Ennenno Janmalabandham November 24th: యష్ ని నిలదీసిన వసంత్- వేద జీవితం గురించి ఆలోచించి తల్లడిల్లిన సులోచన
తన తల్లికి యాక్సిడెంట్ చేసింది మాళవిక అనే విషయం వేదకి తెలియడంతో తనకి వ్యతిరేకంగా కేసు పెడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
యష్ వేద పట్ల ప్రవర్తిస్తున్న తీరు గురించి వసంత్ తనని నిలదీస్తాడు. అటు వేద చిత్ర దగ్గరకి వెళ్ళి సారీ చెప్తుంది. గతంలో సులోచన యాక్సిడెంట్ గురించి చెప్పిన విషయం నమ్మలేదని గుడ్డిగా యష్ ని నమ్మాను అని అంటుంది. బావ ఇంత చేస్తున్న ఎందుకు మౌనంగా భరిస్తున్నావ్ ఎందుకు ఎదురుతిరగడం లేదని ప్రశ్నిస్తుంది. ఎందుకు ఇలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ వేద వదిన్ని హర్ట్ చేస్తున్నావ్, ఇన్ని తప్పులు చేస్తున్నా నిన్ను నిలదీయకపోవడం వేద వదిన మంచితనం, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని వసంత్ కోపంగా అడుగుతాడు. నేను నోరు నొక్కేసుకుంటున్నా అని ఫ్రస్టేట్ అవుతాడు. వేదని నొప్పించే మాటలు నేను మాట్లాడలేను అని యష్ అంటే, మీ బావని నొప్పించే పని చెయ్యను అని వేద అంటుంది. ‘నాకున్న ఒకే ఒక్క బలం వేద’ అని ఇటు యష్ అంటుంటే అటు వేద యష్ తన బలహీనత అని చెప్తుంది.
Also Read: శౌర్య అంటించిన పోస్టర్ చూసిన దీప, కార్తీక్ ను కొట్టబోయిన మోనిత!
సులోచన బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ కేసు ఫైల్ చేయడం అవసరమా అని సులోచన వేదని అడుగుతుంది. జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఆ కేసు వల్ల ఉపయోగం ఏముంది చెప్పు, తన వల్ల జీవితంలో ఇంత పెద్ద సమస్య వచ్చి పడింది అని సులోచన ఏడుస్తుంది. అల్లుడుగారు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఇది వచ్చి పడింది, యాక్సిడెంట్ జరిగిన తర్వాత అల్లుడుగారు నన్ను ఎంత బాగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య నేను అడ్డుగా వచ్చాను. మంచి భర్తని ఇవ్వమని దేవుడిని అడిగాను’ అని ఏడుస్తుంది. ‘నాకు మంచి భర్తని దేవుడు ఇచ్చాడు, ఆయన కళ్ళలో చాలా ప్రేమ కనిపిస్తుంది కానీ అది నాకోసం కాదు ఆ మాళవిక మీద. ఎవరో ఒకరిని ప్రేమిస్తున్నారు కదా పోనీలే ఆయన ప్రేమని పొందే అదృష్టం నాకు లేదేమో అడ్జస్ట్ అయిపోతాను, నాకు రాసి పెట్టి లేదని’ వేద ఫీల్ అవుతుంది.
అన్నింటికీ సిద్ధపడే ఈ ప్రయాణం మొదలుపెట్టాను అని వేద చెప్తుంది. యష్ ఇంటికి వచ్చేసరికి వేద తనని పట్టించుకోకుండా బుక్ చూస్తూ కూర్చుంటుంది. తనని పిలవలేక యష్ తిప్పలు పడతాడు. కానీ వేద చూడనట్టుగానే ఉంటుంది. చేసేది లేక యష్ వచ్చి గిన్నెలు అన్నీ వెతుకుతాడు. అన్నం లేకపోవడంతో మంచినీళ్ళు తాగి పడుకోబోతుంటే ఖుషి అన్నం తీసుకుని వస్తుంది. తండ్రికి ప్రేమగా అన్నం తినిపిస్తుంది. ఇప్పటి దాకా ఎందుకు మేల్కొని ఉన్నావ్ అని యష్ ఖుషిని అడుగుతాడు. అందరూ నీ మీద కోపంగా ఉన్నారు కదా తినేసి పడుకున్నారు మరి నీకు అన్నం ఎవరు పెడతారు నీకు ఆకలేస్తుంది కదా అందుకే మేల్కొని ఉన్నాను అని చెప్పేసరికి యష్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఖుషి వచ్చి నువ్వు చెప్పినట్టు నాన్నకి అన్నం తినిపించమన్నావ్ కదా అలాగే చేశాను అని వేదకి చెప్తుంది. ఆ మాటకి వేద హ్యాపీగా ఫీల్ అవుతుంది.
Also Read: మహేంద్రకి గడువు విధించిన రిషి - దేవయాని కుట్ర బయటపెట్టే పనిలో గౌతమ్
వేద కోర్టుకి బయల్దేరుతుంది. మాలిని దేవుడి ముందు దణ్ణం పెట్టుకుంటూ న్యాయం గెలవాలని కోరుకుంటుంది. యష్ ఏ విషయంలోను తప్పు చెయ్యడు కానీ మరి ఈ విషయంలో ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు, న్యాయం తన కోడలి వైపే ఉందని తనని దీవించమని మాలిని పూజ చేస్తుంది. అంతా మంచే జరగాలని కోరుకుంటూ వేదకి హారతి ఇస్తుంది. అప్పుడే యష్ కూడా వస్తాడు. తను చేస్తున్న పనిలో ఎలాగైనా గెలవాలని కోరుకుంటూ తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు.