పెడదాం అనుకున్నా కానీ నా ప్లాన్ ఫెయిల్ అయినట్టేనా. యష్ వేదకి శారీరకంగా కూడా దగ్గర అయ్యాడా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? వేద నా మీద గెలిచినట్టా’ అని రగిలిపోతుంది. వేద, యష్ బుల్లెట్ మీద ఊరు చూడటానికి వస్తారు. అప్పుడే చిత్ర మిస్డ్ కాల్ చూసి వేద తిరిగి చేస్తుంది. పల్లెటూరు చూస్తాను అనేసరికి ఖుషికి వీడియో కాల్ చేసి చూపిస్తుంది. బంగర్రాజు గెటప్ లో సూపర్ గా ఉన్నావ్ డాడీ అని ఖుషి మెచ్చుకుంటుంది.

వేద, యష్ దూరం దూరంగా నిలబడి ఫోన్ మాట్లాడుతుంటే ఖుషి వాళ్ళని దగ్గరకి నిలబడి అమ్మ  మీద చెయ్యి వేయమని చెప్తుంది. తర్వాత వేద సంతోషంగా ఊరు అంతా చూపించిన తర్వాత పెట్టేస్తుంది. ఖుషితో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉందని వేద అంటుంది. ఖుషిని బాగా చూసుకుంటున్నందుకు యష్ వేదకి థాంక్స్ చెప్తాడు. పుట్ట దగ్గర వేద యశోధర్ ని దణ్ణం పెట్టుకోమని చెప్తుంది. పుట్టలో చెయ్యి పెట్టు పాము కరవకపోతే అప్పుడు నాగులతల్లి ఉందని నమ్ముతాను అని యశోధర్ అంటాడు. వేద పుట్టలో చెయ్యి పెట్టి పాము కరిచినట్టు నటిస్తుంది. దీంతో యష్ కంగారుపడతాడు. తర్వాత పాము కరవలేదు నాగుల తల్లి దీవిస్తుందని వేద చెప్పేసరికి యష్ కూడా దణ్ణం పెట్టుకుంటాడు. ఎప్పుడు లేనిది తన మీద అంత కన్సన్ ఎందుకు చూపించారని వేద అడుగుతుంది.

Also Read: భార్యాభర్తల చిలిపి సరసాలు- మాళవికకి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన వేద

నీ ప్లేస్ లో ఎవరు ఉన్నా ఇలాగే రియాక్ట్ అవుతాను అని యష్ అనేసరికి వేద చిన్నబుచ్చుకుంటుంది. తర్వాత వేద ఉయ్యాల ఊగుతూ పొరపాటున జారి కింద పడి స్పృహ తప్పిపోతుంది. వేదకి ఏమైందా అని యష్ కంగారుపడతాడు. నీళ్ళు తెచ్చి మొహాన కొట్టగానే వేద లేచి విచిత్రంగా చూస్తుంది. వేద మీద చెయ్యి వేసి బాగానే ఉన్నవా అని యష్ అడుగుతాడు. చెయ్యి విదిలించి ఎవరు నువ్వు అని వేద అడిగేసరికి యష్ షాక్ అవుతాడు. వేద ఏమైంది నీకు అని టెన్షన్ గా అడుగుతాడు. వేద ఎవరు అని వేద అమాయకంగా అడుగుతుంది. నీ పేరే వేద, నేను నీ భర్త యశోధర్ ని అని అంటాడు. షటప్ నువ్వు నా హజ్బెండ్ ఏంటి అని వేద కోపంగా అంటుంది.

Published at : 29 Dec 2022 08:02 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial December 29th Episode

సంబంధిత కథనాలు

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Janaki Kalaganaledu February 6th: మలయాళం వంటలు తినలేకపారిపోయిన విష్ణు - మల్లికకి దిమ్మతిరిగే సమాధానమిచ్చిన జానకి

Janaki Kalaganaledu February 6th: మలయాళం వంటలు తినలేకపారిపోయిన విష్ణు - మల్లికకి దిమ్మతిరిగే సమాధానమిచ్చిన జానకి

Brahmamudi Serial February 6th: స్వప్నకి కుజదోషం, కనకం నెత్తిన పిడుగు- మళ్ళీ గొడవపడిన రాజ్, కావ్య

Brahmamudi Serial February 6th: స్వప్నకి కుజదోషం, కనకం నెత్తిన పిడుగు- మళ్ళీ గొడవపడిన రాజ్, కావ్య

Guppedanta Manasu February 6th: ఇగో మాస్టర్ వంకర ప్రశ్నలు, పొగరు తిక్క సమాధానాలు- రిషిధారని కలిపేందుకు మహేంద్ర స్కెచ్

Guppedanta Manasu February 6th: ఇగో మాస్టర్ వంకర ప్రశ్నలు, పొగరు తిక్క సమాధానాలు- రిషిధారని కలిపేందుకు మహేంద్ర స్కెచ్

Ennenno Janmalabandham February 6th: చిత్రమీద కన్నేసిన అభిమన్యు, మాళవిక గతి ఇక అథోగతి- విన్నీ పార్టీకి వెళ్తున్న వేద

Ennenno Janmalabandham February 6th: చిత్రమీద కన్నేసిన అభిమన్యు, మాళవిక గతి ఇక అథోగతి- విన్నీ పార్టీకి వెళ్తున్న వేద

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

Majilis Congress :  మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ -  వర్కవుట్ అవుతుందా ?

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్‌ వేసుకొని భర్తతో కాపురం!

Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్‌ వేసుకొని భర్తతో కాపురం!