News
News
వీడియోలు ఆటలు
X

లండన్‌ థియేటర్‌లో తారక్ ఫ్యాన్స్ హంగామా - మూవీ నిలిపివేత

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సింహాద్రి రీరిలీజ్ స్ర్ర్కీనింగ్ సమయంలో అభిమానులు థియేటర్లో పటాకులు కాల్చారు. వెస్ట్ లండన్‌లో జరిగిన ఈ ఘటనతో నిర్వాహకులు సినిమాను నిలిపివేశారు.

FOLLOW US: 
Share:

Simhadri Re-release : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆల్ టైమ్ హిట్ 'సింహాద్రి' సినిమా స్క్రీనింగ్ సమయంలో థియేటర్లో అభిమానులు పటాసులు పేల్చడంతో సినిమాను నిలిపివేశారు. వెస్ట్ లండన్‌లో జరిగిన ఈ సంఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో సినిమా వీక్షించడానికి వచ్చిన కొందరు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో నిర్వాహకులు వెంటనే సినిమాను నిలిపివేసి, థియేటర్ ను ఖాళీ చేయించారు. 

ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ వారాంతంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా రీరిలీజ్ అయిన 'సింహాద్రి'.. ఇప్పటికే హంగామా క్రియేట్ చేసింది. UKలోని వెస్ట్ లండన్‌లో, అభిమానులు తమ మితిమీరిన ఉత్సాహంతో థియేటర్లలో కూడా పటాసులు పేల్చారు. దీంతో థియేటర్‌లో పొగలు కమ్ముకోవడంతో భయంతో ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వెంటనే రంగంలోకి దిగింది. పొగలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగలేదని నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులు నిజమైన అభిమానులు కాదని పలువురు వెల్లడించారు.

ఈ ఘటన జరిగిన కాసేపటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వెలుగులోకి వచ్చింది. దీంతో చాలా మంది నెటిజన్లు, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేయడం మొదలుపెట్టారు. భారతీయులకు చెడ్డ పేరు తీసుకురావద్దని అభిమానులకు సలహా ఇవ్వాలని ఎన్టీఆర్ ను అభ్యర్థిస్తూ పోస్టులు పెట్టారు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ఏర్పాటు చేసిన స్మోక్ అలారం మోగడంతో అందరూ అలర్ట్ అయ్యారని లండన్ ఫైర్ బ్రిగేడ్ తెలిపింది. అంతే కాకుండా ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ధృవీకరించింది. రాత్రి 10:13 గంటల నుంచి 10:39 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం, ఈ దురదృష్టకరమైన సంఘటన కారణంగా సినీవరల్డ్ హౌన్స్లో మూసివేశారు.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఆయన నటించిన 'సింహాద్రి' సినిమాను రీరిలీజ్ చేశారు. దీంతో ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలోని పాటలు, డైలాగులు మరోసారి ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ సుమారు 150కి పైగా థియేటర్లలో ప్రదర్శించారు. మొత్తం 1210 షోలు ప్రదర్శించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతే కాకుండా 'సింహాద్రి' మూవీని ప్రపంచంలోనే అతి పెద్ద స్ర్కీన్ మెల్ బోర్న్ ఐమాక్స్ థియేటర్లోనూ రీరిలీజ్ చేయడం చెప్పుకోదగిన విషయం.

ఇక ఎన్టీఆర్ సినిమా విషయాలకొస్తే కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మూవీ 'దేవర' టైటిల్, ఫస్ట్ లుక్ ను ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత ఎన్టీఆర్ మ‌ళ్లీ షూటింగ్ చేస్తోన్న సినిమా ఫస్ట్ లుక్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది.

Read Also : Adipurush Song Record: యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న 'జై శ్రీ రామ్' సాంగ్, 24 గంటల్లో రికార్డు వ్యూస్!

Published at : 21 May 2023 01:37 PM (IST) Tags: London Young Tiger NTR NTR fans Firecrackers Junior NTR Simhadri Re-release Theater

సంబంధిత కథనాలు

Bhola Shankar: చిరు లీక్స్ - ‘భోళా శంకర్’ సాంగ్ షూట్‌లో మెగాస్టార్ నవ్వుల సందడి, ఫ్యాన్స్ ఫిదా!

Bhola Shankar: చిరు లీక్స్ - ‘భోళా శంకర్’ సాంగ్ షూట్‌లో మెగాస్టార్ నవ్వుల సందడి, ఫ్యాన్స్ ఫిదా!

Navya Swamy: అందుకే సీరియల్స్ మానేశా, రవి నా కంటే ముందే ప్రయత్నించాడు: నటి నవ్య స్వామి

Navya Swamy: అందుకే సీరియల్స్ మానేశా, రవి నా కంటే ముందే ప్రయత్నించాడు: నటి నవ్య స్వామి

Rangabali Teaser: ‘మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది’ - నాగశౌర్య ‘రంగబలి’ టీజర్ అదిరిపోయిందిగా

Rangabali Teaser: ‘మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది’ - నాగశౌర్య ‘రంగబలి’ టీజర్ అదిరిపోయిందిగా

మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

Dhoomam Telugu Trailer : ధూమం - నా పేరు ముఖేష్ యాడ్ అందరూ చూసేలా చేస్తే?

Dhoomam Telugu Trailer : ధూమం - నా పేరు ముఖేష్ యాడ్ అందరూ చూసేలా చేస్తే?

టాప్ స్టోరీస్

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !

YS Viveka  Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ -  అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్  !

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్