News
News
X

Gruhalakshmi November 14th: నందు, సామ్రాట్ ల సవాల్ - తులసి నాశనం అయిపోవాలని శాపనార్థాలు పెట్టిన అనసూయ

తులసి ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో సీరియల్ కొత్త మలుపు తిరిగింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
 
పరంధామయ్య మళ్ళీ బయటకి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారని అనసూయ అడుగుతుంది. అడిగే హక్కు నాకుందని అనసూయ అంటుంది. లాక్కోమని చెప్తాను నీ హక్కుని కాదు, మెడలో తాళిని అనేసి పరంధామయ్య అంటాడు. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నారని నందు అడుగుతాడు. తులసి దగ్గర ఉన్నంత సేపు గుడిలో ఉన్నంత ప్రశాంతంగా ఉంది, ఇక్కడికి వస్తే శ్మశానంలో ఉన్నట్టు ఉంది ఊపిరి ఆడటం లేదు అందుకే గుడిలో పడుకుందామని వెళ్తున్నా అనేసి వెళ్ళిపోతాడు. సామ్రాట్ రోడ్డు మీద నడుస్తూ అభి చెప్పినవన్నీ కరెక్ట్ తులసి గారికి ఈ ఇబ్బందులు రావడానికి కారణం తనే అని తిట్టుకుంటూ ఉంటాడు.

అటు సామ్రాట్ కోసం తులసి రోడ్డు మీద పడి వెతుకుతూ ఉంటుంది. తులసికి దూరంగా వెళ్లిపోవాలని సామ్రాట్ అనుకుంటాడు.. అప్పుడే తులసి ఎదురుపడుతుంది. మీరు ఏం చెప్పినా నేను వినను, అందరూ మీకు సామ్రాట్ కి దూరంగా ఉండమనే చెప్తున్నారు, ఎందుకు వినడం లేదని తులసిని నిలదీస్తాడు.

తులసి: మీరు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్లకూడదు, దీని గురించి మాట్లాడటానికి వీల్లేదు

సామ్రాట్: ఇన్నాళ్ళూ నేను అదే అనుకున్నా కానీ జనాలు అనుకునేవి పట్టించుకోవాలి, పరిస్థితులు చక్కదిద్దాలసిన బాధ్యత నాదే, మీ ఫ్యామిలీలో మన మీద అనుమానాలు క్లారిటీ ఇవ్వాలి, నేను వాళ్ళతో మాట్లాడాలి

News Reels

తులసి: దయచేసి నా మాట వినండి, ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి

సామ్రాట్: ఏదో ఒకటి చెయ్యాలి అని ఆవేశంగా వెళ్ళిపోతాడు

Also Read: చిక్కుల్లో పడ్డ దేవయాని- తండ్రికి దగ్గరగా రిషి, వాళ్ళని చూస్తాడా?

కారు హార్న్ కొట్టేసరికి తులసి పక్కకి తిరిగేసరికి సామ్రాట్ వెళ్ళిపోతాడు. మావయ్యతో మాట్లాడటానికి సామ్రాట్ ఇంటికి వెళ్ళి ఉంటాడని తులసి అనుకుంటుంది. అప్పుడే నందు, అనసూయ వాళ్ళు తులసి, సామ్రాట్ ని తిడుతుంది. తులసి బాగుపడదు, నాశనం అయిపోతుంది, ఏదో ఒక రోజు బజారున పడుతుందని అనసూయ శాపనార్థాలు పెడుతూ ఉంటే సామ్రాట్ ఎంట్రీ ఇస్తాడు. వెళ్లిపొమ్మని నందు కోపంగా అంటాడు. సామ్రాట్ మాత్రం వెళ్ళను అని అంటాడు.

