అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today December3rd: శ్రీవల్లి చేసిన తప్పు తనపై వేసుకున్న తిరుపతి గతి ఏమైంది..? ప్రేమ నగలు వాళ్ల పుట్టింటి వారు తీసుకున్నారా లేదా..?

Illu Illalu Pillalu Serial Today Episode December3 rd: ప్రేమ నగలు తీసుకుని తన ఇంటికి తిరుపతి వెళ్లగా..వాటిని బయటపడేసి రామరాజును అవమానిస్తారు. దీంతో తిరుపతిని రామరాజు ఇంట్లోకి రావొద్దని చెబుతాడు.

Illu Illalu Pillalu Serial Today Episode : తిరుపతి ప్రేమ నగలు తీసుకొచ్చి రామరాజుకు ఇవ్వడంతో ఆయనతోపాటు ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. అందరూ ఈ నగలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తారు. తిరుపతి పిచ్చిపిచ్చి సమాధానాలు ఇస్తుండటంతో  రామరాజు గూబ పగులగొడతాడు. నగులు తిరిగొచ్చాయని ఆనందించాలి తప్ప ఆరాలు తీయకూడదంటాడు. నగలు గురించి అంత పెద్దగొడవ జరుగుతుంటే అందరూ తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు...ఇప్పుడు హఠాత్తుగా  ఎక్కడ నుంచి వచ్చాయని నిలదీస్తాడు. దీంతో శ్రీవల్లి చెప్పిన స్టోరీయే తిరుపతి రామరాజుకు చెప్తాడు. ప్రేమకు ఈ నగలు దూరం కాకూడదన్న ఉద్దేశంతో తానే ఈ నగలు దాచిపెట్టి గిల్ట్ నగలు వారికి ఇచ్చానని చెబుతాడు. దీంతో మరోసారి  రామరాజు తిరుపతి చెంప పగులగొడతాడు. శ్రీవల్లి చేసిన పనికి తిరుపతి బాబాయి దెబ్బలు తింటున్నా గానీ  శ్రీవల్లి అలాగే చూస్తూ ఉండటం చూసి ప్రేమకు కోపం వస్తుంది. ఇంతలో రామరాజు మరింత కోపంతో తిరుపతిపై రెచ్చిపోతాడు.మీ వాళ్లంతా నన్ను ఏవిధంగా అవమానించాలా అని కాచుకుని కూర్చుంటే...ఇలాంటి సమయంలో నువ్వు చేసే పని ఇదా అంటూ మండిపడతాడు. నువ్వు చేసిన పని వల్ల మీ వాళ్ల నున్నఎంతలా అవమానించారో చూశావ్ కదా...ఇప్పుడు నువ్వు  ఈనగలు తీసుుకురాకుంటే మీ వాళ్లు అన్నట్లు మేం నిజంగానే నన్ను మరోసారి పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కించేవారు కదా అంటాడు.
                   గొడవ పెద్దది అవుతుండటంతో  మధ్యలో కల్పించుకున్న  శ్రీవల్లి రామరాజును కూల్ చేస్తుంది. ప్రేమ కోసమే ఇదంతా చేశానని చెబుతున్నాడు  కాబట్టి క్షమించి వదిలేయాలని కోరుతుంది. అటు బుజ్జమ్మ కూడా చెప్పడంతో  రామరాజు  కొంచెం మెత్తబడతాడు. అయినా మా వాళ్లు మనల్ని అవమానించడానికి ఇదే కావాలా ఏంటి..? ముందు వాళ్ల నగలు వాళ్ల ముఖాన కొట్టండంటూ బుజ్జమ్మ చెప్పడంతో రామరాజు సరేనంటాడు. నాకు చెప్పిన విషయాలన్నీ వాళ్లకు చెప్పి ఈ నగలు నువ్వే వాళ్లకు ఇవ్వు అంటూ తిరుపతిని పంపిస్తాడు. నగలన్నీ తీసుకుని తిరుపతి వాళ్ల ఇంటికి తీసుకెళ్లి ఇస్తాడు. ఇప్పటి వరకు మాకు తెలియదని అన్నారుకదా...ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చాయని వాళ్లు ప్రశ్నిస్తారు. అక్కడ కూడా తిరుపతి పిచ్చిపిచ్చిగా మాట్లాడటంతో వాళ్లు కూడా చెంప పగులగొడతారు. అప్పుడు నగలు ఎక్కడ ఉన్నయో తెలియదని ఇప్పుడు పంపిస్తే వెంటనే తీసుకుంటామని ఎలా అనుకుంటారని నిలదీస్తారు. చాలా తెలివిగా నగలు కొట్టేసి గిల్ట్ నగలు పంపించారు.ఇప్పుడు పోలీసులకు పట్టిస్తామని బెదిరించడంతో భయపడి నగలు తీసుకొచ్చారా అంటూ ప్రియా తల్లిదండ్రులు రామరాజును నిలదీస్తారు. దీంతో రామరాజు తిరుపతిపై మండిపడతాడు.నువ్వు చేసిన ఘనకార్యం ఏంటో వాళ్లకు చెప్పు అంటాడు. దీంతో జరిగిందంతా  తిరుపతి వాళ్లకు చెబుతాడు. దీంతో రామరాజు మరింత రెచ్చిపోతాడు. ఇప్పుడు నిజం తెలిసింది కదా అంటాడు. నగలు గురించి నాకు తెలియదని చెప్పినా....నేనే ఆ నగలు కొట్టేశానంటూ  అబంఢాలు వేశారని మండిపడతాడు. దీంతో ప్రియా అత్త ఆ నగలు రోడ్డుపై విసిరేస్తుంది. నగలు దాచిపెట్టి ఇప్పుడు కట్టుకథలు అల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నగలు గురించి రామరాజు బావకు ఏ పాపం తెలియదని తిరుపతి అనగానే...తమ్ముడి చెంప పగులుగొడుతుంది. మన ఇంటికి నమ్మకద్రోహం చేసి నాన్న ప్రాణాలు పోవడానికి కారణమైన వాడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావని మండిపడుతుంది. నీ కారణంగానే  నా చెల్లెలు దూరమైందని.. నీ కొడుకు కారణంగా  నా మేనకోడలు దూరమైందని...వాళ్లు దూరమైతేనే లెక్కచేయలేదని ఈ నగలు ఒక లెక్కా నాకు అంటుంది. ముష్టి వేస్తున్నాను తీసుకోండంటూ  వాళ్లు అక్కడి నుంచి ఇంటిలోపలికి వెళ్లిపోతారు. ఇంతంలో ప్రియా తల్లి అక్కడికి వచ్చి ఆ నగలన్నీ ఏరి  ప్రియా చేతికి ఇస్తుంది. ఈ నగలు నీవేనని అవి నీదగ్గరే ఉండనివ్వమని చెబుతుంది. ఈ నగల గురించి ఇన్ని గొడవలు జరిగిన తర్వాత కూడా ఇంకా నా దగ్గర ఉంచమంటావా అని అడుగుతుంది.
ఇవి మీ నాయనమ్మ నగలు...వారసత్వంగా  నీకే చెందాలని చెబుతుంది.  వీటిపై హక్కు నీపుట్టింటి వాళ్లకు గానీ, నీ అత్తింటి వాళ్లకుగానీ లేదని చెప్పి వెళ్లిపోతుంది. 


                                 అందరూ లోపలకి వెళ్దాం పదండి అని తిరుపతి అనగా...రామరాజు అతన్ని బయటకు గెంటేస్తాడు.ఇదంతా నీవల్లే జరిగిందని...మరోసారి  నా ఇంటి గుమ్మం తొక్కొద్దని గట్టిగా హెచ్చరిస్తాడు. ఇక నువ్వు మామూలుగా కూడా ఇంట్లోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటాడు.
నర్మద, ప్రేమ ఇద్దరూ కలిసి శ్రీవల్లిని తిడతారు. నీవల్లే ఇవాళ తిరుపతి బాబాయి ఇంటికి దూరమయ్యాడని మండిపడతారు. ప్రేమ నగలు కొట్టేసింది నువ్వేనని తెలిసినా కూడా వదిలేశామని చెబుతారు. ఇప్పటికైనా మారతావని క్షమించి వదిలేశామని...ఇక నుంచైనా మారి ఇంటి విషయాల్లోగానీ, మా విషయాల్లో గానీ జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తారు....

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget