Prabhas Birthday: టోక్యోలో ప్రభాస్ లేడీ ఫ్యాన్స్ జోష్, 3 రోజుల ముందే రెబల్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ షురూ
Tokyo Fans : ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మూడు రోజుల ముందే టోక్యో అభిమానులు ఆయన బర్త్ డే నిర్వహించారు. పాన్ ఇండియన్ స్టార్ కు అడ్వాన్స్ విషెష్ తెలిపారు.
Prabhas Birthday Celebrations : రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యుకే, చైనా, జపాన్, మలేషియా, సింగపూర్ సహా పలు దేశాల్లో తనకంటూ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. ఇతర దేశాలతో పోల్చితే జపాన్ లో ఆయనకు మరింత క్రేజ్ ఉంది. తన సినిమా విడుదల అవుతుందంటే వేలాది మంది అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. డార్లింగ్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ వచ్చినా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఆయన నటించిన పలు సినిమాలకు జపాన్ లో మంచి వసూళ్లు దక్కాయి. త్వరలో ప్రభాస్ బర్త్ డే వస్తున్న నేపథ్యంలో టోక్యోలో అభిమానులు ముందుగానే సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు.
‘రాధేశ్యామ్’ రీ రిలీజ్, లేడీ ఫ్యాన్స్ కోలాహలం
ఈ నెల 23న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ బర్త్ డే. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించేందు రెడీ అవుతున్నారు. పలువురు అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఆయన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ విషెస్ చెప్తున్నారు. జపాన్ అభిమానులు మాత్రం మూడు రోజుల ముందుగానే బర్త్ డే వేడుకలు మొదలు పెట్టారు. ఆయన బర్త్ డే సందర్భంగా ‘రాధేశ్యామ్’ సినిమాను జపాన్ థియేటర్లలో రీరిలీజ్ చేశారు. ఈ సందర్భంగా థియేటర్లలో బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఓ థియేటర్ లో లేడీ ఫ్యాన్స్ ప్రభాస్ బర్త్ డేను జోష్ ఫుల్ గా నిర్వహించారు. హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అంటూ బ్యానర్ పట్టుకుని తమ అభిమాన నటుడికి శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Rebel star #Prabhas fans in Tokyo watched #RadheShyam and celebrated his birthday in advance. ❤️🔥❤️#HappyBirthdayPrabhas pic.twitter.com/Dt9ITWQFD8
— Cine Bullet (@Cine_Bullet) October 19, 2024
తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సినిమాలు రీ రిలీజ్
దేశ వ్యాప్తంగానూ ప్రభాస్ అభిమానులు బర్త్ డే వేడులకు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. అటు ఆయన బర్త్ డే సందర్భంగా పలు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. కొత్త సినిమాలకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘సలార్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘ఈశ్వర్’ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ బ్యానర్లు, కటౌట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభాస్ మీద తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.
వరుస సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీ
అటు ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగాతో కలిసి ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి.
Read Also: హీరోయిజం, ఫైట్లు, డ్యాన్స్ లు చాలు - కథ, స్క్రీన్ ప్లే, తొక్కా తోలు ఎవడికి కావాలి?: నాగవంశీ