News
News
X

Bollywood Horror Movies: ఈ హిందీ హర్రర్ సినిమాల్లోని ఈ ఘటనలు నిజంగానే జరిగాయ్!

సాధారణంగా సినిమాలు అంటే కల్పిత కథలే ఎక్కువగా ఉంటాయి. దెయ్యం సినిమాలన్నీ చాలావరకు ఒకే విధంగా ఉంటాయి. ఒక

FOLLOW US: 

సాధారణంగా సినిమాలు అంటే కల్పిత కథలే ఎక్కువగా ఉంటాయి. దెయ్యం సినిమాలన్నీ చాలావరకు ఒకే విధంగా ఉంటాయి. ఒక ఇంట్లోకి  కొందరు వెళ్ళడం వాళ్ళని దెయ్యం భయపెట్టడం చివరికి దాన్ని ఏదో విధంగా నాశనం చేయడం. కానీ నిజంగా జరిగిన ఘటనల ఆధారంగా కూడా కొన్ని హారర్ సినిమాలు వచ్చాయ్. అలాంటి ఒక 4 సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Ragini MMS

రాజకుమార్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా రాగిణి ఎమ్ ఎమ్ ఎస్. ఢిల్లీకి చెందిన దీపికా అనే అమ్మాయి నిజ జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్నో వివాదాల నడుమ ఈ చిత్రాన్ని తీశారు. ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వీకెండ్ బయటకి ఓ ప్రదేశానికి వెళ్తారు. కానీ అక్కడ అనుకోని సంఘటనలు జరుగుతూ వాళ్ళని భయపెడతాయి.  చివరికి వాటి నుంచి వాళ్ళు ఎలా బయట పడ్డారు అనేది కథసారాంశం.

Trip to Bhangarh

కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓ భయంకరమైన ప్రదేశానికి సరదాగా వెళ్లాలని ట్రిప్ వేసుకుంటారు. అందుకు రాజస్థాన్ లోని భంగర్ ప్రదేశానికి ఎంచుకుంటారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి అనుకోని భయంకరమైన సంఘటనలు ఎదురవుతూ  ఉంటాయి. ఆ ప్రదేశానికి ఎవరు వెళ్లొద్దని అక్కడ ఉండొద్దని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదని కథలు కథలుగా  చెప్పుకుంటూ ఉంటారు. కానీ అవేమీ పట్టించుకోకుండా కొంతమంది వెళ్లారు. అలా భంగర్ వెళ్ళిన వాళ్ళకి ఎదురైన అనుభవాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

Mahal(1949)

బ్లాక్ అండ్ వైట్ కాలంలో కూడా ఇలాంటి మూవీ ఉంది. ఆ సినిమా పేరే మహల్. 1949లో ఈ చిత్రం వచ్చింది. నటుడు అశోక్ కుమార్ జీవితంలో ఎదురైన ఓ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక కొండ ప్రాంతంలో షూటింగ్ నిమిత్తం ఆయన వెళ్ళినప్పుడు శవం చుట్టూ ఓ మహిళ తిరుగుతూ ఉండటాన్ని గమనించారు. ఇదే విషయాన్ని పోలీసులకి చెప్పేందుకు వెళ్ళారు. ఆమె కనిపించిన ప్రదేశంలోనే 14 సంవత్సరాల కింద ఓ మహిళ చనిపోయినట్టు చెప్పారు. దీని ఆధారంగానే మహల్ సినిమాను తీశారు.

Stree

కర్ణాటకకి చెందిన నాలే బ స్టోరీ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఓ మహిళ అర్థరాత్రి వేళ ఇళ్ల దగ్గర తిరుగుతూ తలుపులు కొడుతుంది. పొరపాటున ఇంటి తలుపు తెరిచారో ఇక అంతే వాళ్ళని అత్యంత దారుణంగా చంపేస్తుంది. ఇంటి తలుపు తీయకపోతే అందులో ఉండే కుటుంబ సభ్యుల గొంతుతోనో లేదా వాళ్ళ స్నేహితుల గొంతుతోనో మాట్లాడి లోపలి వాళ్ళతో తలుపు తెరిచేలా చేస్తుంది. ఆమె మాటలు కనుక నమ్మి తలుపు తెరిచారో ఇక అంతే సంగతులు. ఆమె వాళ్ళని క్రూరంగా చంపేస్తుంది.

Also Read : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...

Also Read : 'లైగర్'లో నగ్నంగా విజయ్ దేవరకొండ, పూల బొకే మాత్రమే అడ్డం పెట్టుకుని.. 

Published at : 02 Jul 2022 03:27 PM (IST) Tags: Hindi Horror Movies Real Horror Stories Real Hindi Horror Movies Real Life Horror Movies

సంబంధిత కథనాలు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్ 

Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్ 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Janaki Kalaganaledu August 10th Update: కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దొంగల్ని చితక్కొట్టిన జానకి - జ్ఞానంబ సర్‌ప్రైజ్ - నోరెళ్ళబెట్టిన మల్లిక

Janaki Kalaganaledu August 10th Update: కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దొంగల్ని చితక్కొట్టిన జానకి - జ్ఞానంబ సర్‌ప్రైజ్ - నోరెళ్ళబెట్టిన మల్లిక

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

టాప్ స్టోరీస్

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!

Election For Congress Chief: కాంగ్రెస్‌ కార్యకర్తలకు గుడ్ న్యూస్- త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు!

Election For Congress Chief: కాంగ్రెస్‌ కార్యకర్తలకు గుడ్ న్యూస్- త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు!

Srisailam Reservoir Gates Opend: శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత|ABP Desam

Srisailam Reservoir Gates Opend: శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత|ABP Desam