News
News
X

Mahesh Babu: ఫిట్నెస్ మాంత్రికుడి దగ్గరికి ప్రిన్స్ - అభిమానులకు త్వరలో మహేష్ బాబు సర్‌ప్రైజ్

మహేష్ బాబు తన అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నారు. త్వరలో సిక్స్ ప్యాక్ బాడీతో సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారు.

FOLLOW US: 

కాలానికి అనుగుణంగా మార్పు చెందాలి. పోటీ ప్రపంచంలో క్షణక్షణం అప్ డేట్ కావాలి. కాలాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలి. అప్పుడే నెంబర్ వన్ గా నిలబడగలుగుతాం. అలా తనకు తాను మారుతూ.. చాలా మందిని మార్చిన వాడే లాయిడ్ స్టీవెన్స్. సినీ తారలకు ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉంటూ వారిని స్ట్రాంగ్‌గా మార్చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం లాయిడ్‌ను ఆశ్రయించారు. ఆయన దగ్గర ఫిట్నెస్ పాఠాలు నేర్చుకోబోతున్నారు. తన బాడీని పూర్తిగా మరింత దృఢంగా మార్చుకోబోతున్నారు. 

మహేష్ తో కలిసి ఉన్న ఫోటోను లాయిడ్ తన ట్విట్టర్ పోస్ట్ చేయడం ఈ విషయం బయటపడింది. “లెట్స్ డూ దిస్ మహేష్’’ అంటూ లాయిడ్ చేసిన పోస్ట్ చూసి మహేష్ అభిమానుల్లో ఆనందం నెలకొంది. మహేష్ బాబు ఒక్కరే కాదు.. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఈ జింబాంబ్వే ట్రైనర్ దగ్గర శిక్షణ తీసుకున్నారు. బాలీవుడ్ టాప్ హీరో రణ్ వీర్ సింగ్ ను ఈయనే ఫిట్ గా మార్చారు. మామూలుగా ఉన్న ఆయన బాడీని కండలు తిరిగేలా చేసి అదుర్స్ అనిపించారు. రణ్ వీర్ సింగ్ బాడీ షేప్ చూసిన తర్వాత చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఆయన దగ్గర ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకున్నారు. 

ఆ తర్వాత టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం లాయిడ్ దగ్గరే ఫిట్ గా తయారయ్యారు. ‘అరవింద సమేత’ సినిమా కోసం ఆయనను ఇండియాకు ప్రత్యేకంగా పిలిపించుకున్నారు ఎన్టీఆర్. కొంత కాలం పాటు లాయిడ్ ఎన్టీఆర్ తోనే ఉంటూ ఫిట్‌నెస్ పాఠాలు చెప్పారు. ఎన్టీఆర్ బాడీని మరింత ఫిట్ గా మార్చేందుకు విదేశాల నుంచి ఎక్సర్ సైజ్ ఎక్యుప్ మెంట్స్ తెప్పించారు. అనంతరం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ఎన్టీఆర్ బాడీ షేపింగ్ కోసం మళ్లీ లాయిడ్ ఆశ్రయించారు. జూనియర్ ఎన్టీఆర్‌ను ఆ పాత్రకు తగినట్టుగా లాయిడ్ తీర్చిదిద్దారు. 

సినిమాకు తగినట్లుగా కొత్త లుక్ లో కనిపించేందుకు ఎన్టీఆర్ చాలా కష్టపడతారని లాయిడ్ అంటుంటారు. ట్రైనర్ గా తాను జస్ట్ శిక్షణ మాత్రమే ఇస్తానని చెప్పారు. తారక్ తన బాడీ షేప్ ను మార్చుకునేందుకు కఠిన సాధన చేస్తారని.. డైట్ విషయంలోనూ ఎన్టీఆర్ కచ్చితత్వాన్ని పాటిస్తారని చెప్పారు. అనుకున్నది సాధించేందుకు ఏమాత్రం వెనుకాడరని వెల్లడించారు. తమ మధ్య మంచి స్నేహం ఏర్పడ్డానికి కారణం కూడా అదే అన్నారు. 

జింబాంబ్వేకు చెందిన లాయిడ్ .. పదేళ్లు  లండన్ లో ఉన్నారు. ఓ కార్పొరేట్ కంపెనీలో టెక్నీషియన్ గా పని చేశారు. అప్పట్లో తనకు చిరుతిండి మీద ఎంతో ఆసక్తి ఉండేదని, విపరీతంగా ఫాస్ట్ ఫుడ్ తీసుకునేవాడనని తెలిపారు. డబ్బులు బాగా రావడం వల్ల ఏది పడితే అది తినేస్తూ.. చెత్తా చెదారం అంతా లోపల వేసేవాడనని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఆ తిండి వల్ల తన బాడీ భారీగా పెరిగిందని, తన శరీరం జబ్బులకు అడ్డాగా మారిందని పేర్కొన్నాడు. అతను చూసేందుకు భారీగా కనిపించేవాడట. ఊహించనంత బరువు పెరిగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదట. అప్పుడే తాను ఓ నిర్ణయానికి వచ్చానని,  ఎలాగైనా తన బాడీని ఫిట్ గా మార్చుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇందుకు కొన్ని నెలల పాటు శ్రమించానని పేర్కన్నారు. ఎట్టకేలకు తాను  అనుకున్నది సాధించానన్నారు. ఆ తర్వాత తన ఉద్యోగానికి రిజైన్ చేసి.. ఫిట్నెస్ ట్రైనర్ గా మారిపోయానని, ఎంతోమంది సెలబ్రిటీలకు అద్భుతమైన ఫిట్ బాడీని అందించానని లాయిడ్ వెల్లడించారు. 

Also Read: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Also Read: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?

Published at : 16 Aug 2022 12:30 PM (IST) Tags: Mahesh Babu Mahesh Babu Six Pack Lloyd Stevens

సంబంధిత కథనాలు

Ponniyin Selvan: ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు అరుదైన గౌరవం, ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఊహించని ఘటన

Ponniyin Selvan: ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు అరుదైన గౌరవం, ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఊహించని ఘటన

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Dhanush New Song : ఒకే ఒక ఊరిలోనా, ధనుష్ ఎక్కడా 'తగ్గేదే లే'

Dhanush New Song : ఒకే ఒక ఊరిలోనా, ధనుష్ ఎక్కడా 'తగ్గేదే లే'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

టాప్ స్టోరీస్

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?