అన్వేషించండి

Dhanush Mrunal Thakur Dating: ధనుష్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తోందా?... అందుకు అవే సాక్ష్యాలా?

Mrunal Thakur Dhanush Dating: రెండు రోజులుగా నేషనల్, కోలీవుడ్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నారని! అందులో నిజమెంత? అనేది చూస్తే...

ఐశ్వర్యా రజినీకాంత్‌ (Aishwarya Rajinikanth)తో ధనుష్ (Dhanush) విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తమ 18 ఏళ్ల వివాహా బంధానికి వాళ్లిద్దరూ 2022లో స్వస్తి పలికారు. వారి విడాకుల విషయాన్ని 2022లో ప్రకటించగా... 2024లో డివోర్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కారు. ఇప్పుడు వారిద్దరూ విడి విడిగా ఉంటున్న సంగతి తమిళ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ అందరికీ తెలుసు. కానీ ఇద్దరి కొడుకుల కోసం మాత్రం ధనుష్, ఐశ్వర్య తల్లిదండ్రులు చేయాల్సిన, నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని మాత్రం పంచుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు కొత్తగా ధనుష్ డేటింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. 

మృణాల్ ఠాకూర్ ప్రేమలో ధనుష్?
ధనుష్ డేటింగ్ చేస్తున్నాడంటూ అతగాడి లిస్ట్‌లోకి ఇంకో హీరోయిన్ పేరు చేరిపోయింది. ప్రస్తుతం నార్త్, సౌత్‌లో క్రేజీయెస్ట్ భామగా మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur)కు మంచి డిమాండ్ ఏర్పడింది. 'సీతా రామం' మూవీతో సౌత్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. 'హాయ్ నాన్న' అంటూ మళ్లీ హిట్ కొట్టారు. ఇప్పుడు ఆమె చేతిలో పలు సౌత్ సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్ ప్రాజెక్టుల్ని కూడా ఆమె లైనులో పెట్టేశారు. ఇటీవల అజయ్ దేవగణ్‌ సరసన మృణాల్ ఠాకూర్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' మూవీ రిలీజ్ అయ్యింది.

'సన్ ఆఫ్ సర్దార్ 2' మూవీ రిజల్ట్ ఆశించినట్టు లేదు. కలెక్షన్స్ అంతగా రాలేదు. కానీ ఆ సినిమా ప్రమోషన్స్ క్రమంలో ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్‌లో ధనుష్, మృణాల్ చెట్టా పట్టాలేసుకుని కనిపించారు. చేతిలో చేయి వేసుకుని నడుస్తూ కనిపించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, ప్రేమలో ఉన్నారని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు.

Also Read: విడాకులు తీసుకుంటున్న మరో హీరోయిన్? ఉన్నట్టుండి వస్తున్న లీక్స్ వెనుక కారణం ఏమిటి?

అయితే బీ టౌన్ నుంచి కూడా దాదాపు ఇదే సమాధానం వస్తోంది. అయితే వారి ప్రేమను మాత్రం ఇంకా నిర్దారించలేమని, వారు కూడా ఈ విషయాన్ని పబ్లిక్ లేదా మీడియాకు చెప్పడానికి సుముఖత వ్యక్తం చేయలేదని అక్కడి మీడియా కోడై కూస్తోంది. మరి వీరిద్దరి రిలేషన్ మీద ఓపెన్ స్టేట్మెంట్ కానీ, ఖండించడం గానీ ఎప్పుడు జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ అయితే తెలుగులో అడివి శేష్‌తో 'డెకాయిట్' అనే మూవీని చేస్తున్నారు. ఇక ధనుష్ అయితే అటు దర్శకుడు, నిర్మాత, హీరోగా అంటూ పలు ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించి ఉన్న సంగతి తెలిసిందే.

Also Read:

టాప్ హెడ్ లైన్స్

KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget