Geethanjali Malli Vachindi Movie: దక్షిణాది భాషల్లో 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' - అంజలి 50వ సినిమా విడుదల ఎప్పుడంటే?
Anjali's Geethanjali Malli Vachindi movie release date: అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'. షూటింగ్ అప్డేట్, రిలీజ్ డేట్ గురించి చెప్పారు.
Geethanjali Malli Vachindi release date: తెలుగు చిత్రసీమలో వచ్చిన సూపర్ హిట్ హారర్ కామెడీ సినిమాల్లో 'గీతాంజలి' కూడా ఉంటుంది. అందులో తెలుగు అమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో నటించారు. హారర్ కామెడీల్లో ఆ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' చేస్తున్నారు. ఆ విషయం ప్రేక్షకులకూ తెలుసు.
తెలుగమ్మాయి అంజలి 50వ సినిమా!
ప్రతీకార జ్వాలతో గీతాంజలి మళ్లీ వచ్చేస్తోంది. ఈ సినిమాను ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ (Kona Venkat) సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ (KFC) సంస్థలపై విశాఖ ఎంపీ, రాజకీయ నేత ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అచ్చ తెలుగు అమ్మాయి అంజలి నటిస్తోన్న 50వ చిత్రమిది.
ఎర్లీ 2024లో దక్షిణాది భాషల్లో విడుదల!
ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన హారర్ కామెడీ సినిమాలతో కంపేర్ చేస్తే... ఈ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' భారీ బడ్జెట్ సినిమా అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్... తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎర్లీ 2024లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కోన వెంకట్ తెలిపారు.
దర్శకుడిగా 'నిన్ను కోరి', 'నిశ్శబ్దం' కొరియోగ్రాఫర్!
కోన ఫిల్మ్ కార్పొరేషన్ ఎప్పుడూ కొత్త టాలెంట్ ఇంట్రడ్యూస్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ముందు ఉంటుంది. 'నిన్ను కోరి'తో శివ నిర్వాణను పరిచయం చేశారు. ఇలా చెబుతూ వెళితే ఎంతో మంది టెక్నీషియన్లను పరిచయం చేశారు. ఇప్పుడీ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమాతో 'నిన్ను కోరి', 'నిశ్శబ్దం' చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేసిన అట్లాంటా (యు.ఎస్)కు చెందిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.
Also Read: ది విలేజ్ వెబ్ సిరీస్ రివ్యూ: ఆర్య & మిళింద్ రావు థ్రిల్ ఇచ్చారా? భయపెట్టారా?
Fear is on the fast track as #GeethanjaliMalliVachindhi is zooming through production 💥 promising a sequel that's set to leave you breathless 🔥🔥
— Vamsi Kaka (@vamsikaka) November 26, 2023
Coming soon to thrill you in Telugu, Tamil, Kannada, and Malayalam in early 2024 ⏳#Anjali50 @yoursanjali @MP_MvvOfficial… pic.twitter.com/YfSIGI4ZUE
'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమా గురించి కోన వెంకట్ మాట్లాడుతూ ''ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణ పూర్తి చేశాం. ఊటీలో ఓ షెడ్యూల్ చేయాలి. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. సినిమాను వచ్చే 2024 ప్రారంభంలో దక్షిణాది భాషల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. 'గీతాంజలి' ఎక్కడ ముగిసిందో... అక్కడి నుంచే సీక్వెల్ స్టార్ట్ అవుతుంది. మొదటి పార్టులో నటించిన అంజలి, శ్రీనివాస రెడ్డి, 'సత్యం' రాజేష్, 'షకలక' శంకర్ ఇందులోనూ ఉన్నారు. ఇంకా సత్య, సునీల్, రవిశంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు రాహుల్ మాధవ్ (Rahul Madhav)ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచేయం చేస్తున్నాం. ఇప్పటి వరకు వచ్చిన హారర్ కామెడీలు ఒక ఎత్తు అయితే... 'గీతాంజలి మళ్లీ వచ్చింది' వాటన్నింటినీ మించేలా ఉంటుంది'' అని అన్నారు.
Also Read: 'యానిమల్' కోసం మూడు భాషల్లో రష్మిక
అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ, సునీల్, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, రవిశంకర్, ప్రియ, ముక్కు అవినాష్, విరుపాక్ష రవి, రాహుల్ మాధవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, స్క్రీన్ ప్లే: కోన వెంకట్ & భాను కిరణ్, మాటలు: భాను కిరణ్ & నందు, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఛాయాగ్రహణం: సుజాత సిద్ధార్థ్, కూర్పు: చోటా కె. ప్రసాద్, కళ: నార్ని శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగు వై, నిర్మాణ సంస్థలు: ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్, నిర్మాతలు: ఎంవీవీ సత్యనారాయణ, జీవీ, దర్శకత్వం: శివ తుర్లపాటి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply