Sangeetha Divorce: విడాకులు తీసుకుంటున్న మరో హీరోయిన్? ఉన్నట్టుండి వస్తున్న లీక్స్ వెనుక కారణం ఏమిటి?
Actress Sangeetha Divorce: సీనియర్ హీరోయిన్ సంగీత విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారా? ఆవిడ వైవాహిక జీవితంలో సమస్యలు తెలెత్తాయా? అంటే... దీనిపై చెన్నై సినీ వర్గాల్లో వాడివేడి చర్చ జరుగుతోంది.

నటి సంగీత (actress Sangeetha) పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. 'పెళ్లాం ఊరెళితే' నుంచి మొదలు పెడితే 'ఖడ్గం', 'సంక్రాంతి' వరకు - పలు బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో ఆమె ఖాతాలో ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ'తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు సినిమా వార్తలతో కాకుండా వ్యక్తిగత జీవితంలో సమస్యల కారణంగా సంగీత వార్తల్లో నిలిచారు.
విడాకులు తీసుకుంటున్న సంగీత...
సోషల్ మీడియాలో పేరు మార్పు ఏంటి?
విడాకులకు ముందు సినీ తారలు లీక్స్ ఇవ్వడం కామన్. సోషల్ మీడియాలో పేరు చివర భర్త పేర్లు తొలగించడం ఆ హింట్స్‌లో ఒకటి. సంగీత కూడా ఆ పని చేశారు. ఓ లీక్ ఇచ్చారు. ఇన్ స్టాలో ఇన్ని రోజులు సంగీత క్రిష్ అని కనిపించేది. ఇప్పుడు కేవలం సంగీత అని మాత్రమే ఉంది. క్రిష్ అనే పేరును తొలగించడంతో సంగీత విడాకులు తీసుకుందని, భర్తతో వేరుగా ఉంటుందనే రూమర్లు పుట్టుకొచ్చాయి.
ఇన్ స్టాలో పేరు తొలగించడం, తరువాత విడాకులు ప్రకటించడం అనేది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అన్న సంగతి తెలిసిందే. మరి ఇలానే సంగీత కూడా త్వరలోనే విడాలకు ప్రకటన ఏమైనా చేస్తుందా? అని అంతా అనుకుంటున్నారు. 2009లో సింగర్ క్రిష్, సంగీత వివాహాం చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. ఇన్‌స్టా నుంచి భర్త పేరు తీసేసినా... ఆయన ఫోటోలు మాత్రం అలానే ఉంచింది. డిలీట్ చేయలేదు. సంగీత, క్రిష్ విడిపోతున్నారా? విడాకులు తీసుకుంటారా? లేదా ఈ విడాకులు అనేది రూమర్లుగానే అంతా మర్చిపోతారా? అభిమానులకు ఏమైనా షాక్ ఇస్తారా? అన్నది చూడాలి. ప్రస్తుతం సంగీత కొన్ని బుల్లితెర షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ఉన్నారు.
తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ సంగీతకు మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు మాత్రం సంగీత ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు. తెరపై ఎక్కువగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటారు. 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మళ్లీ సంగీత ఇక్కడ సినిమాలు చేయలేదని చెప్పాలి. ఆ మూవీతో చాలా రోజులకు తెలుగు ఆడియెన్స్‌ను పలకరించి, నవ్వించారు. అనుపమా పరమేశ్వరన్ 'పరదా'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సంగీత అప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో అలానే ఉన్నారు. రీసెంట్‌గానే 90స్ బ్యాచ్ అంతా ఒకే చోటకు చేరారు. అందులో మీనా, సంగీత ఇలా నాటి హీరోయిన్లంతా సందడి చేశారు. సోషల్ మీడియాలో సంగీత, స్నేహ, మీనా ఇలా కలిసి కట్టుగా కనిపిస్తుంటారు. ఇక మీనా, సంగీత స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఫ్రెండ్ షిప్ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.





















