అన్వేషించండి

Vaarasudu Review: వారసుడు రివ్యూ: దిల్ రాజు ‘వారసుడు’ ఎలా ఉంది? విజయ్‌కి హిట్టు లభించిందా?

తలపతి విజయ్ ‘వారసుడు’ ఎలా ఉన్నాడు? ఆడియన్స్‌ను మెప్పించిందా?

సినిమా రివ్యూ : వారసుడు
రేటింగ్ : 2.5/5
నటీనటులు : విజయ్, రష్మిక మందన్న, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సంగీత, ప్రభు, సుమన్, జయసుధ, యోగిబాబు, నందిని రాయ్, ఎస్‌జే సూర్య, సంయుక్త, వీటీవీ గణేష్, సతీష్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే  : వంశీ పైడిపల్లి, హరి, సోల్మన్
ఛాయాగ్రహణం : కార్తీక్ పళణి
సంగీతం : ఎస్.ఎస్.థమన్
నిర్మాత : దిల్ రాజు
దర్శకత్వం : వంశీ పైడిపల్లి
విడుదల తేదీ: జనవరి 14, 2022

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా ‘వారిసు’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరుతో డబ్ చేశారు. విజయ్ జోడిగా రష్మిక మందన్న నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్, కిక్ శ్యామ్, శరత్ కుమార్, జయసుధ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కంటే కాంట్రవర్సీలతోనే ‘వారసుడు’కు ఎక్కువ ప్రచారం లభించింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది?

కథ: రాజేంద్ర (శరత్ కుమార్) పెద్ద బిజినెస్ మ్యాన్. తనకు జై (శ్రీకాంత్), అజయ్ (కిక్ శ్యామ్), విజయ్ (విజయ్) కొడుకులు. తన తదనంతరం ఈ ముగ్గురిలో ఒకరికి తన వ్యాపార సామ్రాజ్యాన్ని అందించాలనుకుంటాడు. కానీ తండ్రి ఆలోచనలకు, తన ఆలోచనలకు సెట్ అవ్వకపోవడంతో విజయ్ ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. ఏడు సంవత్సరాల తర్వాత రాజేంద్రకు అత్యంత ప్రమాదకరమైన పాంక్రియాటిక్ క్యాన్సర్ అని తెలుస్తుంది. దీంతో భార్య సుధ (జయసుధ) కోరిక మేరకు షష్టిపూర్తి వేడుకలకు ఒప్పుకుంటాడు. ఆ వేడుకలకు విజయ్ కూడా వస్తాడు. ఈ క్రమంలోనే జై, అజయ్‌లు చేసిన తప్పులు కూడా బయటపడతాయి. ఆ తర్వాత రాజేంద్ర ఏం చేశాడు? రాజేంద్రను దెబ్బ కొట్టాలనుకున్న జయప్రకాష్ (ప్రకాష్ రాజ్) కథేంటి? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ: కాలం మారేకొద్దీ ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారుతోంది. థియేటర్‌కు రావాలంటే ఆ సినిమాలో కచ్చితంగా అందులో ఏదో ప్రత్యేకత ఉండాలని కోరుకుంటున్నారు. కొత్తదనం ఉన్న సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. కానీ ఎంటర్‌టైనింగ్‌గా, ఎంగేజింగ్‌గా తీస్తే ఫ్యామిలీ, యాక్షన్ సినిమాలను కూడా ఆదరిస్తున్నారు. ‘వారసుడు’ కొత్త కథేమీ కాదు. మనం ఇప్పటికే చాలా సార్లు చూసిన కథ. కానీ దీన్ని ఆకట్టుకునేలా తీయడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి కొంతమేర సక్సెస్ అయ్యారు.

హీరో తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బతీయడానికి విలన్ వేసే ఎత్తుగడలతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్, హీరో ఇంటికి తిరిగి రావడం ఇలా ఫస్టాఫ్ అంతా ఫ్యామిలీ ఎమోషన్స్ మీదనే సాగుతుంది. ప్రథమార్థంలో ఒక్క యాక్షన్ సీన్ కూడా ఉండదు. ఎప్పుడైతే హీరోను సీఈవోగా ప్రకటించి, కుటుంబం విడిపోతుందో అప్పటి నుంచి యాక్షన్ సన్నివేశాలు ప్రారంభం అవుతాయి. స్క్రీన్ మీద నడుస్తున్న సన్నివేశాలు ‘అబ్బో... ఎప్పుడో చూసేశాం’ అనిపించినా బోర్ మాత్రం కొట్టదు. సినిమా అంతా అలాగే సాగిపోతుంది. విజయ్‌లోని ఫన్ సైడ్ ఇందులో చూడవచ్చు. తమిళ ప్రేక్షకులు చూసి ఉండవచ్చు కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం విజయ్‌లోని కామెడీ టైమింగ్ ఇప్పటివరకు చూడలేదు. బీస్ట్, మాస్టర్, విజిల్... ఇలా తన గత సినిమాల్లో లేనంత కామెడీని విజయ్ ఇందులో ప్రయత్నించాడు. అందులో కొంచెం సక్సెస్ అయ్యాడు. 

