Gruhalakshmi November 24th: ఇంటికి వచ్చేసిన నందు- ఆత్మహత్యకి సిద్ధపడ్డ అనసూయ
అనసూయ పరంధామయ్యని ఇంటికి రమ్మని బతిమలాడుతుంది, కానీ అందుకు ఆయన ఒప్పుకోడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
పరంధామయ్యని తీసుకుని వెళ్ళడానికి అనసూయ తులసి ఇంటికి వస్తుంది. కానీ పరంధామయ్య మాత్రం రానని చెప్పి అనసూయని బయటకి నెట్టి తలుపు వేసుకుంటాడు. అనసూయ మాత్రం తలుపు బయటే నిలబడి బాధపడుతుంది. ఈ తలుపు దగ్గరే గొంతు నొక్కుకొని చచ్చిపొమ్మని అంటారా? అప్పుడు మీ కోపం తగ్గుతుందా. మన ఇంటికి వెళ్దాం రండి అని ఏడుస్తూ బతిమలాడుతుంది. నీతో నేను నడవాల్సింది నేను నడిచేశాను ఇక నువ్వు ఒంటరిగానే నడవాలి, ఒంటరిగానే చావాలి అని పరంధామయ్య అంటాడు. మాయనతో మాట్లాడేదాక ఇక్కడ నుంచి కదలను అని అనసూయ అక్కడే ఉంటాను అని మొండిగా కూర్చుని ఉంటుంది.
‘నీ కారణంగా మేము ఇలా అయిపోయాము, తలుపులు తెరువు లేదంటే నిన్ను జీవితాంతం క్షమించను’ అని అనసూయ గట్టిగా అరుస్తుంది. ఆ మాటకి పరంధామయ్య తలుపు తీసి బయటకి వస్తాడు.
పరంధామయ్య: నువ్వు తులసికి శాపనార్థాలు పెట్టాలని చూస్తే నా శవాన్ని చూసే అవకాశం కూడా లేకుండా చేస్తాను. ఏం మాట్లాడాలి నువ్వు నాతో ఏం చెప్పాలి, ఎందుకు గొంతు చించుకుని అరుస్తున్నావ్, రా చెబుదువుగాని.. ఇంకా నన్ను అనాల్సిన మాటలు ఉన్నాయా
అనసూయ: నా మాటలు తప్పుగా ఉండవచ్చు కానీ నా కోపం తప్పు కాదు, నాలో నిజాయతీ ఉంది బాధ, న్యాయం ఉంది, నాతో జీవితాంతం ఉంటానని మాట ఇచ్చారు ఇప్పుడు వేరే ఎవరి కోసమే నాకు దూరం అయితే ఎలా
పరంధామయ్య: నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు చేసింది తప్పే
అనసూయ: తప్పే ఒప్పుకుంటాను మీరు సరి చెయ్యొచ్చు కదా, అంతే కానీ నన్ను పూర్తిగా వదిలేస్తారా
Also Read: యష్ ని నిలదీసిన వసంత్- వేద జీవితం గురించి ఆలోచించి తల్లడిల్లిన సులోచన
పరంధామయ్య: వదిలేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు, నన్ను అవమానించింది నువ్వు, ఏమనుకుంటున్నావ్ నువ్వు కుటుంబం కోసం నువ్వు చేసిన త్యాగాలు నాకు తెలియదు అనుకున్నావా, నా పర్సులో డబ్బులు లేకపోయినా తలెత్తుకుని బతికేవాడిని అందుకు కారణం నువ్వు. మనం పేదవాళ్ళమె కానీ ఎప్పుడు ఎవరి ముందు చెయ్యి చాచలేదు అందుకు కారణం నువ్వే. నా బిడ్డలు నన్ను ఇప్పటికీ గౌరవిస్తున్నారంటే దానికి కారణం నువ్వే.. ఇవన్నీ ఎంత నిజాలో ఈరోజు నీకారణంగా అవమానభారంతో కుంగి పాతాళానికి దిగజారీపోయాను అనేది కూడా అంతే నిజం
అటు నందు ఇంట్లో వాళ్ళకి ఫోన్స్ చేస్తూ ఉంటాడు కానీ ఎవరు లిఫ్ట్ చెయ్యరు. దీంతో ఏదో జరిగింది వెంటనే ఇంటికి వెళ్ళాలి అని బయల్దేరతాడు. ముంబయి వెళ్తున్నా అని చెప్పి హైదరాబాద్ లోనే ఉండటం కలిసొచ్చిందని అనుకుని ఇంటికి బయల్దేరతాడు.
తనకి జరిగిన అవమానం గురించి చాలా బాధపడతాడు పరంధామయ్య. తన మాటలకి కన్నీళ్ళు కాదు రక్తం వస్తుందని చెప్పి విలవిల్లాడిపోతాడు. నందు సడెన్ గా ఇంటికి రావడం చూసి అభి షాక్ అవుతాడు. ఇంట్లో అంతా ఒకే కదా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని నందు కంగారుగా అడుగుతాడు. ఇంట్లో ఎవరు లేరు ఎక్కడికి వెళ్లారని అడుగుతాడు. టెంపుల్ కి వెళ్లారని అభి అబద్ధం చెప్తాడు. మీరు చెప్పినవన్నీ ఒప్పుకుంటాను కానీ ముందు ఇంటికి వెళ్దాం రమ్మని అనసూయ అడుగుతుంది. ఇంటికి మాత్రం వెళ్ళను అని పరంధామయ్య అంటాడు. తులసి ఇద్దరినీ ప్రశాంతంగా ఉండమని అంటే నువ్వు మధ్యలోకి రాకని అనసూయ అరుస్తుంది.
Also Read: శౌర్య అంటించిన పోస్టర్ చూసిన దీప, కార్తీక్ ను కొట్టబోయిన మోనిత!
నందు తిరిగి వచ్చాక ఏం చెప్పాలి అని లాస్య అడుగుతుంది. అయితే వాళ్ళ నాన్న చచ్చిపోయాడని చెప్పండి అనేసరికి అనసూయ చాలా బాధపడుతుంది. అటు ఇంట్లో అంకిత, అభి నందు నుంచి తప్పించుకుని ఉంటారు. జరిగింది మావయ్యకి చెప్పాల్సింది అని అభి అంటే దానికి ఒప్పుకోడు. నందు అభిని పిలుస్తాడు. నువ్వు వెళ్లిపో అనసూయ కావాలంటే కాళ్ళు పట్టుకుని బతిమలాడతాను అని పరంధామయ్య అంటాడు.
తరువాయి భాగంలో..
అనసూయ దిగులుగా నడుచుకుంటూ వెళ్లిపోతుంటే తులసి తనని వెతుకుతూ రోడ్డు మీదకి వస్తుంది. అటు నందు అభిని ఇంట్లో అంతా ఒకే కదా అని నిలదీస్తాడు. ఆ మాటకి అభి ఏం చెప్పాడో కానీ నందు షాక్ అవుతాడు. అనసూయ నడుచుకుంటూ ఒక బావి దగ్గరకి వెళ్ళిపోతుంది.