News
News
వీడియోలు ఆటలు
X

Samantha vs Chitti Babu: హద్దు మీరుతున్న సమంత, చిట్టిబాబు మాటల యుద్ధం - చెవిలో వెంటుకలపై నిర్మాత రియాక్షన్

నటి సమంత, నిర్మాత చిట్టిబాబు నడుమ పంచాయితీ తీవ్ర రూపం దాల్చింది. తగ్గేదే లేదంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. అటు ఇటు తిరిగి గొడవ ‘వెంట్రులక’ దాకా వచ్చారు.

FOLLOW US: 
Share:

‘శాకుంతలం’ విడుదల తర్వాత నిర్మాత, నటుడు చిట్టిబాబు హీరోయిన్ సమంతపై తీవ్ర విమర్శలు చేయడం సంచనలం కలిగింది. చిట్టిబాబు వ్యాఖ్యలుకు సమంతా కౌంటర్ ఇవ్వడంతో, ప్రతిగా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య గొడవ హద్దు మీరింది.

ఇంతకీ సమంత- చిట్టిబాబు పంచాయితీ ఏంటి?

గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతంలం’ సినిమా రీసెంట్ గా విడుదల అయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యింది. ‘శాకుంతలం’ డిజాస్టర్ గా మిగిలింది. ఈ నేపథ్యంలో నిర్మాత చిట్టిబాబు, ఈ సినిమాపై, నటి సమంతపై తీవ్ర విమర్శలు చేశారు. ‘శాకుంతలం’ చిత్రం తర్వాత సమంత స్టార్ హీరోయిన్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్లేనని చెప్పారు. అంతేకాదు, సమంతను ఇకపై హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ లేదన్నారు. ఆమెకు ముసలి ముఖం వచ్చిందంటూ దారుణంగా కామెంట్ చేశారు. అలాంటి ఫేస్ తో ‘శాకుంతలం’ సినిమా ఎలా చేసిందో అర్థం కావట్లేదన్నారు. కెమెరామెన్ ట్రిక్స్ ప్లే చేస్తే తప్ప తన ముసలి ముఖం దాయడం కష్టం అన్నారు. ఒకప్పుడు చాలా అందంగా ఉండే సమంతా అనేక రకాల జబ్బుల కారణంగా ముసలి ముఖం వచ్చిందన్నారు. ఆమె గ్లామరస్ రోజులు అయిపోయాయని, సపోర్టింగ్ రోల్స్‌ చేసే సమయం వచ్చిందన్నారు.  అంతేకాదు, సినిమా విడుదల సమయంలో సమంత సెంటిమెంట్ ను ప్లే చేయడం అలవాటుగా మారిందన్నారు. ఏడ్చి సానుభూతితో సినిమా సక్సెస్ సాధించాలని కోరుకోవడం మూర్ఖత్వం అన్నారు.

చిట్టిబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సమంత

చిట్టిబాబు వ్యాఖ్యలపై సమంతా కౌంటర్ ఇచ్చింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆయనపై సటైర్లు విసిరింది. చిట్టిబాబు చెవిలో వెంట్రుకలు ఎందుకు పెరిగాయో ఆలోచిస్తున్నట్లు చెప్పింది. చెవిలో వెంట్రుకలు పెరగడానికి కారణం గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నట్లు చెప్పింది. లైంగిక హార్మోన్ టెస్టోస్టిరాన్ అధికంగా విడుదల కావడం వల్లే చెవిలో అలా వెంట్రులకు పెరుగుతున్నాయని పోస్ట్ పెట్టింది. అంటే, మదంతో చిట్టిబాబు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని చెప్పకనే చెప్పుకొచ్చింది.

నేను మాట్లాడ్డం మొదలు పెడితే ఆమె సిగ్గుపడాల్సి వస్తుంది- చిట్టిబాబు

అటు సమంత చెవిలో వెంటుకల గురించి ప్రస్తావించడంపై చిట్టిబాబు మళ్లీ కౌంటర్ ఇచ్చారు. "నా చెవి వెంటుకలు, నా శరీరంలోని అనేక ఇతర భాగాలలో వెంటుకలు పెరగడాన్ని ఆమె గమనిస్తోంది. వాటిపై ఓ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అంటూ విరుచుకుపడ్డారు. సమంతా చాలా తెలివిగా మాట్లాడాలి అనుకుందని, తాను మాట్లాడ్డం మొదలు పెడితే ఆమె సిగ్గుపడాల్సి వస్తుందన్నారు. నా చెవిలో వెంట్రుకల గురించి మాట్లాడటం ఆపేసి, అసలు విషయాల గురించి మాట్లాడితే బాగుండేదన్నారు.   

సమంతా రూత్ ప్రభు ప్రస్తుతం వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ లో నటిస్తోంది. వరుణ్ ధావన్ తో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ రొమాంటిక్ చిత్రం ‘ఖుషి’లో కనిపించనుంది.

Read Also: లగ్జరీ కార్లు, విలాసవంతమైన బంగళా, ఖరీదైన వస్తువులు- సమంత లైఫ్ స్టైల్ చూస్తే అవాక్కవ్వాల్సిందే!

Published at : 28 Apr 2023 12:34 PM (IST) Tags: Samantha Chitti Babu Samantha VS Chitti Babu Samantha-Chitti Babu Controversy Shakunthalam movie

సంబంధిత కథనాలు

Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?

Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం