News
News
వీడియోలు ఆటలు
X

Adipurush Song Record: యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న 'జై శ్రీ రామ్' సాంగ్, 24 గంటల్లో రికార్డు వ్యూస్!

‘ఆది పురుష్’ నుంచి విడుదలైన 'జై శ్రీ రామ్' సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ పాట, 24 గంటల్లో అత్యధిక వ్యూస్ అందుకున్న వీడియోగా రికార్డు సృష్టించింది.

FOLLOW US: 
Share:

 టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ సినిమా'ఆదిపురుష్​'. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్​, ట్రైలర్ అభిమానులను ఓ రేంజిలో అలరించాయి. సినిమా​తో భారీగా అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ‘జై శ్రీ రామ్​’ ఫుల్ సాంగ్ విడుదలైంది.  మహిమాన్విత మంత్రం నీ నామం అంటూ సాగే ఈ పాట యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది.

యూట్యూబ్ లో 'జై శ్రీ రామ్' సాంగ్ సరికొత్త రికార్డు

సినిమాలో ఈ పాట హైలెట్ గా ఉండబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాదు, తాజాగా విడుదలైన ఈ పాట అద్భుతంగా ఉందంటున్నారు సినీ అభిమానులు. లిరిక్స్​, మ్యూజిక్​, విజువల్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయి.  ఇక ఈ పాట యూట్యూబ్‌లో గత 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన వీడియోగా రికార్డు సాధించింది. తాజా వివరాల ప్రకారం  ‘ఆది పురుష్‌’ సాంగ్ 31,607,790కి పైగా వ్యూస్ అందుకుంది. 5 లక్షల 67 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.  ప్రముఖ సంగీత దర్శకులు  అజయ్, అతుల్​ ఈ పాటకు స్వరాలు అందించారు. ఈ పాటకు హిందీలో మనోజ్ ముంతాషీర్‌, తెలుగులో  రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. “ఎవరు ఎదురు రాగలరు మీ దారికి? ఎవరికుందీ ఆ అధికారం? పర్వత పాదాలు వణికి కదులుతాయి మీ హూంకారానికి” అంటూ ప్రభాస్ వాయిస్ తో మొదలయ్యే ఈ పాట ప్రేక్షకులకు గూస్ బంమ్స్ తెప్పిస్తున్నాయి.    

సంతోషం వ్యక్తం చేసిన సంగీత దర్శకుడు  

అటు ఈ పాటకు వస్తున్న ఆదరణ పట్ల సంగీత దర్శకుడు అజయ్  సంతోషం వ్యక్తం చేశారు. “ఇది మేము ఈ సినిమాకు  కంపోజ్ చేసిన తొలి పాట. శ్రీరాముడి పేరు వినగానే ఆ శక్తి, భక్తి ఆటోమేటిక్‌గా ఈ పాటలోకి వచ్చేశాయి. పాట కంపోజ్ చేస్తున్నప్పుడు అద్భుత శక్తి తమను వెనుకుండి నడిపిస్తున్నట్లుగా అనిపించింది. పాటకు లభిస్తున్న ఆదరణ, ప్రేమ పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం రావడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం.  గీత రచయిత మనోజ్ ముంతాషీర్‌  పాటను చాలా బాగా రాశారు. ఈ పాటను 30 టీమ్ కలిసి పాడారు” అని చెప్పుకొచ్చారు.   

రామాయణం ఆధారంగా రూపొందుతున్న ‘ఆదిపురుష్’

ఇక ఈ సినిమా రామాయణం ఆధారంగా చేసుకుని రూపొందుతోంది. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు. ఆయన సతీమణి సీతాదేవిగా బాలీవుడ్ నటి కృతి సనన్ నటిస్తోంది. లక్ష్మణుడిగా ​ సన్నీ సింగ్​, హనుమంతుడిగా దేవదత్త్​ నాగే, రావణాసురుడిగా సైఫ్​ అలీ ఖాన్​ నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ సినిమాను రెట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 16న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్​ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్రబృందం పోస్టర్లు, పాటలు విడుదల చేస్తున్నారు.    

Read Also: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వకపోవడం కుట్ర - మహానాయకుడు గురించి టాలీవుడ్ సెలబ్రిటీస్ ఏమన్నారంటే?

Published at : 21 May 2023 12:29 PM (IST) Tags: Kriti Sanon Adipurush Movie Prabhas Om Raut Jai Shri Ram Song Ajay-Atul most viewed video

సంబంధిత కథనాలు

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?

Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?

Lavanya Tripathi Relationship : ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ లావణ్య పెట్టిన క్యాప్షన్ వెనుక ఇంత కథ ఉందా?

Lavanya Tripathi Relationship : ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ లావణ్య పెట్టిన క్యాప్షన్ వెనుక ఇంత కథ ఉందా?

Lavanya Tripathi: అల్లు అరవింద్ మాటలను నిజం చేసిన లావణ్య, వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో!

Lavanya Tripathi: అల్లు అరవింద్ మాటలను నిజం చేసిన లావణ్య, వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో!

NBK 109 Launch : బాలకృష్ణతో త్రివిక్రమ్ సందడి - ఎన్‌బికె 109 ఓపెనింగ్‌లో బర్త్‌డే సెలబ్రేషన్

NBK 109 Launch : బాలకృష్ణతో త్రివిక్రమ్ సందడి - ఎన్‌బికె 109 ఓపెనింగ్‌లో బర్త్‌డే సెలబ్రేషన్

టాప్ స్టోరీస్

Telangana Poltics : తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతుంది ?

Telangana Poltics :  తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా  చక్కదిద్దుతుంది ?

Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం - దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !

Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం -  దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !

Saroor Nagar Murder Case: పోలీసులనే భయపెట్టిన అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ- పరువు కోసం చంపేసినట్టు స్టేట్‌మెంట్

Saroor Nagar Murder Case: పోలీసులనే భయపెట్టిన అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ- పరువు కోసం చంపేసినట్టు స్టేట్‌మెంట్

కాంగ్రెస్ సంచలన నిర్ణయం! స్కూల్ సిలబస్ నుంచి RSS వ్యవస్థాపకుడి పాఠం తొలగింపు?

కాంగ్రెస్ సంచలన నిర్ణయం! స్కూల్ సిలబస్ నుంచి RSS వ్యవస్థాపకుడి పాఠం తొలగింపు?