News
News
X

RC15: మొన్న 'అధికారి', ఇప్పుడు 'సిటిజెన్' - శంకర్ త్వరగా టైటిల్ చెప్పవయ్యా!

రామ్ చరణ్, శంకర్ సినిమాకి సంబంధించి చాలా టైటిల్స్ వినిపిస్తున్నాయి.

FOLLOW US: 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూణే, హైదరాబాద్, రాజమండ్రిలలో చిత్రీకరించారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి టైటిల్ గా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. 

సినిమా మొదలైన కొత్తలో 'విశ్వంభర' అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత 'సర్కారోడు', 'ఆఫీసర్' ఇలా చాలా టైటిల్స్ వినిపించాయి. రీసెంట్ గా 'అధికారి' అనే టైటిల్ ను ఖాయం చేశారని అన్నారు. ఇప్పుడు 'సిటిజెన్' అనే మరో పేరు వినిపిస్తోంది. దర్శకుడు శంకర్ సినిమా టైటిల్ అనౌన్స్ చేసేవరకు ఈ టైటిల్ లిస్ట్ పెరుగుతూనే ఉండేలా ఉంది. దీంతో అభిమానులు త్వరగా టైటిల్ అనౌన్స్ చేయమని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా అక్టోబర్ నాటికి పూర్తవుతుందని అంటున్నారు. ఈ సినిమా నిర్మాణం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు నిర్మాత దిల్ రాజు. తన బ్యానర్ లో వస్తోన్న 50వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు గెటప్స్ లో కనిపిస్తారట. ఒకటి స్టూడెంట్ గెటప్ కాగా.. మరొకటి ప్రభుత్వ ఉద్యోగి అని తెలుస్తోంది. శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర వంటి తారలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. 

Also Read: ప్రభాస్ పార్టీలో అమితాబ్, దుల్కర్ - వైరల్ అవుతోన్న వీడియో

Also Read: చైతుతో డేటింగ్ రూమర్స్ - మిడిల్ ఫింగర్ చూపించిన శోభితా?

View this post on Instagram
 
A post shared by Ram Charan (@alwaysramcharan)

Published at : 26 Jun 2022 03:55 PM (IST) Tags: ram charan Shankar RC15 Adhikari citizen

సంబంధిత కథనాలు

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Janaki Kalaganaledu August 10th Update: కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దొంగల్ని చితక్కొట్టిన జానకి - జ్ఞానంబ సర్‌ప్రైజ్ - నోరెళ్ళబెట్టిన మల్లిక

Janaki Kalaganaledu August 10th Update: కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దొంగల్ని చితక్కొట్టిన జానకి - జ్ఞానంబ సర్‌ప్రైజ్ - నోరెళ్ళబెట్టిన మల్లిక

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

Swathimuthyam Release Date : దసరా సీజన్ టార్గెట్ చేసిన బెల్లంకొండ 

Swathimuthyam Release Date : దసరా సీజన్ టార్గెట్ చేసిన బెల్లంకొండ 

టాప్ స్టోరీస్

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్

IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్

Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి - రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి - రెండో ప్రమాద హెచ్చరిక జారీ