Janaki Kalaganaledu October 5th: జ్ఞానంబ ఇంటికి బాలత్రిపుర సుందరీ దేవి- వేడుకగా బొమ్మల కొలువు చేసిన జానకి, మల్లిక ప్లాన్ ఫెయిల్
టైమ్ దొరికితే చాలు జానకిని ఎలాగైనా ఇరికించాలని ట్రై చేస్తుంది మల్లిక. ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు జరగకుండా చెయ్యాలని ప్లాన్ వేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జ్ఞానంబ ఇంట్లో అదనరు కలిసి సంతోషంగా బొమ్మల కొలువుకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మల్లిక మాత్రం పోలేరమ్మకి కనిపిస్తే ఏదో ఒక పని చెప్తుందేమో అని జారుకోవడం జ్ఞానంబ కంట పడుతుంది. ఇక జ్ఞానంబ గుమ్మం వైపు పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. లీలావతి పెద్దమ్మకి చెప్పాను కదా ఒకసారి ఫోన్ చేద్దామని మల్లిక చేస్తుంది. పిల్లలు బొమ్మల కొలువుకి రాకుండా ఆపమని చెప్పాను చేశావా లేదా అని మల్లిక అడుగుతుంది. ఆపేశాను అక్కడికి వస్తే వాళ్ళ పిల్లలు కూడా అఖిల్ లాగా తయారావుతారని భయపెట్టేశాను అని చెప్తుంది. ఇక పిల్లలు రారని అంటుంది. పిల్లలు రారు అని మల్లిక డాన్స్ చేయడం గోవిందరాజులు చూస్తాడు.
పిల్లలు ఇంకా రాలేదని అనుకుంటూ జానకి ఫోన్ చేస్తుంది. బొమ్మల కొలువుకి పిల్లల్ని పంపిస్తా అన్నారు కదా అని జానకి అడుగుతుంది. దానికి లేదమ్మా ఇప్పటికే మీ ఇంట్లో గొడవ అయిందంట కదా మళ్ళీ ఎందుకు గొడవ అని మా పిల్లల్ని పంపించట్లేదని ఫోన్ పెట్టేస్తుంది. జానకి మిగతా వాళ్ళకి ఫోన్ చేసినా అందరూ ఇదే మాట చెప్తారు. ఆ మాటకి ఇంట్లో అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. పోయినసారి అమ్మలక్కలు వాయినం తీసుకోకుండా పోతే ఈసారి ఇంటికి రావడానికి కూడా ఇష్టపడటం లేదేమో అని మల్లిక అనేసరికి అనవసరంగా లేనిపోనివి ఊహించుకుని మాట్లాడకు అని జానకి గట్టిగా చెప్తుంది.
Also Read: అనసూయ మాట విని షాకింగ్ నిర్ణయం తీసుకున్న సామ్రాట్- గాల్లో తేలిపోతున్న లాస్య
‘తను చెప్పిన విధానం కరెక్ట్ కాదేమో కానీ అదే వాస్తవం అని జ్ఞానంబ కూడా అంటుంది. ఒకప్పుడు మన ఇంటికి పేరంటానికి రావాలి అంటే పుణ్యం చేసుకుని ఉండాలి అని భావించే వాళ్ళు ఇప్పుడు మన ఇంటి గుమ్మం తొక్కడమే పాపం అనుకుంటున్నారు. నేను బొమ్మల కొలువు వద్దు అంటే ఒప్పించి పెట్టించావ్ ఇప్పుడు చూడు ఏమైందో’ అని జ్ఞానంబ బాధపడుతూ ఉంటే అప్పుడే ఒక పాప ఎంట్రీ ఇస్తుంది. తనని చూసి అందరూ సంతోషిస్తే మల్లిక మాత్రం బిత్తరపోతుంది. పిల్లలు ఎవరు రారని లీలావతి పెద్దమ్మ చెప్పింది కదా మరి ఈ పిల్ల ఎవరు అని మల్లిక అనుకుంటుంది. ఎవరండీ ఆ పాప మనమెప్పుడు చూడలేదని రామా అడుగుతాడు.
పాప పేరు శ్రీ.. తను ఒక రోజు స్కూల్ కి వెళ్తుంటే కళ్ళు తిరిగి పడిపోతుంటే వాళ్ళ పేరెంట్స్ జాగ్రత్తగా అప్పజెప్పాను. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ ఉంటుందని జానకి చెప్తుంది. ఇప్పుడు బొమ్మల కొలువు కోసం పిలిచావా వదిన అని వెన్నెల అడుగుతుంది. లేదు నేను పిలవలేదు ఏం పని మీద వచ్చావ్ అని జానకి అడిగితే స్కూల్ కి సెలవు ఇచ్చారు నిన్ను చూడాలని అనిపించింది అందుకే అమ్మ వాళ్ళతో చెప్పి వచ్చాను అని శ్రీ చెప్తుంది. సాక్ష్యాత్తు ఆ బాలత్రిపుర సుందరి దేవి ఇంటికి వచ్చినట్టు ఉందని గోవిందరాజులు అంటాడు. బొమ్మల కొలువు జరగదని కంగారు పడ్డాను మనం చేసిన పాప పుణ్యాలు తిరిగి దొరుకుతాయనేదానికి ఇదే నిదర్శనం, జానకి చేసిన మంచి పని ఈ రూపంలో ప్రతి సూచనలు ఇచ్చిందని జ్ఞానంబ మెచ్చుకుంటుంది.
Also Read: బయటపడిన ఆదిత్య అబద్ధం, షాకైన సత్య- మాధవ్ కుట్ర వినేసిన రుక్మిణి