విడుదల అయ్యాక సినిమా మీద వచ్చే సెటైర్లు ముందే చిత్రబృందం గ్రహించినట్లు ఉంటుంది. అందుకేనేమో ఇందులో చాలా సెల్ఫ్ సెటైర్స్ కూడా ఉన్నాయి. ఫస్టాఫ్‌లో ఫ్యామిలీ డిన్నర్ సీన్‌కు ముందు యోగిబాబు ‘పద... అక్కడ కూర్చుని కాసేపు సీరియల్ చూద్దాం.’ అని విజయ్‌తో అనడం, సెకండాఫ్‌లో బోర్డ్ మీటింగ్ సీన్ తర్వాత ‘మూడు బ్లాక్‌బస్టర్లు వేసి ఒకే సినిమా చూపించా... ఎలా ఉందో చూశావా?’ అని విజయ్ అనడం అలాంటివే. క్లైమ్యాక్స్‌లో శ్రీకాంత్ ఫ్యామిలీ గొప్పతనం గురించి చెబుతుంటే వెనక విజయ్ నవ్వుతూ ఉంటాడు. బహుశా ఆడియన్స్ రియాక్షన్ కూడా అదేనని ముందే గెస్ చేశారేమో.

ఇక విజయ్ గత సినిమాలు, ఆడియో లాంచ్ స్పీచ్‌లకు సంబంధించిన రిఫరెన్సులు కూడా సినిమాలో చాలా ఉన్నాయి. ‘విజిల్’, ‘మాస్టర్’ సినిమాలు తప్ప మిగతావి తెలుగు వారికి అస్సలు కనెక్ట్ కావు. సినిమా ప్రారంభంలో బొమ్మరిల్లు, ఆ తర్వాత లక్ష్మి, అల వైకుంఠపురంలో, ప్రతిరోజూ పండగే ఇలా రకరకాల సినిమాల వాసనలు ఇబ్బంది పెడతాయి. బోర్డ్ మీటింగ్ సీన్ అయితే ‘అల వైకుంఠపురంలో’నే గుర్తు చేస్తుంది. కానీ ఈ సీన్‌లో కేవలం విజయ్ గత సినిమాల రిఫరెన్సులు మాత్రమే ఉంటాయి.

ఎస్.ఎస్.థమన్ సంగీతం, రీ-రికార్డింగ్ ఆకట్టుకుంటాయి. పాటల్లో ‘రంజితమే’, ‘సై తలపతి’ , ‘మదర్ సాంగ్’ ఆకట్టుకుంటాయి. కమర్షియల్ సినిమాలకు రీ-రికార్డింగ్ చాలా ముఖ్యం. ఆ విషయంలో కూడా థమన్ సక్సెస్ అయ్యాడు. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్‌గా ఉండాల్సింది. కార్తీక్ పళణి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమాలో ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. 

ఇక నటీనటుల విషయానికి వస్తే... ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇందులో నటించిన అందరూ ఇటువంటి పాత్రలను గతంలోనే పోషించారు. హీరో విజయ్‌కు ఇటువంటి పాత్రలు కొత్తేమీ కాదు. తన కెరీర్ మొదటి నుంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ కథల్లో నటించడంలో కాంటెంపరరీ హీరోల్లో విజయ్ ముందుంటాడు. కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని సన్నివేశాల్లోనూ ఆకట్టుకుంటాడు. ‘రంజితమే’ పాటలో డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. రష్మిక పాత్రకు కథలో పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ తన పరిధి మేరకు నటించింది. యోగిబాబుది లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ అయినా తన పంచ్‌లు ఆకట్టుకుంటాయి. ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, సంగీత ఇలా అందరినీ గతంలోనే ఇలాంటి పాత్రల్లో చూశాం. కిక్ శ్యామ్‌కు మాత్రం కొంచెం కొత్త తరహా పాత్ర దక్కింది.

ఓవరాల్‌గా చెప్పాలంటే... కథ, కథనం రొటీన్‌గా ఉన్నా పర్లేదు, కాస్త ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నా చాలు అనుకుంటే మాత్రం ఈ ‘వారసుడు’ని ఒకసారి చూడవచ్చు.

Also Read : 'వీర సింహా రెడ్డి' రివ్యూ : బాలకృష్ణ విశ్వరూపం, వీర విహారం - ఫ్యాక్షన్ స్టోరీ, సినిమా ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US New President Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Indians In America Elections 2024:అమెరికా ఎన్నికల్లో భారతీయం- గెలిచిన భారతీయ సంతతి వ్యక్తులెవరో తెలుసా?
అమెరికా ఎన్నికల్లో భారతీయం- గెలిచిన భారతీయ సంతతి వ్యక్తులెవరో తెలుసా?
AP DSC 2024: ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఢిల్లీకి వెళ్తున్న పవన్ కళ్యాణ్, రీజన్ ఇదేనా?నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US New President Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Indians In America Elections 2024:అమెరికా ఎన్నికల్లో భారతీయం- గెలిచిన భారతీయ సంతతి వ్యక్తులెవరో తెలుసా?
అమెరికా ఎన్నికల్లో భారతీయం- గెలిచిన భారతీయ సంతతి వ్యక్తులెవరో తెలుసా?
AP DSC 2024: ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
US Election Elon Musk: గెలిచింది ట్రంప్ - గెలిపించింది మస్క్ -అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్
గెలిచింది ట్రంప్ - గెలిపించింది మస్క్ -అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్
Donald Trump Properties: బిలియన్ డాలర్ల ఆస్తులు, కోట్ల విలువైన కార్లు - డొనాల్డ్ ట్రంప్‌ సంపద ఎంతో తెలుసా?
బిలియన్ డాలర్ల ఆస్తులు, కోట్ల విలువైన కార్లు - డొనాల్డ్ ట్రంప్‌ సంపద ఎంతో తెలుసా?
Telangana Survey: 75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
Donald Trump News: అమెరికాలో స్వర్ణయుగం చూస్తాం- విజయం తర్వాత ట్రంప్ తొలి ప్రసంగం
అమెరికాలో స్వర్ణయుగం చూస్తాం- విజయం తర్వాత ట్రంప్ తొలి ప్రసంగం
Embed widget