‘దయచేసి తులసి గారి మీద బురద చల్లడం ఆపండి, తులసిగారి ప్రేమలో పడిన విషయం నిజమే. ఆమె జీవితంలో మొదటిసారి ప్రేమలో పడ్డారు. అది ఎవరితోనే తెలుసా నీతోనే కేవలం నిన్ను మాత్రమే. ప్రేమకి బదులుగా ఎవరైనా ప్రేమ ఇస్తారు కానీ నువ్వు తన మనసుకి గాయం చేసి ముక్కలు చేశావ్. ఇప్పటి వరకి తన మనసులో ఎవరికి చోటు ఇవ్వలేదు, తన మనసులో ఉంది పిల్లలు, మావయ్య గారు మీరే. తులసిగారి బదులు నన్ను అవమానించండి ప్లీజ్ తనని మాత్రం వదిలెయ్యండి, ఏమి చేయలేక కుమిలిపోతుంది. చేతులు జోడించి ఇంట్లో వాళ్ళందరిని బతిమలాడుతూ తులసిని వదిలేయమని’ అని అడుగుతాడు.   

Also Read: తగలబెట్టుకుంటానన్న మోనిత, పట్టించుకోని కార్తీక్- ఉగ్రరూపం దాల్చిన దీప

చాలా విషయం చెప్పావ్ ఇక చాలు ఆపు తన మీద కొప్పడే హక్కు నాకుంది, తను నా పిల్లల తల్లి అని నందు అంటాడు. తులసి పరుగులు పెట్టుకుంటూ ఇంటికి వస్తుంది. నందు కోపంగా సామ్రాట్ కాలర్ పట్టుకుంటాడు. మీ మేడమ్ గారి కోసం మాతో యుద్ధం చేస్తున్నారు ఇది ప్రేమ కాకపోతే ఇంకేంటి అని నందు నిలదీస్తాడు. నందు తులసి గురించి నానామాటలు అంటాడు. అదంతా తులసి చాటుగా వింటూనే ఉంటుంది. తులసికి నీకు మధ్య ఉన్న బంధం ఏంటి మోజా అని నీచంగా మాట్లాడతాడు. ‘నీకు కావలసింది మా మధ్య ఉంది స్నేహం కాదని ఒప్పుకోవడమే కదా.. నా మసనులో తులసి గారిని నేను దేవతగా ఆరాధిస్తున్నా, గౌరవిస్తున్నా.. అందుకు కారణం మీ మీద ఆమె చూపిస్తున్న ప్రేమ. నేను తనని స్నేహితుడిగా మాత్రమే ఆరాధిస్తున్నా’ అని సామ్రాట్ అరుస్తాడు.

‘తులసిగారి స్నేహంలో నేను మనిషిగా మారాను, కానీ పాతికేళ్లు కాపురం చేసి నువ్వేమి నేర్చుకోలేకపోయావు. చాలా ఓపికగా నా మాటలు విన్నందుకు థాంక్స్. నేను తనకి స్నేహితుడిని మాత్రమే. తన మనసులో ఉంది నేను కాదు మీరందరూ, ఇకనైనా ఆమెని హ్యూమీలేట్ చేయడం ఆపండి’ అని సామ్రాట్ చెప్తాడు. తులసి బాధపడటం ప్రేమ్ చూస్తాడు. స్నేహం కోసం ఎంతదూరం అయినా వెళ్తాను, తులసి గారికి ఈ ఫ్రెండ్ ఉన్నాడు అని నందుకి సవాల్ విసురుతాడు.

Published at : 14 Nov 2022 10:40 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial November 14th Update

సంబంధిత కథనాలు

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Chiranjeevi Photo: నేవీ అధికారులను చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయ్ - అలనాటి అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్!

Chiranjeevi Photo: నేవీ అధికారులను చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయ్ - అలనాటి అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్!

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

టాప్ స్టోరీస్

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

గర్భం దాల్చేందుకు పల్లెటూరికి విదేశీ యువతులు క్యూ! మగాళ్లకు డబ్బులిచ్చి మరీ గర్బధారణ !

గర్భం దాల్చేందుకు పల్లెటూరికి విదేశీ యువతులు క్యూ! మగాళ్లకు డబ్బులిచ్చి మరీ గర్బధారణ !