Ranga Ranga Vaibhavanga Teaser: బటర్ ఫ్లై కిస్ చూశారు, టీజర్ చూస్తారా? - వైష్ణవ్ తేజ్, కేతిక జోడీ రెడీ
Panja Vaisshnav Tej and Ketika Sharma: మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ , కేతికా శర్మ జంటగా నటించిన సినిమా 'రంగ రంగ వైభవంగా'. టీజర్ రెడీ అయ్యింది.
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటించిన సినిమా 'రంగ రంగ వైభవంగా'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ రెడీ అయ్యింది. ఈ నెల 27న (సోమవారం) విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
Also Read : డాడీ డ్యూటీస్‌లో రాహుల్ రవీంద్రన్ - చిల్డ్రన్ ఫోటోలు షేర్ చేసిన చిన్మయి
'రంగ రంగ వైభవంగా' సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరూ డాక్టర్లుగా కనిపించనున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో బటర్ ప్లై కిస్, ఆ తర్వాత విడుదల చేసిన 'కొత్తగా లేదేంటి...' పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ దత్ సినిమాటోగ్రాఫర్.
Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?
View this post on Instagram
View this post on Instagram