News
News
X

Karthika Deepam November 2nd Update: శౌర్యను మోసం చేసిన ఇంద్రుడు-చంద్రమ్మ, మరో రెండు రోజుల్లో లెక్కలు సెట్ చేస్తా అన్న కార్తీక్

కార్తీకదీపం నవంబరు 2 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

FOLLOW US: 
 

Karthika Deepam November 2ndt  Episode 1499 (కార్తీకదీపం నవంబరు 2 ఎపిసోడ్)

శౌర్య కోసం ఇంద్రుడి ఇంటికెళ్లి నిరాశగా వెనుతిరుగుతారు దీప-కార్తీక్. దీప బాధపడుతుంటే కార్తీక్ ఓదార్చుతాడు. ఇలా జరుగుతుంది అనుకోలేదు డాక్టర్ బాబు ఇప్పుడు నాకు అనుమానం వస్తోంది శౌర్య అసలు ఇక్కడ ఉందా అనడంతో...స్పందించిన కార్తీక్ ఇక్కడే ఉందంటాడు. మీరు ఎలా చెబుతారని అడిగితే..నువ్వు నమ్ముతున్నావ్ కదా నేనుకూడా నీ నమ్మకాన్ని నమ్ముతున్నానని కవర్ చేస్తాడు. 

మరోవైపు శౌర్యకి ఇంద్రమ్మ దిష్టి తీస్తుంది.ఆ తర్వాత శౌర్య..ఫంక్షన్ ఇంతబాగా చేశారు కదా డబ్బులు ఎక్కడివి అడిగితే మా ముచ్చటకోసం బంగారం అని చెబుతారు. ఈ ముచ్చట తీర్చడానికి కావాల్సిన డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి.. దొంగతనం చేశారా అని శౌర్య నిలదీస్తుంది. ఆ రోజు వాటర్ బాటిల్ కొనిచ్చింది కదా ఆ అమ్మలాగే వేరే తల్లిదండ్రులు ఇలా సహాయం చేశారని చెప్పి కవర్ చేస్తాడు ఇంద్రుడు. నేను ఇక్కడ ఉండడం వల్ల మీకు ఇబ్బందే అన్న శౌర్య...మీకే ఇలా ఉంటే మా అమ్మానాన్నలు ఇంకా ఎంత సంతోషించే వారో అని బాధపడుతుంది. ఈరోజు నాకు మా అమ్మ నాన్న వచ్చినట్టు అనిపించింది బాబాయ్ ఏ ఆడపిల్ల అయినా ఇలాంటి సమయంలో అమ్మానాన్న పక్కన ఉండాలని కోరుకుంటుంది కదా కానీ నేనేం పాపం చేశాను బాబాయ్ అని బాధపడుతుంటే ఇంద్రమ్మ దంపతులు కూడా బాధపడుతారు. 

Also Read: రొమాంటిక్ రిషి- అల్లరి వసు, ప్రేమకథకు అందమైన ముగింపు ఇస్తానన్న దేవయాని

News Reels

ఇంటికెళ్లాక కూడా దీప అదే బాధలో ఉండిపోతుంది. పక్కనే దుర్గ కూర్చుని మాట్లాడిస్తూ ఉంటాడు. 
దీప: నా జీవితంలో ఏదీ అనుకున్నట్టుగా జరగలేదు. ఇక్కడ శౌర్య ఉంటుంది అనుకుని వెళ్తే అక్కడ లేదు 
దుర్గ:ఊరుకో దీపమ్మా కనిపిస్తుందే..శౌర్య దొరుకుతుందిలే..నీ బిడ్డనుకుని వెళ్లావ్ కానీ కాదు ఏం చేస్తాం..అన్నీ అనుకున్నట్టే జరిగితే అది జీవితం ఎలా అవుతుంది
దీప: అన్నీ అనుకున్నట్టు జరగాల్సిన అవసరం లేదు..కానీ కొన్నైనా జరగాలి కదా..నా జీవితంలో ఏదీ అనుకున్నట్టు జరగడం లేదు. అవునూ..వాల్తేరు వాణి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళింది
దుర్గ:  మీరు పొద్దున్న వెళ్తున్నారని చెప్పలేదు దీపమ్మ అంటూ.. జరిగిన విషయం మొత్తం వివరిస్తాడు
అదంతా విని దీప షాక్ అవుతుంది...ఆ మోనిత ఇంతకు తెగిస్తుందని అనుకోలేదు రగిలిపోతూ మోనిత ఇంటికి వెళుతుంది దీప. 

