News
News
X

Ennenno Janmalabandham October 3rd: ఆదిత్యకి ప్రేమగా అన్నం తినిపించిన వేద - తన సూసైడ్ ఎటెంప్ట్ కి కారణం ఎవరో చెప్పి షాకిచ్చిన మాళవిక

మాళవిక సూసైడ్ చేసుకోవడానికి ట్రాయ్ చెయ్యడంలో కథ మలుపు తిరిగింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
 
వేద, యష్ వల్ల చిత్ర, వసంత్ కథ సుఖాంతం అయ్యిందని అటు సులోచన, ఇటు మాలిని ఫ్యామిలీ సంతోషంగా ఉంటారు. చిత్ర, వసంత్ నిశ్చితార్థం జరగడానికి మా కోడలు గొప్ప అని మాలిని లేదు నా అల్లుడే గొప్ప అని సులోచన వాదించుకుంటూ ఉంటారు. చిత్ర వసంత్ ఎక్కడ అని వేదని అడుగుతుంటే తను కూడా యష్ కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్తుంది. ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్లారని అనుకుంటారు. హాస్పిటల్ లో మాళవిక ఎలా ఉందని ఒకేసారి యష్, అభిమన్యు అడుగుతారు. ప్రమాదం ఏమి లేదని డాక్టర్ చెబుతుంది. పోలీసులు వెళ్ళి మాళవిక సూసైడ్ కి కారణం ఎవరు అనే స్టేట్ మెంట్ తీసుకోవాలని ఆమె దగ్గరకి వెళతారు.

ఇంట్లో వేద యష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎక్కడ ఉన్నారో ఇంత రాత్రి అయ్యింది ఫోన్ చేసి చెప్పాలి కదా అని వేద అనుకుంటూ ఉంటుంది. అయినా ఆయన కారు సౌండ్, షూస్ సౌండ్ కూడా నాకు తెలుసు కదా రానివ్వు ఈరోజు ఈ పండితారాధ్యుల వేద అంటే ఏంటో రుచి చూపిస్తా అని అనుకుంటుంది. ఆదిత్య మాళవిక దగ్గరకి వెళ్ళి నీకు ఇలా ఉందని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని ఆదిత్య ఎమోషనల్ అవుతాడు. పోలీసులు మాళవికని ఆత్మహత్య చేసుకునే సమస్య ఏం వచ్చింది? మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అని పోలీసు అడుగుతాడు. నా ఆత్మహత్యకి కారణం ఏంటో నేను మీకు చెప్తాను అని మాళవిక చెప్పేది సైలెంట్ గా వినపడకుండా చేస్తారు.

Also Read: మాధవ్ మరో దారుణం- రుక్మిణిలో మొదలైన అనుమానం, అదిత్యపై అరిచిన సత్య

లోపల మాళవిక ఏం చెప్పిద్దో అని వసంత్ టెన్షన్ పడతాడు. భార్య భర్తల గొడవల్లో చట్టాలు అన్నీ భార్యకి సపోర్ట్ గా ఉంటాయి. దాని వల్ల ఏం అవుతుందో అని అంటాడు. చెల్లి భళి కరెక్ట్ గా ట్రాప్ చేసింది భలే దొరికాడు అని అభిమన్యు, ఖైలాష్ అనుకుంటారు. నిన్ను చూస్తే జాలి వేస్తుందని అభిమన్యు యష్ ని చూసి అంటాడు. నిన్ను ఫినిష్ చేయాలని చాలా సార్లు అనుకున్నా కానీ నా చేతికి మట్టి అంటకుండా నీ మాజీ భార్య నిన్ను జైలుకి పంపిస్తుంది. లోపల నీ సమాధికి నా మాళవిక పునాది వేస్తుందని అభి రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. ఏం బావగారు నన్ను లోపల ఉంచి మీరు బయట ఎంజాయ్ చేద్దాంఅని అనుకున్నారా కానీ ఇప్పుడు మిమ్మల్ని లోపల ఉంచి నేను బయట ఎంజాయ్ చేసే వాళ్ళతో ఎంజాయ్ చేస్తా అని ఖైలాష్ వెటకారంగా అనేసరికి యష్ కోపంగా ఏం మాట్లాడుతున్నావ్ రా అని వాడి కాలర్ పట్టుకుని మీదకు వెళ్తాడు.

