By: ABP Desam | Updated at : 19 Jul 2022 08:05 AM (IST)
నిహారిక
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఇద్దరూ అన్నదమ్ములు. అయితే, ఇద్దరి వ్యక్తిత్వాలు వేర్వేరు. వీళ్ళిద్దరితోనూ నిహారిక కొణిదెల (Niharika Konidela)కి క్లోజ్ రిలేషన్ ఉంది. చిరంజీవి ఆమెకు పెదనాన్న అయితే... పవన్ కళ్యాణ్ బాబాయ్! పెదనాన్న, బాబాయ్ గురించి 'క్యాష్' ప్రోగ్రామ్‌లో నిహారికకు ఒక క్వశ్చన్ ఎదురైంది.
''వీళ్ళిద్దరిలో ఎవరిని మీ మాటలతో, చేష్టలతో కరిగించడం మీకు చాలా ఈజీ?'' అని నిహారికను సుమ ప్రశ్నించారు. a) చిరంజీవి, b) పవన్ కళ్యాణ్ అని ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ''కరిగించాల్సి వస్తే... మే బీ చిరంజీవి గారు'' అని నిహారిక చెప్పారు.
ఆ వెంటనే... అదే షోలో ఉన్న నిఖిల్ విజయేంద్ర సింహ ''చిరంజీవి గారికి ఏ అబద్ధం చెప్పినా నమ్ముతారు. కానీ, పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలకు పడరు. ఆయన్ను కన్వీన్స్ చేయడం ఇంపాజిబుల్ అని (నిహారిక" క్యాష్ ప్రోగ్రామ్‌లో చెబుతున్నారు'' అంటూ బ్రేకింగ్ న్యూస్ టైపులో చెప్పుకొచ్చారు. తర్వాత 'ఓవర్ టు సుమ' అంటే... 'ఇది చాలా ఓవర్' అంటూ సుమ సెటైర్ వేశారు.
నిహారిక నటి మాత్రమే కాదు, నిర్మాత కూడా! పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ ఉంటారు. నిఖిల్ విజయేంద్ర సింహ, 'దేవుళ్ళు' ఫేమ్ నిత్యా శెట్టి, యూట్యూబర్ అనిల్ తదితరులతో 'జీ 5' కోసం 'హలో వరల్డ్' అని ఒక వెబ్ సిరీస్ తీస్తున్నారు. త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా 'క్యాష్'లో సందడి చేశారు.
Also Read : 'సీతా రామం' కోసం సిరివెన్నెల రాసిన పాట విన్నారా? 'కానున్న కళ్యాణం' పాట అర్థం ఇదే
నిఖిల్ విజయేంద్ర సింహపై నిహారిక, సుమ పంచ్‌ల వర్షం కురిపించారు. 'నువ్వు పసి కందు కాదు... కసి కందు' అంటూ చెప్పే డైలాగ్‌లో కామెడీ టైమింగ్ బావుంది. టీమ్ మధ్య ఫ్రెండ్షిప్ 'క్యాష్' ప్రోమోలో కనిపించింది.
Also Read : 'స్లమ్‌డాగ్ మిలియనీర్'కు 8 ఆస్కార్స్ వచ్చినప్పుడు 'ఆర్ఆర్ఆర్'కు ఎందుకు రాకూడదు?
Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!
Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!
Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్: ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ
Gruhalakshmi August 13th Update: తులసి వాళ్ళు వెళ్ళే విమానానికి ప్రమాదం - శ్రుతిని ఇంటికి తీసుకొచ్చేయ్యమని ప్రేమ్ కి చెప్పిన అంకిత
Ashwini Dutt : ఓటీటీలు కాదు, అదే అత్యంత ప్రమాదకరం - వారికి మాత్రమే థియేటర్లు: అశ్వనీదత్
Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!
Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇక ఆన్లైన్లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!