అన్వేషించండి

God Of War Ragnarok: నవంబర్ 9న ప్లేస్టేషన్‌కి ‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్‘, కంప్లీట్ డీటైల్స్ మీ కోసం!

‘గాడ్ ఆఫ్ వార్’ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ సిరీస్ లో భాగంగా ‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్’ నవంబర్ 9న అందుబాటులోకి రాబోతున్నది. నార్స్ ప్రపంచంలో క్రాటోస్, అట్రియస్ చివరి సాహసం ఇందులో చూడవచ్చు!

సోనీ ఐకానిక్ ‘గాడ్ ఆఫ్ వార్’ సిరీస్‌ లో ఎనిమిదో భాగాన్ని 2018లో విడుదల చేసింది. గ్రీకు పురాణాల ఆధారంగా రూపొందిన లాస్ట్ గేమ్స్ సిరీస్ మాదిరిగా కాకుండా.. ‘గాడ్ ఆఫ్ వార్ 2018’ నార్స్ దేవతల ప్రపంచంలో జరుగుతుంది. క్రాటోస్ భార్య మరణించిన తర్వాత మిడ్‌గార్డ్ రాజ్యంలో ఈ గేమ్ కొనసాగుతుంది. క్రాటోస్, అతడి కుమారుడు అట్రియస్ ఇద్దరూ వివిధ ప్రాంతాలలో ప్రయాణం చేస్తారు. ఇప్పుడు ‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్’ అభిమానుల ముందుకు రాబోతుంది. ఈ గేమ్ నవంబర్ 9న ప్లేస్టేషన్‌లో విడుదల కాబోతుంది. ఇది 2018 గేమ్ సంఘటనల అనంతరం కొన్ని సంవత్సరాల తర్వాత జరిగే కథ. నార్స్ ప్రపంచంలో తండ్రి, కొడుకుల ప్రయాణం గురించి ఇందులో ఉంటుంది.   

‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్’ ప్లేస్టేషన్ 4లో అందుబాటులో ఉంటుందా?

గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్ రూపొందుతున్న సమయంలో ప్లేస్టేషన్ 5 ఎక్స్ క్లూజివ్ టైటిల్ అని  చాలామంది భావించారు. కానీ, ఈ సంవత్సరం ప్రారంభంలో ప్లేస్టేషన్ స్టూడియోస్ హెర్మెన్ హల్స్ట్ హెడ్‌తో Q&A సెషన్‌లో, టైటిల్ గతంలో మాదిరిగా ఉంటుందని వెల్లడించారు. రెండు వెర్షన్‌ల మధ్య ఏదైనా తేడా ఉందా? లేదా? అనే విషయాన్ని సోనీ ఇంకా వెల్లడించాలేదు. ‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్’ వెబ్‌సైట్ ప్లేస్టేషన్ 4 డిజిటల్, డిస్క్ వెర్షన్‌లో ఉన్నవారు అదనపు ఖర్చుతో ప్లేస్టేషన్ 5 డిజిటల్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచించింది.

PC వెర్షన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది?   

PCకి ప్లేస్టేషన్-ఎక్స్‌క్లూజివ్ టైటిల్‌లను తీసుకురావడంలో సోనీ ట్రాక్ రికార్డ్‌ను పరిశీలిస్తే, గాడ్ ఆఫ్ వార్ ఫ్రాంచైజీలోని తాజా విడతను PCకి అందించడానికి మరికొంత సమయం పట్టవచ్చు.   గాడ్ ఆఫ్ వార్ 2018ని PCకి తీసుకురావడానికి సోనీ మూడు సంవత్సరాల సయయం తీసుకుంది.

‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్’ స్టోరీ ఏంటంటే?

క్రాటోస్ జోతున్‌హీమ్‌కు ప్రయాణం చేసి, ఫ్రెయా కొడుకు బల్దూర్‌ని చంపిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కథ జరుగుతుంది.  ట్రైలర్ లో  థోర్ క్రాటోస్ ఇంటిని సందర్శించిన అనంతరం జరిగే పరిణామాలను చూపించారు.  అట్రియస్ ఇప్పుడు  యుక్తవయస్సులో ఉన్నాడు. ఫ్రెయా,  థోర్ కాకుండా,   కొత్త, శక్తివంతమైన  ప్రత్యర్థులతో పోరాడవలసి ఉంటుంది. వారి పక్కన మిమిర్ ఉంటుంది. ట్రైలర్‌లో అంగ్ర్‌బోడా అనే కొత్త పాత్రను పరిచయం చేశారు. అతడు వీరుడిగా పరిచయం చేశారు. ట్రైలర్ చివరలో థోర్  సవతి సోదరుడు, ఓడిన్ కొడుకు – టైర్ ను కూడా గమనించవచ్చు. ఓడిన్ జైలులో కనిపిస్తాడు.  క్రాటోస్ తన బ్లేడ్ ఆఫ్ ఖోస్‌ను అలాగే ఉంచుకోగా.. ‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్’ ట్రైలర్  కొంత వైమానిక వార్ ను చూపిస్తుంది.   .

‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్’ ప్రీ ఆర్డర్ చేశారా?

‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్’ అనేక ఎడిషన్‌లు ఉన్నప్పటికీ, అత్యంత ఖరీదైన కలెక్టర్, జోత్నార్ ఎడిషన్‌లు ఇప్పటికే చాలా చోట్ల అమ్ముడయ్యాయి. అట్రియస్ రైసన్ స్నో ట్యూనిక్, క్రాటోస్ రైసన్ స్నో ట్యూనిక్ అనే గేమ్ కాస్మోటిక్స్ ముందస్తుగా అందుకోలగరు. మీరు స్టాండర్డ్ ఎడిషన్‌ను ముందస్తుగా ఆర్డర్ చేస్తే,  బేస్ గేమ్, కాస్మెటిక్ వస్తువులను పొందుతారు. అలాగే, ప్లేస్టేషన్ 4 బండిల్‌ను కొనుగోలు చేసే వారు ప్లేస్టేషన్ 5 బండిల్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.  ‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్’ డిజిటల్ డీలక్స్ ఎడిషన్‌ను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నవారు కొన్ని అదనపు బోనస్‌లను పొందే అవకాశం ఉంటుంది. ఇవి స్టోరీలోని  వివిధ పాయింట్‌లలో అన్‌లాక్ చేయబడతాయి. గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్ కలెక్టర్ ఎడిషన్ డిజిటల్ డీలక్స్ ఎడిషన్‌లోని 16-అంగుళాల Mjolnir హామర్ రెప్లికా ప్రతిరూపం, 2-అంగుళాల వానిర్ ట్విన్స్ కార్వింగ్‌లు, డ్వార్వెన్ డైస్ సెట్, స్టీల్ బుక్‌కేస్‌తో పాటు అన్ని గూడీస్‌కు  యాక్సెస్‌ను అందిస్తుంది.

Read Also: నేనింకా చావలేదు - ఆ వార్తలపై స్పందిస్తూ ఏడ్చేసిన సమంత

టాప్ హెడ్ లైన్స్

Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget