అన్వేషించండి
Advertisement
Ghost Movie Heroine: ఇలియానాకు ఛాన్స్ దక్కుతుందా..?
ఇటీవల 'వైల్డ్ డాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున.. ఇప్పుడు మరో సినిమా కోసం సిద్ధమవుతున్నారు.
ఇటీవల 'వైల్డ్ డాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున.. ఇప్పుడు మరో సినిమా కోసం సిద్ధమవుతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించడానికి అంగీకరించారు. ఈ సినిమాకి 'ఘోస్ట్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారు. సినిమాలో ఆమె 'రా' ఏజెంట్ గా కనిపించనుందని వార్తలొచ్చాయి. రొమాంటిక్ యాంగిల్ లో కాకుండా సినిమా మొత్తం ఆమె పాత్ర సీరియస్ గా సాగుతుందని అన్నారు.
అయితే ఇప్పుడు సడెన్ గా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వలన ఈ సినిమా చేయలేకపోతున్నానని నిర్మాతలకు చెప్పిందట కాజల్. ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉందని.. అందుకే సినిమా నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు 'ఘోస్ట్' దర్శకనిర్మాతలు కాజల్ స్థానంలో మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు.
త్రిష లేదా ఇలియానాలలో ఒకరిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. గతంలో త్రిష-నాగార్జున కలిసి 'కింగ్' అనే సినిమా చేశారు. ఈ సినిమా డిజాస్టర్ అయింది. అయినప్పటికీ నాగ్ సరసన ఆమెని కన్సిడర్ చేస్తున్నారు. మరోపక్క ఇలియానాను కూడా ఒక ఆప్షన్ గా పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఇలియానా.. నాగార్జునతో కలిసి నటించలేదు. ఆమెని తీసుకుంటే సినిమాకి ఫ్రెష్ నెస్ వస్తుందని భావిస్తున్నారు. వీరిద్దరితో పాటు కొందరు బాలీవుడ్ హీరోయిన్లను కూడా సంప్రదిస్తున్నారట. నాగార్జున ఎవరిని ఫైనల్ చేస్తారో వారినే హీరోయిన్ గా ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
Also Read: ఉమాదేవి ఔట్.. ఎమోషనల్ అయిన ప్రియాంక..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion