Ennenno Janmalabandham December 21st: బాపు బొమ్మలా వేద, కన్నార్పకుండా చూస్తున్న యష్- మాలిని మీద కస్సుబుస్సులాడిన సులోచన
వేద, యష్ వెకేషన్ కోసం అగ్రహారం రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
యష్, వేద అగ్రహారం చేరుకుంటారు. అక్కడ యష్ ఓవర్ యాక్షన్ చూసి వేద బిత్తరపోతుంది. వేద వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య దగ్గర యష్ మార్కులు కొట్టేస్తాడు. మనవరాలు, మనవడు మధ్య సఖ్యత లేదని సులోచన చెప్పింది కదా మరి వీళ్ళు చిలకా గోరింకల్లా బాగున్నారు అని రాణి అంటుంది. సులోచనకి కాస్త తొందర ఎక్కువ చిన్న దానికే టెన్షన్ పడుతుంది మన దగ్గర ఉంటారు కదా చూద్దామని రాజా అంటాడు. యష్ కి వేద భోజనం వడ్డిస్తుంది. పక్కనే రాజా, రాణి ఉండటం వల్ల వేదని చూస్తూ ఉంటాడు యష్.
అక్కడ ఫిర్యాదుల పెట్టె ఉంటుంది. అది చూసి ఎందుకు అని అడుగుతాడు. ఇలాంటి బాక్సులు ఆఫీసులో ఉంటాయి కదా మరి ఇంట్లో ఉండటం ఏంటని అడుగుతాడు. మా ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు తొలగించుకునే బాక్స్ అది అని రాణి చెప్తుంది. పెళ్ళైన కొత్తలో మాకు ఒకరికోకరిలో నచ్చని విషయాల గురించి చెప్పుకుని సమస్యలు తీర్చుకునే వాళ్ళం అని చెప్తారు. ముసలోళ్ళు ఇద్దరూ వాళ్ళు మానుకున్న నచ్చని విషయాల గురించి చెప్తారు. భార్యాభర్తలు అంటే ఒకరికి నచ్చినట్టు ఒకళ్ళు ఉండాలి. భర్తకి కోపం వచ్చినప్పుడు భార్య, భార్యకి కోపం వచ్చినప్పుడు భర్త అర్థం చేసుకోవాలి అని రాజా సలహా ఇస్తాడు.
Also Read: పరాధాన్యంలో తులసి, సామ్రాట్- శ్రుతి, అంకిత రేషన్ బాధలు
వేదని కూడా భోజనం చెయ్యమని చెప్పేసరికి తను కూడా కూర్చుంటుంది. యష్ తనకి వడ్డిస్తాడు. భార్యాభర్తలు అంటే కలిసి ఉండటం కాదు కలిసి పోవడం అని రాజా చెప్తాడు. మాలిని కంగారుగా సులోచనకి ఫోన్ చేస్తుంది. యష్, వేద ఊరికి చేరుకున్నారో లేదో అని తెలుసుకుందామని చేశానని సులోచన చెప్తుంది. వాళ్ళిద్దరినీ దగ్గర చెయ్యడానికి ఏమైనా ప్లాన్ చేశారా అని అడుగుతుంది. అక్కడ ఉంది మా అమ్మానాన్న వాళ్ళు చూసుకుంటారులే అని సులోచన కసురుగా చెప్తుంది. వేద అమ్మమ్మ దగ్గర కూర్చుని మాట్లాడుతుంది. రాణి పూలు కడుతూ ఉంటే పొద్దున్నే పెట్టుకుంటా కదా అని వేద అంటుంది. బయటకి వెళ్లేటప్పుడు, పడక గదిలోకి వెళ్లేటప్పుడు భార్య పూలు పెట్టుకుని వెళ్ళాలి అని చెప్తుంది. భర్త దగ్గర ఎలా ఉండాలో చెప్తుంది.
Also Read: యష్ తో అట్లుంటది మరి, మనవడిని తెగ మెచ్చుకున్న రాజా, రాణి- బిక్కమొహం వేసిన వేద
మొగుడి ఆయువు పట్టు పడక గదిలోనే దొరుకుతుంది, అది పట్టేసుకుని కొంగుకి కట్టేసుకోవాలి అని చెప్తుంది. నీ భర్త నీకే సొంతం గుప్పెట్లో పెట్టుకుని గుండెల్లో దాచుకోవాలి అని రాణి వేదకి చెప్తుంది. వేద చక్కగా రెడీ అయి గదిలోకి వస్తుంది. వేదని అలా చూసి యష్ గుటకలు వేస్తూ ఉంటాడు. ‘ఈ వేద నాకు తెలిసిన వేదనేనా, ఈ చేతి గాజుల సవ్వడి, కాలి పట్టీల సవ్వడి సంగీతంలాగా వినిపిస్తుంది’ అని యష్ మనసులో అనుకుంటాడు. అమ్మమ్మకి కాస్త చాదస్తం పట్టుబట్టి ఇలా చేసిందని వేద చెప్తుంది. పెద్దవాళ్ళ సంగతి తెలిసిందే కదా కానీ ఇలా బాగున్నావ్ కొత్తగా బాపు బొమ్మలా ఉన్నావ్ అని యష్ కాంప్లిమెంట్ ఇస్తాడు. వేద కూడా యష్ కి థాంక్స్ చెప్తుంది. వాళ్ళతో బాగా కలిసి పోయారు మిమ్మల్ని చూసుకుని తెగ పొంగిపోతున్నారని అంటుంది.