విదేశాలకు చెక్కేసిన మహేష్ బాబు - అయ్యగారికి షాకేనా? - సమంత ఆస్తుల లిస్టు పెద్దదే - ఈ రోజు సినీవిశేషాలివే!
విదేశాలకు చెక్కేసిన మహేష్ బాబు - అయ్యగారికి షాకేనా? - సమంత ఆస్తుల లిస్టు పెద్దదే - ఈ రోజు సినీవిశేషాలివే!
మళ్ళీ ఫారిన్ వెళ్ళిన మహేష్ & ఫ్యామిలీ - లేటుగా త్రివిక్రమ్ సినిమా షెడ్యూల్?
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) మధ్య సఖ్యత లేదని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీళ్ళిద్దరి కలయికలో సినిమా లేటెస్ట్ షెడ్యూల్ మరింత ఆలస్యంగా స్టార్ట్ కానుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
హద్దు మీరుతున్న సమంత, చిట్టిబాబు మాటల యుద్ధం - చెవిలో వెంటుకలపై నిర్మాత రియాక్షన్
‘శాకుంతలం’ విడుదల తర్వాత నిర్మాత, నటుడు చిట్టిబాబు హీరోయిన్ సమంతపై తీవ్ర విమర్శలు చేయడం సంచనలం కలిగింది. చిట్టిబాబు వ్యాఖ్యలుకు సమంతా కౌంటర్ ఇవ్వడంతో, ప్రతిగా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య గొడవ హద్దు మీరింది. ఇటీవల చెవిలో వెంటుకలపై సమంత చేసిన ఇన్‌స్టాస్టోరీపై నిర్మాత చిట్టిబాబు మండిపడ్డారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
'ఏజెంట్' సినిమా రివ్యూ : అయ్యగారు అఖిల్‌ని నంబర్ వన్ చేసేలా ఉందా? లేదా?
అక్కినేని ఫ్యామిలీ హీరోలకు రొమాంటిక్ ఇమేజ్ ఉంది. అయితే, తనకు యాక్షన్ సినిమాలు అంటే ఇష్టమని అఖిల్ అక్కినేని (Akhil Akkineni) చెప్పేశారు. అంతే కాదు... 'ఏజెంట్' (Agent Movie) కోసం వైల్డ్ యాక్షన్ హీరోగా అయిపోయారు. సిక్స్ ప్యాక్ చేశారు. హెయిర్ స్టైల్ మార్చారు. ఆయనకు తోడు మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన, సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వం వహించిన ఈ సినిమా (Agent Review) ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
పొన్నియిన్ సెల్వన్ 2 రివ్యూ: మణిరత్నం మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఎలా ఉంది?
గతేడాది సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ తమిళనాట ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ. 500 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష వంటి భారీ స్టార్ట్ కాస్టింగ్, ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ మ్యాజిక్ ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా మార్చాయి. ప్రముఖ తమిళ రచయత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మొదటి భాగం కేవలం ట్రైలర్ మాత్రమేనని, రెండో భాగం మరింత అద్భుతంగా ఉంటుందని సినిమా ప్రమోషన్‌లో స్టార్లందరూ చెప్పారు. మరి మణిరత్నం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ హిట్ అయిందా? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
లగ్జరీ కార్లు, విలాసవంతమైన బంగళా, ఖరీదైన వస్తువులు- సమంత లైఫ్ స్టైల్ చూస్తే అవాక్కవ్వాల్సిందే!
అందాల నటీమణి సమంత 36వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. దక్షిణాది సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఆమెకు నెటిజన్లు, సినీ స్టార్స్ జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన సమంత, అద్భుత నటనతో సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీమణులలో ఒకరైన సమంత, లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)