Prabhas: ప్రభాస్ పార్టీలో అమితాబ్, దుల్కర్ - వైరల్ అవుతోన్న వీడియో
ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకోవడంతో టీమ్ అందరికీ ప్రభాస్ గ్రాండ్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల 'ఆదిపురుష్' సినిమాను పూర్తి చేసిన ఆయన ఇప్పుడు 'సలార్', 'ప్రాజెక్ట్ K' సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మధ్యలో 'సాహో', 'రాధేశ్యామ్' రూపంలో పెద్ద ప్లాప్స్ వచ్చినా.. ప్రభాస్ రేంజ్ మాత్రం తగ్గలేదు. ఆయన నటిస్తోన్న సినిమాల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకోవడంతో టీమ్ అందరికీ ప్రభాస్ గ్రాండ్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ప్రాజెక్ట్ K'లో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. 'ప్రాజెక్ట్ K' టీమ్ మొత్తానికి హైదరాబాద్ లోని హోటల్ సితారలో పార్టీ ఏర్పాటు చేశారు ప్రభాస్. ఈ పార్టీకి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లతో పాటు దుల్కర్ సల్మాన్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోను ప్రభాస్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే ప్రాజెక్ట్ K షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Also Read : సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు
Also Read : వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్
View this post on Instagram