Guppedantha Manasu November 2nd Update: కాలేజీలో కబుర్లు - చెరువులో కాగితపు పడవలతో ఆటలు, రిషిధారకు దేవయాని స్వీట్ వార్నింగ్
Guppedantha Manasu November 2nd Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu November 2nd Today Episode 597)
వసుధార కాలేజీ గ్రౌండ్ లో కూర్చుని రిషి అన్న మాటలు తలుచుకుని ఆలోచిస్తూ ఉంటుంది.
వసు: రిషి సార్ నాపై అరిచారు..అరిస్తే అరవనీ..తిడితే తిట్టనీ...రిషి సార్ ఎలా ఉన్నా నాకు ఓకే..రిషిధార అంటేనే ఒకటి కదా అనుకుంటూ నోట్ బుక్ లో 'VR' అని రాసి లవ్ సింబల్ వేసి దానిని డిజైన్ చేస్తూ ఉండగా ఇంతలో రిషి అక్కడికి వచ్చి ఆ బుక్ ని లాక్కుంటాడు.
రిషి: ఇది నీ నోట్ బుక్ అంటావ్...మరి ఇందులో నా పేరు కూడా ఉందికదా
వసు: నేను రాసుకున్నాను నా నోట్ బుక్ నా ఇష్టం కానిచ్చేయండి
రిషి: ఏంటి కోపం వచ్చిందా..అలిగావా..
వసు: మీకోపం నాకేమీ కొత్తకాదుకదా..ఇలానే ఉంటాయి కదా మీ కోపాలు
రిషి: హర్ట్ అయ్యావా
వసు: అలవాటైంది సార్ మీ కోపం
రిషి: అరిచినా ప్రేమ పెరుగుతుందా
వసు: ప్రేమ దేనికీ ప్రభావితం కాదు సార్
రిషి వసు చేతిలో వి ఆర్ అని రాసి కింద జెంటిల్ మెన్ అని రాస్తాడు రిషి. అది చూసి వసుధార సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు రిషి నేను నిన్ను పొగరు అని పిలుస్తాను అని నీకు ఎలా తెలుసు అని అనడంతో వసుధార.. గతంలో ల్యాబ్ లో పడిపోయినప్పుడు రిషి..పొగరు లే అనడం, ఓసారి రిషి ఫోన్ చూసి...పొగరు అని ఉండడం చూసినవి గుర్తు తెచ్చుకుంటుంది. అయినా సర్ మీ మీద నాకు కోపం ఎందుకు చెప్పండి మీ కోపానికి బాధపడడం ఎప్పుడో మర్చిపోయాను అంటుంది. ఇప్పుడు నా మనసు నిండా మీ మీద ప్రేమనే ఉంది
రిషి: ఈ మధ్యన నువ్వు నన్ను చాలా ఆశ్చర్యపరుస్తున్నావు
కాసేపు ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు
Also Read: శౌర్యను మోసం చేసిన ఇంద్రుడు-చంద్రమ్మ, మరో రెండు రోజుల్లో లెక్కలు సెట్ చేస్తా అన్న కార్తీక్
జగతి-మహేంద్ర-గౌతమ్
మరొకవైపు మహేంద్ర జగతి జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి గౌతమ్ వస్తాడు. రిషి ఎలా ఉన్నాడని మహేంద్ర అడిగితే
గౌతమ్: చాలా బాధపడుతున్నాడు అంకుల్ ఎన్నాళ్లిలా అక్కడ వాడి బాధ ఇక్కడ మీ బాధ చూడలేకపోతున్నాను ఇప్పుడు వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లేలా ఉంది. జరిగిందేదో జరిగింది అంకుల్ ఇప్పటికైనా అజ్ఞాతం విడి అక్కడికి వచ్చేయండి
మహేంద్ర మాత్రం మౌనంగా ఉండిపోతాడు..అప్పుడు గౌతమ్ మాత్రం..చేతులు జోడించి వాడి బాధ చూడలేకపోతున్నాను అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరొకవైపు వసుధర, రిషి ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉంటారు. మిషన్ ఎడ్యుకేషన్ హడావుడి అయ్యాక మినిస్టర్ గారు చెప్పిన వర్క్ చేయాలి అంటాడు రిషి. సార్ లంచ్ టైం అయిందని వసు అంటే ఆకలిగా లేదంటాడు రిషి. ఇంతలో రిషి ఆకలి తెలుసుకునేది పెద్దమ్మ ఒక్కతే అని నటిస్తూ ఎంట్రీ ఇస్తుంది దేవయాని. నేను ఎక్కడున్నా ప్రతిక్షణం నీ గురించే ఆలోచిస్తానుఅందుకే క్యారియర్ తీసుకొచ్చాను..చిన్నప్పటి నుంచీ నీ ఆకలేంటో నాకు తెలుసు కదా అంటుంది
రిషి: చూశావా వసుధారా పెద్దమ్మ మనసు ఎంత మంచిదో
వసు: అంతా నటన సార్..మీరెప్పుడు తెలుసుకుంటారో ఏంటో అని మనసులో అనుకుంటుంది
దేవయాని: ఏంటి వసుధారా అలా చూస్తున్నావ్..నా ప్రేమలో లోపం ఉందని నీకు అనిపిస్తోందా
రిషి: ఈ విషయంలో ఎవ్వరు ఏం చెప్పినా నమ్మను..మీ ప్రేమలో లోపం లేదని నాకు తెలుసు
దేవయాని: వసుధారకి నా గురించి తెలియదా ఏంటి నాన్నా..కొత్తగా చెబుతావ్..ఏం వసుధారా నా గురించి నీకు పూర్తిగా తెలుసుకదా..అలా చూస్తావేంటి..భోజనాలకు సిద్ధం చేయి
వసు: నేను వడ్డిస్తాను మీరు తినండి మేడం
దేవయాని: నీకు ఆ అవకాశం ఇవ్వనుకదా..నేనుండగా నీకెందుకు ఆ శ్రమ..నేను వడ్డిస్తాను కదా నీకేం కావాలో చెప్పు కూర్చో...
