The Raja Saab : 'ది రాజా సాబ్' నుంచి ప్రభాస్ బర్త్ డే స్పెషల్ వచ్చేసిందోచ్... కింగ్ ఆఫ్ స్వాగ్ - మరో కిక్ ఇచ్చే అప్డేట్ కూడా ఆన్ ది వే
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రెండ్రోజుల ముందే 'ది రాజా సాబ్; నుంచి స్పెషల్ అప్డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఆ అప్డేట్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి. తాజాగా "ది రాజా సాబ్" మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసి మేకర్స్ ఈ సంబరాలను షురూ చేశారు. మరో మూడు రోజుల్లో ప్రభాస్ పుట్టినరోజు ఉండగా, ముందుగానే 'ది రాజాసాబ్' పోస్టర్ తో వేడుకలు మొదలు పెట్టారు.
అక్టోబర్ 23న డార్లింగ్ 45వ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ప్రభాస్ సినిమాల నుంచి పలు స్పెషల్ అప్డేట్స్ రాబోతున్నాయి. అందులో భాగంగానే ప్రభాస్ బర్త్ డే హంగామాను డైరెక్టర్ మారుత ముందుగానే మొదలు పెట్టారు. ప్రభాస్ ప్రస్తుతం డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో 'ది రాజా సాబ్' అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే అప్డేట్ గురించి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే చెప్పినట్టుగానే ఆయన బర్త్ డేకి రెండు రోజులు ముందే ఈ మూవీ నుంచి స్పెషల్ స్టిల్ లో రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ మూవీలో ప్రభాస్ కు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేయగా, వింటేజ్ లుక్ లో అమ్మాయిల మనసును కొల్లగొట్టారు ప్రభాస్. అలాగే సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ సోషల్ మీడియాను ఊపేసింది. ఇక ఇప్పుడు కింగ్ ఆఫ్ స్వాగ్ అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ నయా పోస్టర్ ను చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు ఈ పోస్టర్ ద్వారా 'హి ఈజ్ కమింగ్' అంటూ అక్టోబర్ 23 న మరో అప్డేట్ ఉండబోతోందని పక్కా కిక్ ఇచ్చే అప్డేట్ ను ఇచ్చారు.
Cool composure with a presence that dominates 😎🔥
— People Media Factory (@peoplemediafcy) October 21, 2024
The King of Swag is here to bring you an MASSIVE treat with his UNMATCHED AURA 💥💥
Stay tuned to welcome him in a KING SIZED way on 23rd Oct ❤️🔥❤️🔥#TheRajaSaabOnApril10th #TheRajaSaab #Prabhas @DirectorMaruthi @MalavikaM_… pic.twitter.com/1jU2ZW5xiC
ఈ సినిమాలో ప్రభాస్ 'మిర్చి' తరువాత మరోసారి మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా కనిపించబోతున్నాడని సంబరపడుతున్నారు. కాగా 'ది రాజా సాబ్' సినిమా హారర్ రొమాంటిక్ కామెడీ మూవీ. ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న మారుతి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా, అందులో కూడా ప్రభాస్ లుక్ అందరిని అట్రాక్ట్ చేసింది. 'ది రాజా సాబ్' సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. తమన్ సంగీతం అందిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా 'ది రాజా సాబ్' సినిమా నుంచి స్టిల్ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాత ఎస్కేఎన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. డైరెక్టర్ మారుతి కూడా 'డార్లింగ్ ఫ్యాన్స్ అందరి కోసం అక్టోబర్ 21న కొత్త స్టిల్ ఇచ్చేద్దాం' అంటూ ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపారు. ఇక ప్రభాస్ పుట్టిన రోజు అంటే ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్ లు... ఆ హంగామా అంతా వేరే లెవెల్ లో ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీటితోపాటు ఈసారి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మరింత హడావిడి ఉండబోతోంది. ఈశ్వర్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాల రీ రిలీజ్ తో పాటు 'సలార్' మూవీ స్పెషల్ షోలతో థియేటర్లు దద్దరిల్లబోతున్నాయి. ఇక ప్రభాస్ బర్త్ డే కానుకగా ఆయన లైన్ లో పెట్టిన ఇతర సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయో చూడాలి. ఇప్పుడు ప్రభాస్ చేతిలో సలార్ 2, కల్కి 2, సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్', హను రాఘవపూడితో ఓ సినిమా, 'ది రాజా సాబ్' వంటి సినిమాలు ఉన్నాయి.