Gopichand Ramabanam : బాలకృష్ణ చెప్పిన టైటిల్ ఫిక్స్ చేసిన గోపీచంద్
Gopichand 30 is Rama Banam Telugu Movie : గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా టైటిల్ ఈ రోజు వెల్లడించారు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ చెప్పిన టైటిల్ ఫిక్స్ చేయడం విశేషం.
![Gopichand Ramabanam : బాలకృష్ణ చెప్పిన టైటిల్ ఫిక్స్ చేసిన గోపీచంద్ Gopichand Next Movie Named Ramabanam announced officially today as suggested by Balakrishna In Unstoppable show Gopichand Ramabanam : బాలకృష్ణ చెప్పిన టైటిల్ ఫిక్స్ చేసిన గోపీచంద్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/14/32dc1adcec3ca060e0deaf139266cd7d1673686790675313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand) కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సంక్రాంతి సందర్భంగా సినిమా టైటిల్ వెల్లడించారు. టైటిల్ లోగో కూడా విడుదల చేశారు. విశేషం ఏమిటంటే... 'అన్‌స్టాపబుల్ 2' టాక్ షోలో బాలకృష్ణ ఫిక్స్ చేసిన టైటిల్ అది!
గోపీచంద్ 30... రామ బాణం!
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు సెంటిమెంట్లు ఎక్కువ. ఆయన ముహూర్తాలు, పేర్లు, బాలలు చూస్తారు. హీరో గోపీచంద్‌కు కూడా ఓ విషయంలో సెంటిమెంట్ ఉంది. ఆయన సినిమా పేరు చివర 'అం' (సున్నా) వచ్చిందంటే సినిమా సూపర్ హిట్టే.
'జయం', 'నిజం', 'వర్షం'... గోపీచంద్ ప్రతినాయకుడిగా నటించిన మూడు సినిమాల్లో చివర 'అం' ఉంది. ఆ సినిమాలు పక్కన పెడితే... కథానాయకుడిగా చేసిన 'యజ్ఞం', 'రణం', 'లక్ష్యం', 'శౌర్యం', 'శంఖం', 'సాహసం', 'లౌక్యం', 'సౌఖ్యం', 'పంతం' ఉన్నాయి. ఎక్కడో ఒకటి అరా తప్పిస్తే మిగతా సినిమాలు అన్నీ హిట్టే. 'అన్‌స్టాపబుల్ 2' టాక్ షోలో ఆ సెంటిమెంట్ ప్రకారం, అక్షర బలం కూడా చూసి గోపీచంద్ కొత్త సినిమాకు బాలకృష్ణ టైటిల్ పెట్టారు. 'రామ బాణం' అని చెప్పారు. ఇప్పుడు సినిమాకు అదే టైటిల్ ఖరారు చేశారు.
రామ బాణం... ఎదురే లేని టైటిల్!
గోపీచంద్ హీరోగా శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి సందర్భంగా నేడు టైటిల్ వెల్లడించింది. ''ఎదురే లేని టైటిల్... గోపీచంద్ 30వ సినిమాకు 'రామ బాణం' టైటిల్ ఖరారు చేశాం. 'లక్ష్యం', 'లౌక్యం' సినిమాల తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కలయికలో హ్యాట్రిక్ సినిమా ఇది'' అని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పేర్కొంది.
View this post on Instagram
ఒక్కసారి 'అన్‌స్టాపబుల్ 2' షోలో ఏం జరిగింది? అనేది గుర్తు చేసుకుంటే... ''నీకు టైటిల్ చివరలో సున్నా... నాకు మధ్యలో సున్నా... ఇదొక సెంటిమెంట్! నా షోకి వచ్చావ్ కదా! ఇప్పుడు నీ సినిమాకు నేను టైటిల్ పెడతా! ఓకేనా?'' అని బాలకృష్ణ అడిగారు. ''మీరు చూస్తే మంచి ముహూర్తం చూసి పెడతారు సార్! అదిరిపోతుంది. పెట్టించేసుకో'' అని ప్రభాస్ అన్నారు. ''అక్షర బలం కూడా ఉండాలయ్యా! కేవలం ముహూర్తం ఉంటే సరిపోదు'' అని చెప్పిన బాలకృష్ణ... 'రామ బాణం' (Rama Banam Movie) టైటిల్ సూచించారు. ''బాలయ్య పెట్టిన టైటిల్ అని చెప్పండి. ఇక దానికి ఎదురు ఉండదు'' అన్నారు. వంద రోజుల వేడుకకు తాను ముఖ్య అతిథిగా వస్తానని గోపీచంద్‌కు బాలకృష్ణ మాట ఇచ్చారు.
Also Read : 'కళ్యాణం కమనీయం' రివ్యూ : సంతోష్ శోభన్, ప్రియాల కళ్యాణం కమనీయంగా ఉందా? లేదంటే బోర్ కొడుతుందా?
'లక్ష్యం', 'లౌక్యం' విజయాల తర్వాత గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. హ్యాట్రిక్ మీద కన్నేశారు. ఇది గోపీచంద్ 30వ సినిమా. 'కార్తికేయ 2', 'ధమాకా' విజయాలు అందుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ చిత్రానికే నట సింహం బాలకృష్ణ 'రామ బాణం' టైటిల్ ఖరారు చేసింది. అన్నట్టు... ఆయన హీరోగా నటించిన 'డిక్టేటర్' సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించారు.
'రామ బాణం' సినిమాలో గోపిచంద్ సరసన కథానాయికగా డింపుల్ హయతి నటిస్తున్నారు. జగపతి బాబు, ఖుష్బూ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : వారసుడు రివ్యూ: దిల్ రాజు ‘వారసుడు’ ఎలా ఉంది? విజయ్‌కి హిట్టు లభించిందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)