Guppedanta Manasu April 7th: రిషిధారకు పెళ్లికళ వచ్చేసింది, దేవయానికి కడపుమంట మొదలైంది!
Guppedantha Manasu April 8th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
ఒకరినొకరు విభేదించుకోకండి. మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి అనడంతో అప్పుడు వసుధార మా భవిష్యత్తు రిషి సార్ చేతిలోనే ఉంది అని అంటుంది. ఆయన మాట నేను కాదనలేను అనడంతో.. ఆ నల్లపూసలు ఇప్పుడే వసుధార మెడలో వేసేయ్ అంటాడు మహేంద్ర. అప్పుడు రిషి డాడ్ మా ఇద్దరికీ కాస్త టైం కావాలి..ఆలోచించుకుని చెబుతామంటాడు.
జగతి-మహేంద్ర
దేవయాని గురించి మాట్లాడుకున్న జగతి-మహేంద్ర..అక్కయ్య ఎంత పని చేసిందో చూసావో మహేంద్ర అనుకుంటారు. వసు ప్రేమ కోసం ఆరాటపడుతుంటే రిషి బంధం కోసం ఆరాటపడుతున్నాడు. ఇద్దరు వెళ్లే దారి ఒకటే ఇద్దరి మనసుల్లో ఉన్న భావన కూడా కరెక్టే. కానీ పంతం వల్ల ఒకరి నిర్ణయాన్ని ఒకరు ఇన్ని రోజులు అంగీకరించలేకపోయారు అంటుంది జగతి. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో అక్కయ్య ఇలా చేశారు అని బాధపడుతూ ఉంటుంది జగతి. అందరూ బావుంటే వదినగారు చూడలేరు కదా జగతి ..పైగా వసుధార అంటే తనకి చిన్నచూపు ఎక్కువ...తన స్వభావం ఏంటో అర్థం కాదు నవ్వుతూనే కాపురంలో నిప్పులు పోస్తారు అని అంటాడు మహేంద్ర. బావగారు అక్కయ్యను చూశారు కాబట్టి సరిపోయింది లేదంటే ఇది ఎంతవరకు దారి తీసేదో మహేంద్ర అని భయపడుతుంది జగతి.
దేవయాని-ఫణీంద్ర
ఈయన నన్ను చూడకుండా ఉంటే బాగుండు ఇప్పుడు రిషి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో ఏమో అనుకుంటూ ఉంటుంది. అలా జరగకూడదు అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడకు వచ్చిన ఫణీంద్ర...నువ్వు చేసింది ఏం బాగోలేదు అని అంటాడు. ఇప్పుడిప్పుడే వాళ్లిద్దరూ ఒకటవుతున్నారు అనుకుంటే నువ్వు ఇలా చేశావు నువ్వు చేసింది నాకు నచ్చలేదు అనడంతో రిషి కోసం చేశానండి అనడంతో అది సరైన మార్గం కాదు అంటాడు. మరేం చేయాలి రిషి బాధ నాకు ఒక్క దానికే అర్థం అవుతుంది ఆ జగతి మహేంద్ర ఏం పట్టించుకోరు అనడంతో ఫణీంద్ర..దేవయాని వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అది సరే మరి నువ్వు వసుధార గదికి ఎందుకు వెళ్లావు అని అంటాడు ఫణింద్ర. అప్పుడు ఏవేవో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది.
మరోవైపు ధరణి..జరిగిన విషయాల గురించి తలుచుకుని దేవయానిని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది.
రిషి-వసుధార
వసుధార రిషి ఒక చోట నిలబడి ఉంటారు...
రిషి: వసు చెయ్యి పట్టుకుని ప్రేమలో అపోహలు, తప్పటడుగులు ఉండవు. ప్రేమ అంటే నమ్మకం. ఎందుకో మనిద్దరి మధ్య తెలియకుండానే అగాధాలు ఏర్పడుతున్నాయి. వాటిని మనం దాటాలి. అంతేకానీ నువ్వు అటువైపు నేను ఇటువైపు ఎప్పుడు ఉండిపోకూడదు
వసు: మన ప్రేమను బ్రతికించుకోవాలి అనడంతో థాంక్స్ సార్ అని అంటుంది
మన బంధం అనుకున్న ఆ ఉంగరం ఎక్కడ పడిపోయిందో అనగా నా గదిలోనే పడిపోయి ఉంటుంది సార్ అనడంతో అయితే వెళ్లి వెతుకుదాం అని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి గది మొత్తం వెతుకుతారు..దొరుకుతుంది. ఈ ఉంగరం మన ప్రేమకు సాక్ష్యం వసుధార అని అంటాడు రిషి.
వసు: మళ్లీ ఆ రింగ్ ని నా చేతికి తొడగండి సార్
రిషి: నాతోపాటు రా అని వసుధార తీసుకెళ్లి ఓ గిఫ్ట్ చూపిస్తాడు. వసుధార దగ్గర ఉండాల్సిన తాళికి ఆ ఉంగరాన్ని వేసి ఆ గిఫ్ట్ కి తగిలిస్తాడు.
సరే వెళ్దాం పద అని రిషి వసుని తీసుకెళ్లి పెద్దమ్మా పెద్దమ్మా అని పిలుస్తారు. అందరూ ఓసారి రండి అని పిలుస్తాడు. ఏం చెబుతాడో అని అందరూ ఆలోచిస్తుండగా ...ఇద్దరం పెళ్లిచేసుకుంటాం అని చెప్పడంతో అంతా సంతోషిస్తారు..దేవయాని కుళ్లుకుంటుంది.థాంక్స్ రిషి ఈ మాట కోసమే నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను అని అంటుంది జగతి. అప్పుడు రిషి పెద్దమ్మ పంతులు గారిని పిలిపించి ఒక మంచి ముహూర్తం చూడండి అని అనడంతో దేవయాని షాక్ అవుతుంది. ఇప్పుడే కాదు నాన్న ఇది శూన్యమాసం కదా ఇప్పుడు ముహూర్తాలు ఉండవు ఇది అయిపోయాక పిలుస్తాను అని అంటుంది దేవయాని. సరే బయటికి అలా వెళ్లొద్దని పద వసుధారా అనేసి ఇద్దరూ బయటకు వెళ్లిపోతారు.