అన్వేషించండి

Gruhalakshmi December 28th: తులసి కోసం చెయ్యి కాల్చుకున్న సామ్రాట్- శ్రుతి కడుపు పోతుందా?

లాస్య నిజస్వరూపం బయట పడటంలో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

తులసి కడుపుతో ఉన్న కోడలిని పలకరించడానికి ఇంటికి వస్తే దారుణంగా అవమానించి పంపించేస్తుంది లాస్య. దీంతో తనకి ధైర్యం చెప్పి సామ్రాట్ మళ్ళీ నందు ఇంటికి తీసుకుని వస్తాడు. శ్రుతితో కాసేపు సరదాగా మాట్లాడి వెళ్లిపోతాను అని తులసి అంటుంది.

నందు: ఇప్పుడిప్పుడే మనషులు, మనసులు కుదుట పడుతున్నాయి. ఇది నీ పుణ్యమే కాదు అనను, నువ్వు వెలిగిస్తున్న దీపాన్ని నువ్వే ఆర్పకు. ప్రస్తుతం ఎవరు మనసులు ప్రశాంతంగా లేవు ఇప్పుడు వెళ్లిపో

ప్రేమ్: ఇంకోసారి అమ్మని అవమానించాలని అనుకుంటున్నారా

లాస్య: శ్రుతి ప్రగ్నెంట్ అని ఇంట్లో ఉన్న నాకు చెప్పలేదు, ఇప్పటికీ తులసిదే రాజ్యం, ఇంక నా పరిస్థితి ఇదేనా

ప్రేమ్: ఇంతే నీ మెంటాల్టీ ఇక్కడ ఎవరికి సరిపోదు, నువ్వు మారినట్టు నటిస్తావే కానీ మారవు మారలేవు

నందు: నువ్వు ఎవరు మాట్లాడటానికి పెద్ద వాళ్ళం మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరతావ్ ఏంటి

Also Read: భార్యాభర్తల చిలిపి సరసాలు- మాళవికకి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన వేద

ప్రేమ్: పెద్దరికం వయస్సుతో కాదు మనసులో ఉండాలి, అమ్మని లాస్య అవమానిస్తే సమర్దిస్తున్నారు. నేనే కనుక అమ్మ ప్లేస్ లో ఉంటే చేతిలో సారె పారేసిన వాళ్ళ చెంప పగలగొట్టేవాడిని అనగానే నందు ఆవేశంగా కొట్టడానికి వెళ్తుంటే తులసి అడ్డుపడుతుంది.

తులసి: పెద్ద వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇది కాదు నాన్నకి సోరి చెప్పు

ప్రేమ్: నీకు సోరి చెప్తే నాన్నకి సోరి చెప్తా

నందు మళ్ళీ ప్రేమ్ మీదకి వెళ్లబోతుంటే తులసిని పక్కకి లాగి సామ్రాట్ అడ్డుపడతాడు. ప్రేమ్ ఆవేశంలో ఉన్నాడు లాస్యని తీసుకుని పక్కకి వెళ్ళు అని సామ్రాట్ నందుతో చెప్తాడు. చచ్చినా పక్కకి వెళ్ళను ఈరోజు తెలిపోవాలి అని లాస్య ఆవేశంగా అంటుంది. అభి, దివ్య కూడా ప్రేమ్ ఆవేశాన్ని ఆపేందుకు చూస్తారు. ఇక్కడికి వచ్చింది గొడవ చూడటానికి కాదు వెళ్లిపోదాం అని తులసి వెళ్ళిపోతుంది. పరంధామయ్య కూడా నందుని తిడతాడు. ఇదంతా తన వల్లే అని శ్రుతిని తిడతాడు. శుభవార్తని ఇంట్లో వాళ్ళందరికీ పంచుకోవచ్చు కదా అని అంటాడు. కానీ ప్రేమ్ మాత్రం తండ్రికి గడ్డి పెట్టి భార్యని తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు.

Also Read: మోనిత, చారుశీల ప్లాన్ సక్సెస్ - దీపకు గుండెపోటు, హిమ మాటనమ్మని శౌర్య!

శ్రుతి జరిగింది తలుచుకుని బాధపడుతుంటే ప్రేమ్ ఓదారుస్తాడు. ఈ గొడవ అంతా తన తొందరపాటు వల్లే అని శ్రుతి బాధపడుతుంది. సామ్రాట్, తులసి కూడా జరిగిన దాని గురించి మాట్లాడుకుంటారు. తను గొడవకి దిగితే తన పిల్లల మనసులు గాయపడుతున్నాయని బాధపడుతుంది. లాస్య మాటలకి నందగోపాల్ ప్రభావితం అవుతున్నాడని తులసి తనని వెనకేసుకొస్తుంది. ఇప్పటికే చాలా త్యాగాలు చేసి కోల్పోయారు అని సామ్రాట్ అంటాడు. కానీ తులసి మాత్రం బాధగా కూర్చుని ఉంటుంది. తన మూడ్ మార్చేందుకు కాఫీ చేసి తీసుకొస్తానని కిచెన్ లోకి వెళతాడు. వేడి గిన్నె పట్టుకునేసరికి సామ్రాట్ చెయ్యి కాలిపోతుంది. తులసి కంగారుగా వచ్చి కాలిన సామ్రాట్ చేతికి వెన్న రాస్తుంది.

తను కావాలనే చెయ్యి కాల్చుకున్నా అని సామ్రాట్ చెప్తాడు. ఎంత మాట్లాడించినా మాట్లాడలేదు మీరు డల్ గా ఉండేసరికి ఇలా చేశానని అంటాడు. నందు కూడా ప్రేమ్ అవమానించిన దాని గురించి ఆలోచిస్తూ రగిలిపోతాడు. లాస్య వచ్చి మాట్లాడుతుంది. జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నా ఎందుకు ఇలా చేశానా అని బాధపడుతున్న అని అంటాడు. ఇదంతా తులసి వల్ల జరిగిందని మళ్ళీ లాస్య ఎక్కిస్తుంది. ‘శ్రుతి, ప్రేమ్ కి మంచిగా పార్టీ ఇచ్చి అందరి ముందు నిన్ను గొప్పగా చూస్తాను. గ్రాండ్ గా పార్టీ ఇస్తాను. కానీ తులసిని ఇంట్లో వాళ్ళ దగ్గరకి రాకుండా చెయ్యమని’ లాస్య అంటుంది. అందుకు నందు సరే అంటాడు.

తరువాయి భాగంలో..

శ్రుతి, ప్రేమ్ ని సర్ ప్రైజ్ చేసేందుకు తులసి ఇంట్లో పార్టీ ఏర్పాటు చేస్తారు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటే లాస్య దివ్యకి ఫోన్ చేస్తుంది. తులసి ఇంట్లో పార్టీ చేసుకుంటున్నామని దివ్య చెప్పేసరికి లాస్య నందుకి ఎక్కించి అక్కడికి తీసుకెళ్తుంది. అటు శ్రుతి డాన్స్ చేస్తూ కిందపడి పొట్ట పట్టుకుని నొప్పి అని అల్లాడిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Child In Borewell: 68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
Deed Body Parcel Case Update: ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
Embed widget