అన్వేషించండి

Rakul Preet Singh Wedding: రకుల్ పెళ్లికి అంతా సిద్ధం? వేదిక అక్కడేనట!

Rakul Preet Singh: టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ సంపాదించుకొని తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసింది రకుల్. ఇక త్వరలోనే ఈ భామ.. తన బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి పీటలెక్కనుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Rakul Preet Singh Wedding : ఒకప్పుడు సినీ పరిశ్రమలో కలిసి సినిమాలు చేసిన హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద విషయంగా ఉండేది. కానీ గత కొంతకాలంగా ఇది కామన్ అయిపోయింది. సినిమాల్లో కలిసి పనిచేసినా చేయకపోయినా.. తమ సహ నటీనటులను పెళ్లి చేసుకోవడానికే సెలబ్రిటీలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే గత రెండేళ్లలో ఎంతోమంది హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక 2024లో కూడా ఒక సినీ సెలబ్రిటీ జంట పెళ్లికి సిద్ధమయినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ నటుడు ఎవరో తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోయినా.. నటి గురించి మాత్రం తెలుగు సినీ లవర్స్‌కు సుపరిచితమే. తను మరెవరో కాదు.. రకుల్ ప్రీత్ సింగ్.

హీరో మాత్రమే కాదు.. నిర్మాత కూడా..

రకుల్ ప్రీత్ సింగ్.. గతకొంతకాలంగా ఒక నటుడు కమ్ ప్రొడ్యూసర్‌తో ప్రేమలో ఉంది. రెండేళ్ల క్రితం రకుల్ పుట్టినరోజు సందర్భంగా తన ప్రేమ గురించి బయటపెట్టింది. బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో తను సీరియస్ ప్రేమలో ఉన్నట్టుగా తనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. దీంతో బాలీవుడ్‌లో మరో కొత్త కపుల్ యాడ్ అయ్యారని నెటిజన్లు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ప్రముఖ నిర్మాత వాషు భగ్నానీ వారసుడిగా సినిమాల్లోకి ఎంటర్ అయిన జాకీకి హీరోగా అంతగా కలిసిరాలేదు. అందుకే నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్న జాకీ.. తన గర్ల్‌ఫ్రెండ్ రకుల్ నటించిన సినిమానే ప్రొడ్యూస్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరు ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉండగా.. ఈ ఏడాదిలోనే వీరి పెళ్లి జరగనున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.

డెస్టినేషన్ వెడ్డింగ్

ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్.. తన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడానికి మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి తన పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యేవి. అందుకే సహనం కోల్పోయిన రకుల్.. పలుమార్లు ఘాటుగా స్పందించింది. పెళ్లి గురించి డిసైడ్ అయినప్పుడు తామే స్వయంగా అనౌన్స్ చేస్తామని పలుమార్లు స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. అయినా మరోసారి 2024లో రకుల్, జాకీల పెళ్లి తప్పకుండా జరుగుతుంది అని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఫిబ్రవరీలో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని బాలీవుడ్‌లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఎప్పుడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయం నిజమా కాదా అని రకుల్ క్లారిటీ ఇస్తుందా లేదా ఇతర బాలీవుడ్ నటీనటులలాగానే సైలెంట్‌గా పెళ్లి చేసేసుకొని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)

బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు..
తెలుగులో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్న రకుల్.. టాలీవుడ్ వైపు తిరిగి చూసి చాలాకాలమే అయ్యింది. తనకు వరుసగా బాలీవుడ్‌లోనే ఆఫర్లు వస్తుండడంతో అక్కడే సెటిల్ అయిపోయింది. హిందీలో రకుల్ నటించిన సినిమాలు హిట్ అయినా.. ఫ్లాప్ అయినా పట్టించుకోకుండా తనకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక హిందీ సినిమాతో పాటు ఒక తమిళ చిత్రం కూడా ఉంది. శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’లో ఈ భామ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. అంతే కాకుండా శివకార్తికేయన్ సరసన తను నటించిన ‘అయాలన్’ కూడా విడుదలకు సిద్ధమయ్యింది. వీటితో పాటు ‘మేరీ పత్నీ కా’ హిందీ రీమేక్‌లో కూడా రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read: ‘కల్ట్’ టైటిల్ నాదే, నిర్మాతలు కొడతారు నన్ను - విశ్వక్ సేన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Embed widget