రిషి: పెద్దమ్మా తనకి కూడా వడ్డించండి
దేవయాని: వసుధారకి ఎప్పుడు ఏం వడ్డించాలో నాకు బాగా తెలుసు...తిను సిగ్గుపడకు...కడుపునిండా తిను..మొహమాట పడకు..ఇంకొంచెం వేయనా..
వసు: మీరింత ప్రేమ చూపిస్తుంటే నేనెలా కాదనగలను..వేయండి
దేవయాని: నా ప్రేమ ఇప్పుడేం చూశావ్ వసుధారా..ముందు ముందు ఇంకా చూపిస్తాను
రిషి: పెద్దమ్మ ప్రేమని తట్టుకోలేవు
దేవయాని: నేను కూడా అదే చెబుతున్నాను రిషి..నా ప్రేమను తట్టుకోలేదని.. అప్పుడే చాలంటే ఎలా రుచి చూడాల్సింది చాలా ఉంది కదా అని ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతుంటుంది..
రిషి..దేవయానిని పొగడడంలో పడతాడు..ఇప్పుడేం చూశావ్ వసుధారా ముందు ముందు చాలా చూస్తావ్...
దేవయాని: రిషి లాంటి తెలివైన వాడినే నా నటనతో తప్పుతోవ పట్టించినదాన్ని నువ్వు నాకో లెక్కా అని మనసులో అనుకుంటూ తిను వసుధారా...భయపడుతున్నావా మొహమాటపడుతున్నావా...
రిషి: పెద్దమ్మని అర్థం చేసుకోవాలి కానీ మనసు వెన్న
వసు: అవును సార్ అర్థం చేసుకోవాలికదా చేసుకుంటున్నాను ( దేవయాని మేడం నిజస్వరూపాన్ని మీరే అర్థం చేసుకోవడం లేదు ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నా..అప్పుడుంటుంది దేవయాని మేడంకి...)
Also Read: రొమాంటిక్ రిషి- అల్లరి వసు, ప్రేమకథకు అందమైన ముగింపు ఇస్తానన్న దేవయాని
మరొకవైపు జగతి మహేంద్ర కు కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు వారిద్దరూ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి రిసీవ్ ఒక్కడే కష్టపడుతూ ఉంటాడు రిషి ఒంటరి అయిపోయాడు అని బాధపడుతూ ఉంటారు. అటు వసుధార పుష్పతో మాట్లాడుతుంటుంది. రిజల్ట్ గురించి టెన్షన్ పడుతుంది..సమయానికి జగతి మేడం కూడా లేరని బాధపడుతుంది. యూనివర్శిటీ టాప్ ర్యాంక్ కొట్టాలి ఆ విజయం కోసమే కదా అందర్నీ వదిలేసి వచ్చానంటూ ఫోన్ మాట్లాడుతుంది....
రేపటి(గురువారం) ఎపిసోడ్ లో
ఈ రాత్రిపూట చెరువు దగ్గరకు రావడం ఏంటని అడిగితే...కాగితంపై కోరిక రాసి..పడవచేసి నీటిలో వదిలితే నెరవేరుతుంది అంటుంది. ఇంతకీ ఏం కోరుకున్నావ్ అని రిషి అడిగితే..అదే ప్రశ్న మీక్కూడా అంటూ ఓ కాగితం ఇచ్చి రాసి నీటిలో వదలమంటుంది...