జర్మనీ అంబాసిడర్ సర్‌ప్రైజ్ - చాందినీ చౌక్‌లో ‘నాటు నాటు’ పాటకు స్పెప్పులు, వీడియో వైరల్
జర్మనీ ఎంబసీ సిబ్బంది అంతా కలసి ఢిల్లీలోని చాందిని చౌక్ వద్ద ‘నాటు నాటు’ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఎంబసీలో ఉన్న జర్మనీ, ఇండియా సిబ్బంది కలసి ఈ పాటకు డాన్స్ చేశారు.
‘ఆస్కార్’ అవార్డు గెలుపుతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడంతో యావత్ భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటికీ ‘నాటు నాటు’ ఫీవర్ తగ్గలేదు. ఎక్కడ చూసినా ‘నాటు నాటు’ ట్యూన్ వినబడుతూనే ఉంది. అంతలా ఈ పాట పబ్లిక్ లో నాటుకుపోయింది. సాధారణ పౌరులే కాదు సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది ఈ పాటకు ఫిదా అయ్యారు. విదేశీయులు కూడా ఈ పాటపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా జర్మనీ ఎంబసీ సిబ్బంది ‘నాటు నాటు’ పాట ఆస్కార్ విజయాన్ని ఓ పండుగలా సెలబ్రెేట్ చేసుకున్నారు. ఈ మేరకు ‘నాటు నాటు’ పాటకు జర్మనీ అంబాసిడర్ చీఫ్ ఫిలిప్ అకేర్మాన్ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును గెలుచుకోవడంతో తెలుగువారితో పాటు దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. మనతో పాటు విదేశీయులు కూడా ఈ పాట విజయాన్ని సంబరంలా జరుపుతున్నారు. తాజాగా జర్మనీ ఎంబసీ సిబ్బంది ‘నాటు నాటు’ పాట విజయాన్ని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. జర్మనీ ఎంబసీ సిబ్బంది అంతా కలసి ఢిల్లీలోని చాందిని చౌక్ వద్ద ‘నాటు నాటు’ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఎంబసీలో ఉన్న జర్మనీ, ఇండియా సిబ్బంది కలసి ఈ పాటకు డాన్స్ చేశారు. ఇదంతా ఓ వీడియో రికార్డు చేశారు. ఆ వీడియోను జర్మనీ అంబాసిడర్ ఫిలిప్ అకేర్మాన్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇక వీరు చేసిన వీడియోలో.. జర్మనీ ఎంబసీ సిబ్బంది ఢిల్లీ వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చనట్టు కనిపిస్తుంది. ఈలోగా అక్కడ ‘నాటు నాటు’ పాట ట్యూన్ వినగానే అందరికీ ఉత్సాహం మొదలవుతుంది. తర్వాత అంతా కలసి ‘నాటు నాటు’ అంటూ డాన్స్ చేస్తుంటే చుట్టుపక్కల వారంతా ఎగబడి చూస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.
అంతకుముందు ఈ ‘నాటు నాటు’ పాటకు సౌత్ కొరియా ఎంబసీ సిబ్బంది కూడా ఇలాగే డాన్స్ చేశారు. ఆ వీడియో ఇన్సిపిరేషన్ తో తాము కూడా ఈ వీడియో చేశామని జర్మనీ ఎంబసీ పేర్కొంది. ‘‘నాటు నాటు’ పాట ఆస్కార్ విజయాన్ని మేము కూడా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఒరిజినల్ సాంగ్ తో పోలిస్తే మా డాన్స్ అంతగా బాలేదు. కానీ మేము చాలా ఎంజాయ్ చేశాం. నాటు నాటు పాటపై ఛాలెంజ్ ఓపెన్.. నెక్ట్స్ ఎవరు?’ అంటూ జర్మనీ ఎంబసీ చీఫ్ ఫిలిప్ అకెేర్మాన్ ట్వట్ చేశారు. ఇప్పుడీ డాన్స్ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ ‘‘ఆర్ఆర్ఆర్’ నా మజాకా నా’ అంటూ మురిసిపోతూ కామెంట్స్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డుల వేడుక తర్వాత మూవీ టీమ్ హైదరాబాద్ తిరిగి వచ్చేసినా.. అంతర్జాతీయంగా ‘నాటు నాటు’ క్రేజ్ మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదనడంలో అతిశయోక్తి లేదు.
Read Also: ఆస్కార్‌తో హైదరాబాద్ చేరుకున్న ‘RRR’ టీమ్, ఘన స్వాగతం పలికిన అభిమానులు
Nimm das, Stelzie! https://t.co/5kE7gdyH5E pic.twitter.com/yYL8a8X74g
— Dr Philipp Ackermann (@AmbAckermann) March 18, 2023