(Source: ECI/ABP News/ABP Majha)
Janaki Kalaganaledu April 7th: అప్పు కట్టడం కుదరదని తెగేసి చెప్పిన విష్ణు- జానకిని తప్పించేందుకు మనోహర్ కుట్ర
జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
బిల్డర్ మధు మీద ఎఫ్ఐఆర్ రాస్తుంటే మనోహర్ వచ్చి ఎందుకు చేస్తున్నావాని అరుస్తాడు. నేనే ప్రత్యక్ష సాక్షి కదా అని జానకి చెప్తే పోలీస్ సాక్ష్యం చెల్లదని చెప్తాడు. కాసేపు దీని గురించి ఇద్దరూ ఒకరికొకరు వాదించుకుంటారు. జానకి మాత్రం బాధితుడికి సపోర్ట్ చేస్తుంటే మనోహర్ మాత్రం వాదిస్తాడు. ఎంత చెప్పినా దారిలోకి రావడం లేదని మనసులో అనుకుని ఎలాగైనా తనని వదిలించుకోవాలని అనుకుంటాడు. వెంటనే మధుకి ఫోన్ చేసి ప్రాబ్లం మొదలైందని చెప్తాడు. బతిమాలినా, బెదిరించినా కానిస్టేబుల్ ఎదురుతిరుగుతుందని అంటాడు. దాన్ని కూడా వేసేయమంటావా అని మధు అంటే వద్దని చెప్తాడు. నీ మీద ఎఫ్ఐఆర్ కూడా రాసేసిందని చెప్పేసరికి మధు షాక్ అవుతాడు. నా తంటాలు ఏవో పడి కేసు నుంచి తప్పిస్తానని మనోహర్ చెప్తాడు. లోపలికి వచ్చిన మనోహర్ ఎస్పీతో మాట్లాడానని అబద్ధం చెప్పి నమ్మిస్తాడు. తెల్లారితే నీ బతుకు తెల్లారిపోతుందని మనసులో అనుకుంటాడు.
Also Read: పెళ్ళైన తర్వాత తొలిసారి పుట్టింటికి వెళ్ళిన కావ్య- అపర్ణని రెచ్చగొట్టి పైశాచికానందం పొందిన రుద్రాణి
జ్ఞానంబ భర్తతో కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా ధమయంతి వస్తుంది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చి నగలు తీసుకోమని చెప్తుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు తిరిగి ఇవ్వాలంటే కష్టం కదా అని గోవిందరాజులు అంటుంటే జానకి వింటుంది. చేతిలో డబ్బు లేకపోతే తాకట్టు పెట్టిన నగలు అమ్మేసుకోమని సలహా ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విని రామ కూడా బాధపడతాడు. నా నగలు విడిపించుకోలేనప్పుడు వాటిని అమ్మేద్దామని జ్ఞానంబ అనేసరికి కొడుకు బాధగా వెళ్ళిపోతాడు. గదిలోకి వెళ్ళిన రామ, జానకి దీని గురించి మాట్లాడుకుంటారు. పరువు కాపాడుకోవడానికి అత్తయ్య నగలు అమ్మడానికి నిర్ణయించుకున్నారని జానకి చెప్పేసరికి రామ షాక్ అవుతాడు. ఇప్పటికిప్పుడు రూ.5 లక్షలు అంటే ఎక్కడ నుంచి వస్తాయని జానకి అంటే విష్ణు కోసమే కదా అవి కట్టింది వాడే తీర్చాలని రామ అనడం మల్లిక వింటుంది.
Also Read: కనురెప్పల కాలంలోనే కథ అంతా మారిపోయిందే- ఖుషిని దూరం చేసేందుకు అభిమన్యు కుట్ర
విష్ణు కోసం అప్పు చేశాం ఇప్పుడు వాడి పరిస్థితి బాగానే ఉంది కదా తీర్చమని అడగవచ్చు కదా అనేసరికి మల్లిక షాక్ అవుతుంది. అలా అడిగితే పిల్లలు ఎక్కడ దూరం అవుతారోనని అత్తయ్య అడగరని జానకి అంటుంది. పిల్లలకి బాధ్యత తెలిసేలా చేయాలని అంటాడు. మల్లిక మాయ మాటల్లో పడి విష్ణు దూరమవుతున్నాడని బాధపడతాడు. నగలు విడిపించమని విష్ణుని అడుగుతానని రామ అనేసరికి మల్లిక నోరెళ్ళబెడుతుంది. వెంటనే వెళ్ళి మొగుడికి బ్రెయిన్ వాష్ చేయాలని మల్లిక పరుగులు తీస్తుంది. విష్ణుని డబ్బులు అడుగుతానని బయటకి పిలుస్తాడు. అమ్మ నగలతో మళ్ళీ కనిపించాలంటే ఐదు లక్షలు కట్టమని చెప్తాడు. కట్టడం కుదరదని విష్ణు తెగేసి చెప్తాడు. అందరి వాటా ఉన్న స్వీట్ షాపు విడిపించడం మానేసి ఈ నగల గోల ఏంటని మల్లిక అంటుంది.