అన్వేషించండి

Ennenno Janmalabandham December 28th: భార్యాభర్తల చిలిపి సరసాలు- మాళవికకి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన వేద

వేద, యష్ అగ్రహారం రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

వేద, యష్ ప్రేమాయణం కొనసాగుతోంది. భర్తకి నూనె పెట్టి స్నానం చేయించమని వేదకి తన అమ్మమ్మ, తాతయ్య చెప్తారు. దీంతో వేద దొరికిందే సందు అని యష్ ని ఉతికి ఆరేస్తుంది. మొగుడికి స్నానం చేయించడం అంటే పసిపిల్లలకి చేయించినంత శ్రద్ధగా ప్రేమగా చేయించాలని రాణి చెప్తుంది. తలకి కుంకుడు రసం పెట్టి చాలా ప్రేమగా వేద మర్దన చేస్తుంది. ఆ రసం యష్ కళ్ళలోకి వెళ్లడంతో కళలు మంటగా ఉన్నాయని అంటాడు. వేద తనకి స్నానం చేయిస్తుంటే యష్ మురిసిపోతాడు. వాళ్ళని చూసి కోయిల కూస్తుంది. ఇప్పుడు నువ్వు పలకరిస్తే అది పలుకుతుందని రాణి అంటుంది. వెంటనే యష్ కూడా కూ.. కూ అని అరుస్తాడు. కోయిలమ్మ నాకు ఫ్రెండ్ అయ్యింది మరి వేదమ్మ అని యష్ అడుగుతాడు. కానీ వేద మాత్రం మూతి తిప్పుకుని వెళ్ళిపోతుంది.

ఖుషి కోసం మాలిని, సులోచన, చిత్ర తినేవి తీసుకొస్తారు. అవేమీ వద్దని చెప్పి ఖుషి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతుంది. యష్ వేదని తల తుడవమని అడుగుతాడు. తుడవను అనేసరికి యష్ గట్టి గట్టిగా అరుస్తూ వాళ్ళని రాణి వాళ్ళని పిలుస్తాడు. తల తుడవటం లేదని ఫిర్యాదు చేస్తాడు. దీంతో తల తుడవమని రాణి చెప్తుంది. వేద యష్ ని గిచ్చడం, కొట్టడం చేస్తుంది. వేద వాళ్ళు ఊరు వెళ్లారని తెలిసి మాళవిక రగిలిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ హనీమూన్ కి వెళ్లారు, వేద ఏమైనా చెయ్యగలదు అందుకే యష్ ని డిస్ట్రబ్ చెయ్యాలి అని మాళవిక అనుకుంటుంది. వేద యష్ కి తల తుడుస్తుంటే తన నడుము చూస్తూ ఉంటాడు. ఇద్దరూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు.

Also Read: మోనిత, చారుశీల ప్లాన్ సక్సెస్ - దీపకు గుండెపోటు, హిమ మాటనమ్మని శౌర్య!

యష్, వేద సంతోషంగా ఉన్న టైమ్ లో మాళవిక ఫోన్ చేస్తుంది. కానీ యష్ లిఫ్ట్ చెయ్యడు. మొగుడితో హనీమూన్ కావలసి వచ్చిందా, తను ఉండగా అది జరగనివ్వను అనుకుని పదే పదే ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ యష్ లిఫ్ట్ చేయకుండా వెళ్ళిపోతాడు. వేద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.

మాళవిక: యశోధర్ ఏంటి ఏమైంది నీకు ఫోన్ లిఫ్ట్ చెయ్యవు ఏంటి, మాట్లాడు

వేద: మాట్లాడేది యశోధర్ కాదు వైఫ్ ఆఫ్ మిస్టర్ యశోధర్

మాళవిక: నువ్వు ఎందుకు నా యష్ ఫోన్ లిఫ్ట్ చేశావ్

వేద: నీ యశోధర్ నా భర్త, ఆయన ఫోన్ నేను కాకపోతే ఎవరు లిఫ్ట్ చేస్తారు. మనిషికో మాట గొడ్డుకొ దెబ్బ అంటారు, ఎన్ని సార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? భర్తని కాదని వెళ్లిపోయావ్ నీ బతుకేదో నువ్వు బతకొచ్చు కదా ఆయన్ని వదిలేయవచ్చు కదా. ఆయన్ని నువ్వు పెట్టిన టెన్షన్ మామూలుదా, అన్ని టెన్షన్స్ వదిలేసి ఎక్కడికో దూరంగా వస్తే ఇక్కడ కూడా వదలవా, ప్రశాంతంగా ఉండనివ్వవా. ఇంకెప్పుడు ఫోన్ చెయ్యకు పెట్టేయ్ ఫోన్

మాళవిక: చేస్తాను మళ్ళీ మళ్ళీ చేస్తాను మిమ్మల్ని టార్చర్ చేస్తా, నా లైఫ్ డిస్ట్రబ్ చేసి నా ఆదిని నాకు దూరం చేసి మీరు హనీమూన్ చేసుకుంటే ఊరుకుంటానా, నిన్ను బజారుకి ఈడ్చేదాకా వదిలిపెట్టను

Also Read: వసుని ఇంట్లోంచి పొమ్మన్న తండ్రి చక్రపాణి, రిషికి అబద్ధాలు చెప్పిన వసుధార

వేద: షటప్.. ఏమనుకుంటున్నావ్ నా గురించి, యశోధర్ కి భార్య కాకముందే నాకొక గౌరవం ఉంది. మరి నీకేంటి ఆ అభిమన్యు నీకేంటి? నీ ఒంటి మీద బంగారం ఏది నీది కాదు. ఆఖరికి నువ్వు పెట్టుకునే బొట్టు పిల్ల కూడా నీది కాదు. భార్యగా చెడిపోయావ్, తల్లిగా కూతురితో ఛీ కొట్టించుకున్నావ్, కొడుకుని చెడు దారిలో పెట్టావ్, నువ్వా నా గురించి మాట్లాడేది. నిలువెల్లా విషం నువ్వు అని గట్టిగా బుద్ధి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మాళవిక ఇక యశోధర్ ని డిస్ట్రబ్ చేయనివ్వను అని వేద అనుకుంటుంది. తన భర్త మీద మాళవిక నీడ కూడా పడనివ్వను అనుకుంటుంది.

తరువాయి భాగంలో..

వేదని యష్ ఉయ్యాల ఊపుతూ ఉండగా కింద పడిపోతుంది. యష్ కంగారుగా తనని లేపుతాడు. కానీ వేద గతం మర్చిపోయినట్టు నటిస్తుంది. యష్ వేద మీద చెయ్యి వేస్తే విదిలించుకుని ఎవరు నువ్వు అంటుంది. నీ భర్తని అని యష్ అనేసరికి నువ్వు నా భర్తవి ఏంటి అని కసురుతుంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Embed widget