అన్వేషించండి

Guppedantha Manasu ఫిబ్రవరి 18 ఎపిసోడ్: మనసులోనే రిషి-వసు నిశ్శబ్ద ప్రేమ యుద్ధం, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రోజు రోజుకీ వసు-రిషి ప్రేమ బలపడుతున్నా గౌతమ్ కి ఇంకా క్లారిటీ రావడం లేదు. ఫిబ్రవరి 18 శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

గుప్పెడంతమనసు  ఫిబ్రవరి 18 శుక్రవారం ఎపిసోడ్

రిషి-వసుధార: రిషి కోటుపై బైక్ వాడు బురద కొట్టి వెళ్లిపోవడంతో క్లీన్ చేసే పనిలో పడుతుంది వసుధార. తనని గమనిస్తున్న రిషిని చూసి ఏంటి సార్ అలా చూస్తున్నారు అంటే నువ్వు నా దగ్గరే ఇలా ఉంటావా, అందరితోనూ ఇలాగే ఉంటావా అంటే...అందరి దగ్గరా మీ దగ్గర కన్నా బాగా ఉంటానంటుంది. చిన్నప్పటి సంగతులు చెబుతున్న వసుధారతో నీకు బాల్యంలో ప్రతిరోజూ ఏదో జ్ఞాపకం మిగిలే ఉంది కదా అంటే అవునుసార్ బాల్యం ఎంత అందంగా ఉంటుందో తెలుసా అంటే ఏమో తెలీదు అంటాడు రిషి. Sorry సార్ అంటుంది వసుధార. ఇంతలో వసు మెడపై మట్టి తుడుచుకోమని కశ్చీఫ్ తీసి ఇస్తాడు. తుడుచుకున్నాక ఇచ్చేయాలి దాన్ని కూడా జ్ఞాపకం అని నీ దగ్గర పెట్టుకోవద్దు అంటాడు. లేదు సార్ ఉతికేసి మీకిస్తా అంటుంది. జ్ఞపకాలు అంటే పెద్దవి కాదు చిన్నచిన్నవే ఎక్కువ బావుంటాయంటుంది. అక్కడి నుంచి బయలు దేరుతారు. 

Also Read: మళ్లీ మోనిత కుట్రలో ఇరుక్కున్న కార్తీక్ ని దీప కాపాడుకోగలదా, కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
జగతి ఇంట్లో: ఇంట్లో బుక్స్ సర్దుతుండగా కాలింగ్ బెల్ మోగడంతో డోర్ తీసిన జగతికి ఎదురుగా గౌతమ్ కనిపిస్తాడు. వసుధారని కలవడానికి వచ్చానని చెబితే..వసు రిషితో కలసి బయటకు వెళ్లిందని చెబుతుంది జగతి. వసుధారతో రిషికి ఏం పని ఉంటుంది మేడం అని అడిగితే..ప్రాజెక్ట్ కోసం వసుని పీఏ గా రిక్రూట్ చేసుకున్నాడు కదా అని గుర్తుచేస్తుంది. మీతో రెండు నిముషాలు మాట్లాడొచ్చా అంటే....లోపలకు రండి అంటుంది. షార్ట్ ఫిలింలో రోల్ ఇస్తామన్నారు కదా ఆ రోల్ ఏంటో చెప్పండి రిహార్సల్స్ చేసుకుంటా అంటాడు. షార్ట్ ఫిలింలో రోల్ గురించి నేను మాట్లాడకూడదు, రిషి సార్ ఫైనల్ చేయాలంటుంది. మహేంద్ర సార్ ఫైనల్ చేశారు కదా అంటే... దీని గురించి కాలేజీలో మాట్లాడుకుందాం అన్న జగతి...ఈ విషయంపై రిషితో మాట్లాడితే బావుంటుందని సలహా ఇస్తుంది. వసుధార పుస్తకాలన్నీ ఇక్కడ పెట్టారేంటి అని గౌతమ్ అడిగితే సర్దుతున్నా అంటుంది. నేనుండగా మీతో ఇలాంటి పనులు చేయిస్తానా వసుధార రూమ్ లో నేను పెడతా అంటూ రూమ్ లోకి వెళతాడు. అక్కడ గోళీల బాటిల్ చూసి షాక్ అవుతాడు. అక్కడ రిషి రూమ్ లో సేమ్ ఉన్నాయ్, ఇక్కడా ఉన్నాయ్ .. ఈ రెండింటికీ కనెక్షన్ ఏమైనా ఉందా...ఒకవేళ కనెక్షన్ ఉంటే అర్జెంట్ గా డిస్కనెక్ట్ చేయాలి అనుకుంటాడు. 

రిషి-వసుధార: నీకు కాలు నొప్పి పెట్టుకుని ఇలా తిరగడం నచ్చలేదంటాడు రిషి. పర్వాలేదు సార్ ప్రాజెక్ట్ లో భాగంగా చాలామందిని కలిశాం కదా అంటుంది. ఏంటి చిన్న చాక్లెట్ తో సెలబ్రేట్ చేస్తావా ఏంటి అంటే కాదుసార్ అని..పల్లీలు బయటకు తీసి వాటిగురించి చెప్పడం మొదలెడుతుంది. కావాలంటే రోజుకి మూడుసార్లు పల్లీలే తింటాను దయచేసి పల్లీల పురాణం ఆపుతావా అంటాడు. ఇంతలో అటువైపు వెళుతున్న ఓ పెద్దాయన్ని పిలిచిన వసుధార ముందు కొన్ని పల్లీలు ఇచ్చి...మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి చెబుతుంది. ఓ పని చేస్తే సంపూర్ణంగా చేయాలనుంటుందని వసు అంటే.. నేను అలా కాదులే మధ్యలోనే వదిలేస్తాను అంటాడు. పల్లీలు తింటారా అంటే లేదు చూస్తూ ఉండిపోతా అని కౌంటర్ వేస్తాడు. 

Also Read: వసు-రిషి మధ్యలో గౌతమ్, ట్రయాంగిల్ లవ్ స్టోరీలో కీలక మలుపు, గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్
ఇంతలో అటువైపు మరో కుర్రాడు వెళుతుంటే పిలుస్తుంది. వసు ఏం క్వశ్చన్స్ వేస్తుందో అన్నీ ఊహిస్తుంటాడు రిషి...సరిగ్గా రిషి ఏం ఊహిస్తాడో అవే ప్రశ్నలు అడుగుతుంది వసుధార. ఈ పల్లీలు తీసుకో అంటే..ఏదీ ఊరికే తీసుకోవద్దని మా అమ్మ చెప్పిందన్న కుర్రాడు పెన్సిల్ తీసి ఇస్తాడు. ఇది నువ్వు తీసుకుంటే నేను పల్లీలు తీసుకుంటా అని తీసుకుంటాడు. పిల్లల్లో ఇలాంటి ఆలోచనలు అందరిలోనూ ఉంటే రేపటి తరం గొప్పగా ఉంటుంది... మన మిషన్ ఎడ్యుకేషన్ లక్ష్యం అదే కదా అంటుంది. మరి నేను పల్లీలు తీసుకుంటే నీకివ్వడానికి పెన్సిల్ లేదు పెన్ను ఇమ్మంటారా అంటే.. నాకు అడ్మిషన్ ఇచ్చారు, చదువు చెబుతున్నారు అంతకన్నా ఏంకావాలి అంటుంది. గతంలో వసుని తిట్టిన సందర్భం గుర్తుచేసుకున్న రిషి.. వసుధార సమ్ థింగ్ స్పెషల్, తన మాటతీరు, ఆలోచనలు ప్రత్యేకంగా కనిపిస్తాయి అనుకుంటాడు. 

పల్లీలు చేతికిచ్చి తినమంటుంది. తినేలోగా ఆగండి అంటూ పొట్టుతీసుకుని ఊదుకుని తినడం ఎలాగో చెబుతుంది. రిషి అలా చేస్తుండగా పొట్టు కంట్లోకి ఎగురుతుంది. ఇంకేముంది వసుధార ఎక్కువ ఫీలైపోయి కన్ను ఊదేపనిలో పడుతుంది ( బ్యాంగ్రౌండ్ లో ఎప్పటిలానే ఓ లవ్ ట్రాక్ వస్తుంది).  కాసేపటి వసుధారని జగతి ఇంటి ముందు దించిన రిషికి థ్యాంక్యూ, గుడ్ నైట్ చెబుతుంది వసుధార. కారు దిగిన రిషితో లోపలకు వస్తారా అంటుంది...కారు దిగితే లోపలకు వస్తానని ఫిక్సైపోతే ఎలా అని కౌంటర్ ఇస్తాడు. లిఫ్ట్ ఇచ్చిన ప్రతీసారీ థ్యాంక్స్ చెబుతావు కదా అంటే..చెప్పకపోతే తప్పు కానీ చెప్పడంలో తప్పేంటి అంటుంది. నీ మర్యాదకి మంచి టెస్ట్ పెడతా అన్న రిషి..నేను ఇప్పటి వరకూ ఎన్నిసార్లు లిఫ్ట్ ఇచ్చానో చెప్పు అని రిషి...ఇప్పటి వరకూ మీరు రెస్టారెంట్ కి వచ్చి ఎన్నిసార్లు కాఫీ తాగారో చెప్పండి అని వసు...ఇద్దరూ టెస్ట్ పెట్టుకుంటారు. 

రేపటి(శనివారం) ఎపిసోడ్ లో
వసుధారలో ఏదో ప్రత్యేకత ఉంది..ఇది ఇంతవరకూ ఎవ్వరిలోనూ చూడలేదు అనుకుంటాడు రిషి. కట్ చేస్తే మహేంద్ర, గౌతమ్, రషి వర్కౌట్స్ చేస్తుంటే నేను మేడంని కలిశాను, నీ గురించి మొత్తం చెప్పేశారు, నువ్వు మోసగాడివి అంటాడు గౌతమ్. మేడం ఏం చెప్పారు అని రిషి అంటే... మొత్తం చెప్పేశారంటాడు గౌతమ్. మహేంద్ర షాక్ అయి చూస్తుంటాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Perni Nani Wife Jayasudha : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Perni Nani Wife Jayasudha : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
AP In WEF 2025: దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు
దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మరింత విస్తరణ- మేడ్చల్ వరకూ పొడిగింపు - డీపీఆర్‌కు రేవంత్ ఆదేశం
హైదరాబాద్ మెట్రో మరింత విస్తరణ- మేడ్చల్ వరకూ పొడిగింపు - డీపీఆర్‌కు రేవంత్ ఆదేశం
Sports Calender 2025 Update: చాంపియన్స్ ట్రోఫీ నుంచి ప్రపంచకప్ వరకు.. ఈ ఏడాది జరిగే ప్రముఖ స్పోర్ట్స్ ఈవెంట్ల వివరాలు
చాంపియన్స్ ట్రోఫీ నుంచి ప్రపంచకప్ వరకు.. ఈ ఏడాది జరిగే ప్రముఖ స్పోర్ట్స్ ఈవెంట్ల వివరాలు
Embed widget