Nagachaitanya: చైతుతో డేటింగ్ రూమర్స్ - మిడిల్ ఫింగర్ చూపించిన శోభితా?
రీసెంట్ గా శోభితాకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో శోభితా నవ్వుతూ.. సడెన్ గా సీరియల్ లుక్ తో మిడిల్ ఫింగర్ చూపించింది.
టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల డేటింగ్ చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. వాళ్లిద్దరూ మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు..? డేటింగ్ వరకు స్టోరీ ఎలా వెళ్లింది..? ఇలా రకరకాల కోణాల్లో కథనాలను ప్రచురిస్తున్నారు. ఈ రూమర్స్ చైతు మాజీ భార్య, స్టార్ హీరోయిన్ సమంత క్రియేట్ చేసిందంటూ ప్రచారం జరగగా.. ఆమె స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. అయితే చైతు మాత్రం ఈ వార్తలను లైట్ తీసుకున్నారు.
తన సినిమాలతో బిజీ అయిపోయారు. వరుసగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నారు కానీ ఈ డేటింగ్ రూమర్స్ పై మాత్రం రియాక్ట్ అవ్వలేదు. నటి శోభితా కూడా ఈ వార్తలపై స్పందించలేదు. కానీ రీసెంట్ గా ఆమెకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో శోభితా నవ్వుతూ.. సడెన్ గా సీరియల్ లుక్ తో మిడిల్ ఫింగర్ చూపించింది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. డేటింగ్ రూమర్స్ పై శోభితా రియాక్షన్ అంటూ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
అయితే శోభితా సోషల్ మీడియా అకౌంట్స్ లో ఎక్కడా కూడా ఈ వీడియో కనిపించలేదు. దీంతో పాత వీడియోను ఇప్పుడు బయటకు తీసి కావాలనే వైరల్ చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. తెలుగులో 'గూఢచారి', 'మేజర్' వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ముంబైలో బర్త్ డే పార్టీ చేసుకున్నప్పుడు చైతు అక్కడకు వెళ్లారని.. అలా వారి మధ్య స్నేహం కుదిరి, డేటింగ్ వరకు వెళ్లిందంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
Also Read : సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు
Also Read : వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్
To everyone who made a mess
— Arisetty Prasad (@PrasadAGVR) June 24, 2022
A reply can't better than this 💥💥 pic.twitter.com/alHr0qb0gV
View this post on Instagram