మరొకవైపు మోనితని చూసి శివ భయపడుతూ ఉంటాడు. తినండి మేడం అని శివ బతిమలాడుతుంటే ఎందుకు విసిగిస్తావని కోపంగా వెళ్లిపోమని చెబుతుంది.ఇంతలోనే అక్కడికి వచ్చిన దీప..మోనిత చెంప చెళ్లు మనిపిస్తుంది. నా ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేస్తావా అంటూ వాల్తేరు వాణి గురించి చెప్పడంతో మోనిత షాక్ అవుతుంది.
మోనిత: అవును నేను నిన్ను చంపడానికే వాల్తేరు వాని ని రప్పించాను కానీ నువ్వు తప్పించుకున్నావు కానీ నిన్ను అంత ఈజీగా వదలను దీప. కార్తీక్ నా వాడు నా సొంతం 
దీప చీదరించుకుంటూ ఇద్దరు పిల్లలు గల తండ్రిని ఇష్టపడుతున్నావు దానిని మరొక లాగా పిలుస్తారు అని అంటుంది. ఇప్పుడు దీప సరేలే డాక్టర్ బాబు ఎక్కడున్నారు చెప్పు వాల్తేరు వాణి గురించి చెప్పి బండారం మొత్తం బయట పెడతాను అని అంటుంది దీప. ఇప్పుడే నేను నిన్ను చంపేస్తానని మోనిత అరవడంతో దీప వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. 

Also Read: మోనితను మళ్లీ కొట్టిన దీప, శౌర్యని దాచేసిన ఇంద్రుడు-చంద్రమ్మకి షాక్ ఇచ్చిన కార్తీక్

ఇంద్రుడు... పని వాళ్లకు డబ్బులిస్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి కార్తీక్ మళ్ళీ వస్తాడు. అది చూసి ఇంద్రుడు ఏంటి సార్ మళ్లీ వచ్చాడు అని షాక్ అవుతారు.కొన్ని నిజాలు తెలుసుకుందామని అని చెప్పి వారణాసి ఫోటో చూపిస్తాడు కార్తీక్. వారణాసి ఫోటో చూసి ఇంద్రుడు ఒక్కసారిగా షాక్ అయినా...కావాలనే అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు ఇంద్రుడు. అప్పుడు శౌర్య కార్తీక్ వైపు చూస్తూ ఉండగా కావాలని ఇంద్రమ్మ అక్కడి నుంచి పక్కకు లాక్కెళ్లిపోతుంది. ఆ తర్వాత శౌర్య ఫొటో కూడా చూపించినా ఇంద్రుడు తెలియదని అబద్ధం చెప్పేస్తాడు. అప్పుడు శౌర్య ఎవరితో మాట్లాడుతున్నావు బాబాయ్ అని అడిగితే..నీకు నగలు కొనిచ్చారని చెప్పాను కదమ్మా  అంటాడు...అలా అయితే థ్యాంక్స్ చెప్పేదాన్ని కదా బాబాయ్ అంటూ శౌర్య బయటకు వెళుతుంది.  ఎందుకొచ్చారని ఇంద్రమ్మ అడిగితే...వారణాసి, శౌర్య ఫొటోలు చూపించి అడిగారని ఇంద్రుడు చెబుతాడు.  ఇంకా మనపై అనుమానం ఉందేమో అంటుంది చంద్రమ్మ....

Published at : 02 Nov 2022 08:39 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode 1499 Karthika Deepam Serial November 2nd

సంబంధిత కథనాలు

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

Veera Simha Reddy Release Date : సంక్రాంతి బరిలో బాలయ్య - 'వీర సింహా రెడ్డి' విడుదల తేదీ చెప్పేశారోచ్

Veera Simha Reddy Release Date : సంక్రాంతి బరిలో బాలయ్య - 'వీర సింహా రెడ్డి' విడుదల తేదీ చెప్పేశారోచ్

టాప్ స్టోరీస్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ?  యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Sundar Pichai: ప్రపంచంలో ఏ మూలకెళ్లినా నేను భారతీయుడినే - పద్మ భూషణ్‌ స్వీకరించిన సుందర్‌ పిచాయ్‌

Sundar Pichai: ప్రపంచంలో ఏ మూలకెళ్లినా నేను భారతీయుడినే - పద్మ భూషణ్‌ స్వీకరించిన సుందర్‌ పిచాయ్‌