Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్
Prithviraj Sukumaran's Telugu Movie Kaduva Teaser Is Here: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'కడువా' సినిమా తెలుగు టీజర్ నేడు విడుదల అయ్యింది.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు ప్రేక్షకుల్లో కొంత మందికి తెలుసు. ఎలాగంటారా? మణిరత్నం 'విలన్' సినిమాలో విక్రమ్, ఐశ్వర్యతో పాటు నటించారు. ఓటీటీ వేదికల్లో ఆయన సినిమాలను కొంత మంది చూశారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ కథల ఎంపిక ఎలా ఉంటుందో? పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' చూస్తే తెలుస్తుంది. మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్'కు అది రీమేక్. మాతృకలో పృథ్వీరాజ్ నటించారు. తెలుగులో డానియల్ శేఖర్ పాత్రను రానా చేశారు కదా! మలయాళంలో ఆ పాత్రను పృథ్వీరాజ్ చేశారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమా పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన 'లూసిఫర్'కు రీమేక్. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకంటే...
Also Read : బటర్ ఫ్లై కిస్ చూశారు, టీజర్ చూస్తారా? - వైష్ణవ్ తేజ్, కేతిక జోడీ రెడీ
Happy to launch the teaser of #కడువా #Kaduva
— Nani (@NameisNani) June 25, 2022
My best wishes to @PrithviOfficial gaaru and his team 🤗
Here’s the linkhttps://t.co/p4oeKucNbW@vivekoberoi @iamsamyuktha_ #Shajikailas @JxBe @PrithvirajProd @magicframes2011
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన మలయాళ సినిమా 'కడువా' తెలుగులో అదే పేరుతో విడుదల కానుంది. ఈ రోజు నేచురల్ స్టార్ నాని ఆ సినిమా టీజర్ విడుదల చేశారు. చూస్తే మాంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ అనే ఫీలింగ్ కలుగుతోంది. జూన్ 30న సినిమా విడుదల కానుంది. ఆ రోజే ఫలితం కూడా తెలుస్తుంది. షాజీ కైలాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించారు.
Also Read : డాడీ డ్యూటీస్‌లో రాహుల్ రవీంద్రన్ - చిల్డ్రన్ ఫోటోలు షేర్ చేసిన చిన్మయి
View this post on Instagram