Raa Macha Song : నిన్న జపాన్, నేడు కొరియా, ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతున్న ‘రా మచ్చా‘ సాంగ్
Park Min-jun : రామ్ చరణ్ ‘రా మచ్చా..‘ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. తాజాగా సౌత్ కొరియన్ కంపోజర్ పార్క్ మిన్ జున్ తన టీమ్ తో కలిసి ఈ పాటకు స్టెప్పులు వేశారు.
Park Min-jun Raa Macha Macha Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నఈ భారీ బడ్జెట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసింది. అందులో ఒకటి ‘జరగండి.. ’ పాట కాగా, మరొకటి ‘రా మచ్చా మచ్చా..’. ఈ రెండు పాటలు ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా 'రా మచ్చా మచ్చా..' పాటలో చెర్రీ డ్యాన్స్ సింపుల్ గా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. తమన్ మ్యూజిక్, గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ ఆహా అనిపించాయి. దర్శకుడు శంకర్ ఈ పాటను 1000 మంది ఫోక్ డ్యాన్సర్లతో ప్రత్యేకంగా తెరకెక్కించి విధానం తెరమీద మెస్మరైజ్ చేసింది.
‘రా మచ్చా..’ పాటకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్
‘గేమ్ ఛేంజర్’లోని ఈ పాట సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. విడుదలైన నాటి నుంచే ఈ పాటకు నెటిజన్లు జోరుగా రీల్స్ చేస్తున్నారు. భారత్ లోనే కాదు, విదేశాల్లోని మూవీ లవర్స్ సైతం ఈ పాట చూసి ఫిదా అవుతున్నారు. రామ్ చరణ్ కు జపాన్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉండటంతో అక్కడ ఈ పాట బాగా ట్రెండ్ అయ్యింది. ఎంతో మంది జపనీస్ ఈ పాటకు స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు.
సౌత్ కొరియన్ కంపోజర్ క్రేజీ స్టెప్స్
జపాన్ లో దుమ్మురేపిన ఈ పాట ఇప్పుడు సౌత్ కొరియాను ఊపేస్తోంది. తాజాగా ఆ దేశానికి చెందిన ప్రముఖ పాప్ సింగర్, కంపోజర్ పార్క్ మిన్ జున్ తన టీమ్ తో కలిసి ఈ పాటకు సూపర్ డూపర్ స్టెప్స్ వేశారు. హుక్ స్టెప్స్ తో ఆకట్టుకున్నాడు. ముందుగా ఈ పాటను తన సెల్ ఫోన్ లో చూసిన మిన్ జున్, ఆ తర్వాత తన టీమ్ తో కలిసి అచ్చం రామ్ చరణ్ లా డ్యాన్స్ మూమెంట్స్ దించేశాడు. ఈ వీడియోను మిన్ జున్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సౌత్ కొరియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ పాటపై పలువురు మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
ఎవరీ పార్క్ మిన్ జున్
పార్క్ మిన్ జున్ సౌత్ కొరియాకు చెందిన పాప్ సింగర్, కంపోజర్. ఆయన పాడిన పాటలు కొరియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. పలు దేశాల్లో తిరుగుతూ పాటలకు డ్యాన్సులు చేస్తూ ఆకట్టుకుంటాడు. ఆయా దేశాల ప్రజలు మిన్ జున్ ను ఓన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు ఇండియన్ సాంగ్స్ కు ఆయన డ్యాన్స్ చేశాడు. తాజాగా ‘రా మచ్చా..’ సాంగ్ తో భారత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
Read Also: హీరోయిజం, ఫైట్లు, డ్యాన్స్ లు చాలు - కథ, స్క్రీన్ ప్లే, తొక్కా తోలు ఎవడికి కావాలి?: నాగవంశీ