Chinmayi Sripada: డాడీ డ్యూటీస్‌లో రాహుల్ రవీంద్రన్ - చిల్డ్రన్ ఫోటోలు షేర్ చేసిన చిన్మయి
గాయని చిన్మయి, హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కవలలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. అందులో ఒక చిన్నారి ఫొటోను చిన్మయి షేర్ చేశారు.
ఒక అమ్మాయి... ఒక అబ్బాయి... గాయని చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) నాలుగు రోజుల క్రితం కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే... చిల్డ్రన్ ఫేస్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి.
'డాడీ డ్యూటీస్‌లో రాహుల్ రవీంద్రన్' అంటూ చిన్మయి ఒక ఫోటో షేర్ చేశారు. అందులో చిన్నారిని లాలిస్తున్న రాహుల్ ఉన్నారు. మరొక ఫోటోలో చిన్నారిని డాక్టర్ ఎత్తుకుని ఉన్నారు. తానూ గర్భవతి అయినప్పటి నుంచి ఆ డాక్టర్ తనను ఎంత బాగా చూసుకున్నారో... ఆ పోస్టులో చిన్మయి వివరించారు.
Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?
గర్భవతిగా ఉన్నప్పటి ఫోటోలను చిన్మయి ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. దాంతో సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చారా? అని చాలా మందికి సందేహం కలిగింది. ఆమెను ప్రశ్నించారు కూడా! వ్యక్తిగత వివరాల విషయంలో గోప్యత పాటించడం వల్ల గర్భంతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయలేదని చిన్మయి తెలిపారు. సరోగసీ పుకార్లను ఖండించారు.
Also Read : చోర్ బజార్ సినిమా రివ్యూ: బచ్చన్ సాబ్‌గా ఆకాష్ పూరి మెప్పించాడా? లేదా?
View this post on Instagram
View this post on Instagram