అన్వేషించండి

Entertainment Top Stories Today: ‘రాజాసాబ్’ నుంచి ప్రభాస్ బర్త్‌డే పోస్టర్, హైకోర్టును ఆశ్రయించిన బన్నీ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘రాజాసాబ్’ నుంచి ప్రభాస్ బర్త్‌డే పోస్టర్, హైకోర్టును ఆశ్రయించిన బన్నీ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘రాజాసాబ్’ నుంచి ప్రభాస్ బర్త్‌డే పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నంద్యాల కేసును క్వాష్ చేయాలని బన్నీ హైకోర్టును ఆశ్రయించారు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి. ‘గేమ్ ఛేంజర్’లోని రా మచ్చా మచ్చా సాంగ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. టోక్యోలో ప్రభాస్ ఫ్యాన్స్ తన బర్త్‌డే సెలబ్రేషన్స్ ప్రారంభించారు.

'ది రాజా సాబ్' నుంచి ప్రభాస్ బర్త్ డే స్పెషల్ వచ్చేసిందోచ్...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి. తాజాగా "ది రాజా సాబ్" మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసి మేకర్స్ ఈ సంబరాలను షురూ చేశారు. మరో మూడు రోజుల్లో ప్రభాస్ పుట్టినరోజు ఉండగా, ముందుగానే 'ది రాజాసాబ్' పోస్టర్ తో వేడుకలు మొదలు పెట్టారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నాగచైతన్య, శోభిత పెళ్లి పనులు షురూ...
అక్కినేని వారసుడు నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగగా, తాజాగా పెళ్లి పనులు షురూ అయ్యాయి. శోభితా ఈ విషయాన్ని తెలియజేస్తూ తను పసుపు దంచుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నంద్యాల కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
ఎన్నికల సమయంలో నంద్యాలలో పర్యటించిన అల్లు అర్జున్ పై ఈసీ ఆదేశాల మేరకు కేసు నమోదు అయింది. ఆ కేసును కొట్టి వేయాలంటూ అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎన్నికల ప్రచారం కోసం వెళ్లలేదని తన స్నేహితుడ్ని కలవడానికి మాత్రమే వెళ్లానని ఆయన అంటున్నారు.  అల్లు అర్జున్‌ దాఖలు చేసిన  పిటీషన్‌ను కోర్టు స్వీకరించింది.  అక్టోబర్‌ 22న విచారణ జరిగే అవకాశం ఉంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతున్న ‘రా మచ్చా‘ సాంగ్
గ్లోబ‌ల్ స్టార్‌ రామ్‌ చ‌ర‌ణ్‌,  ప్రముఖ తమిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబోలో వ‌స్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నఈ భారీ బ‌డ్జెట్ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసింది. అందులో ఒకటి  ‘జరగండి.. ’ పాట కాగా, మరొకటి ‘రా మచ్చా మచ్చా..’. ఈ రెండు పాటలు ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా 'రా మచ్చా మచ్చా..' పాటలో చెర్రీ డ్యాన్స్ సింపుల్ గా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. తమన్ మ్యూజిక్, గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ ఆహా అనిపించాయి. దర్శకుడు శంకర్ ఈ పాటను 1000 మంది ఫోక్ డ్యాన్సర్లతో ప్రత్యేకంగా తెరకెక్కించి విధానం తెరమీద మెస్మరైజ్ చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

టోక్యోలో ప్రభాస్ లేడీ ఫ్యాన్స్ జోష్
రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యుకే, చైనా, జపాన్, మలేషియా, సింగపూర్ సహా పలు దేశాల్లో తనకంటూ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. ఇతర దేశాలతో పోల్చితే జపాన్ లో ఆయనకు మరింత క్రేజ్ ఉంది. తన సినిమా విడుదల అవుతుందంటే వేలాది మంది అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. డార్లింగ్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ వచ్చినా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఆయన నటించిన పలు సినిమాలకు జపాన్ లో మంచి వసూళ్లు దక్కాయి. త్వరలో ప్రభాస్ బర్త్ డే వస్తున్న నేపథ్యంలో టోక్యోలో అభిమానులు ముందుగానే సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు
పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు
Tirumala Controversy: తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపు, ప్రోటోకాల్ పాటించడం లేదు- నేతల ఆవేదన
తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపు, ప్రోటోకాల్ పాటించడం లేదు- నేతల ఆవేదన
Teenmar Mallanna : జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
ABP Southern Rising Summit 2024: దేశ పురోగతికి దక్షిణాది దిక్సూచీ  - అక్టోబర్ 25న హైదరాబాద్‌లో ఏబీపీ నెట్‌వర్క్ సదరన్‌ రైజింగ్ సమ్మిట్
దేశ పురోగతికి దక్షిణాది దిక్సూచీ - అక్టోబర్ 25న హైదరాబాద్‌లో ఏబీపీ నెట్‌వర్క్ సదరన్‌ రైజింగ్ సమ్మిట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: ఒక్క క్షణంలో ఫోన్ మాయం! షాకింగ్ సీసీటీవీ వీడియోDonald Trump works at McDonald's | స్వయంగా ఫ్రైంచ్ ఫ్రైస్ వేయించి అమ్మిన ట్రంప్ | ABP DesamOwaisi on Palestine: హమాస్ చీఫ్ మృతిపై ఒవైసీ ఆవేదనవయనాడ్‌లో ప్రియాంక గాంధీకి పోటీగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు
పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు
Tirumala Controversy: తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపు, ప్రోటోకాల్ పాటించడం లేదు- నేతల ఆవేదన
తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపు, ప్రోటోకాల్ పాటించడం లేదు- నేతల ఆవేదన
Teenmar Mallanna : జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
ABP Southern Rising Summit 2024: దేశ పురోగతికి దక్షిణాది దిక్సూచీ  - అక్టోబర్ 25న హైదరాబాద్‌లో ఏబీపీ నెట్‌వర్క్ సదరన్‌ రైజింగ్ సమ్మిట్
దేశ పురోగతికి దక్షిణాది దిక్సూచీ - అక్టోబర్ 25న హైదరాబాద్‌లో ఏబీపీ నెట్‌వర్క్ సదరన్‌ రైజింగ్ సమ్మిట్
The Raja Saab : 'ది రాజా సాబ్' నుంచి ప్రభాస్ బర్త్ డే స్పెషల్ వచ్చేసిందోచ్... కింగ్ ఆఫ్ స్వాగ్‌ - మరో కిక్ ఇచ్చే అప్డేట్ కూడా ఆన్ ది వే 
'ది రాజా సాబ్' నుంచి ప్రభాస్ బర్త్ డే స్పెషల్ వచ్చేసిందోచ్... కింగ్ ఆఫ్ స్వాగ్‌ - మరో కిక్ ఇచ్చే అప్డేట్ కూడా ఆన్ ది వే 
Dana Cyclone: ఏపీకి తుపాను 'దానా' ముప్పు - మత్స్యకారులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
ఏపీకి తుపాను 'దానా' ముప్పు - మత్స్యకారులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
Allu Arjun : నంద్యాల కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
నంద్యాల కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
OTT Movies : 'అన్ స్టాపబుల్' నుంచి 'సత్యం సుందరం' వరకు.. ఈ వారం ఓటీటీలోకి 20కి పైగా సినిమాలు.. ఆ 5 మాత్రమే స్పెషల్ 
'అన్ స్టాపబుల్' నుంచి 'సత్యం సుందరం' వరకు.. ఈ వారం ఓటీటీలోకి 20కి పైగా సినిమాలు.. ఆ 5 మాత్రమే స్పెషల్ 
Embed widget