Rashmika Mandanna: రష్మికకు మరో కోలీవుడ్ ఆఫర్? పాన్ ఇండియా సినిమాకు 'ఎస్' అంటుందా?
రష్మికా మందన్నాకు చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఈ తరుణంలో కోలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా సినిమా ఆఫర్ వచ్చిందని టాక్.
![Rashmika Mandanna: రష్మికకు మరో కోలీవుడ్ ఆఫర్? పాన్ ఇండియా సినిమాకు 'ఎస్' అంటుందా? Rashmika Mandanna offered Pan India film from Kollywood, Know Details Inside Rashmika Mandanna: రష్మికకు మరో కోలీవుడ్ ఆఫర్? పాన్ ఇండియా సినిమాకు 'ఎస్' అంటుందా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/19/cfdbf1078cd5b07eafb47f84a1bbf4ce1658200290_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనే తేడా లేదు... నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna)కు ఆల్ ఓవర్ ఇండియా అంతటా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే, ఆమెకు అన్ని భాషల నుంచి అవకాశాలు క్యూ కడుతున్నాయి. లేటెస్ట్ టాక్ ఏంటంటే... కోలీవుడ్ నుంచి ఆమెకు పాన్ ఇండియా సినిమా ఆఫర్ వచ్చిందట!
చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కథానాయకుడిగా 'కాలా', 'కబాలి' ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో ఇటీవల ఒక సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. విక్రమ్ 61వ చిత్రమిది. ఆయనకు జోడీగా రష్మిక (Rashmika In Chiyaan Vikram 61?) ను తీసుకోవాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట. త్వరలో ఆమెను కలిసి కథ కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయని టాక్. మరి, రష్మిక ఏం అంటారో చూడాలి.
చియాన్ విక్రం 61వ సినిమాను 1800 కాలం నాటి కథతో త్రీడీలో తీయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకే, అన్ని భాషల్లో క్రేజ్ ఉన్న రష్మికను కథానాయికగా తీసుకోవాలని అనుకుంటున్నారట.
Also Read : చిరంజీవి అబద్ధాలకు పడతారు కానీ పవన్ కళ్యాణ్‌ను కన్వీన్స్ చేయడం కష్టమే!
ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న తెలుగు, తమిళ సినిమా 'వారసుడు'లో రష్మిక నటిస్తున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ 'పుష్ప 2' స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ 'సీతా రామం' విడుదలకు రెడీగా ఉంది. హిందీలో రెండు సినిమాలు, తెలుగులో మరో సినిమా ఉంది. ఇంత బిజీ షెడ్యూల్‌లో విజయ్ సినిమాకు రష్మిక ఓకే అంటారా? లేదా? చూడాలి.
Also Read : 'సీతా రామం' కోసం సిరివెన్నెల రాసిన పాట విన్నారా? 'కానున్న కళ్యాణం' పాట అర్థం ఇదే
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)