News Reels

పోలీసులు బయటకి వస్తారు. మాళవిక ఏం స్టేట్ మెంట్ ఇచ్చింది, తన సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరని చెప్పిందని అభిమన్యు ఆత్రంగా అడుగుతాడు. తన ఆత్మహత్య కారణం స్వయంగా తనే అని చెప్పినట్టు పోలీసులు చెప్తారు. మాళవిక ఎందుకు ఇలా చెప్పిందని అభి చిరాకు పడతాడు. మాలవికగారు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు అని పోలీస్ చెప్పేసరికి అభి వెళ్లబోతుంటే మీరు కాదు యశోధర్ ని అని ఆయన్ని పంపిస్తాడు. సర్ ప్రైజ్ అయ్యవా, షాక్ అయ్యవా అని మాళవిక అడుగుతుంది. ఎందుకని యష్ అంటే నేను నిన్ను వదిలేసినదానికి. నిమిషం పట్టదు నా సూసైడ్ కి కారణం నువ్వే అని చెప్పడానికి, నిమిషం పట్టదు నిన్ను జీవితాంతం జైల్లో ఉండేలా చెయ్యడానికి ఇలా నేను నీ పేరు చెప్తే నీ పరిస్థితి యెనో నీకు అర్థం అయ్యిందనుకుంటా. అయినా నిన్ను క్షమించాను ఎందుకో తెలుసా ఎక్కడ నీ పెళ్ళాం వెదకి నీ మీద ప్రేమ పొంగిపోతుందో అని మాళవిక అంటుంది.

Also Read: తులసికి వెన్నుపోటు పొడిచిన అనసూయ- ప్రేమ్ కి మ్యూజిక్ ఆఫర్, లాస్యని అజమాయిషీ చేసిన తులసి

తరువాయి భాగంలో..

మాళవిక సూసైడ్ చేసుకోబోయిందని యష్ వేదకి చెప్తాడు. లోపల బెడ్ మీద తల్లి ఉంది వాడు తిన్నాడో లేదో అని యష్ ఆది గురించి బాధపడుతూ ఉంటాడు. తర్వాత యష్ వేదని హాస్పిటల్ కి తీసుకుని వస్తాడు. వేద నర్స్ కోట్, ముఖానికి మాస్క్ పెట్టుకుని ఆదితో కబుర్లు చెప్తూ నవ్విస్తూ అన్నం తినిపిస్తుంది. అది చూసి యష్ చాలా సంతోషిస్తాడు. వేద మాస్క్ తీయ్యడంతో నువ్వు మా డాడీని వదిలి వెళ్లిపో నువ్వు వదిలేస్తే మా డాడీ మా దగ్గరకి వస్తారని మా మామ్ చెప్పిందని ఆదిత్య అంటాడు.

Published at : 03 Oct 2022 07:26 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham October 3rd

సంబంధిత కథనాలు

Guppedantha Manasu December 3rd Update:  అపార్థాల మాస్టర్ లా తయారైన ఈగో మాస్టర్, గౌతమ్ కి మిత్రద్రోహి ట్యాగ్!

Guppedantha Manasu December 3rd Update: అపార్థాల మాస్టర్ లా తయారైన ఈగో మాస్టర్, గౌతమ్ కి మిత్రద్రోహి ట్యాగ్!

Karthika Deepam December 3rd Update: మోనిత అరెస్ట్, వంటలక్క సేవలో డాక్టర్ బాబు,మరి శౌర్య పరిస్థితేంటి!

Karthika Deepam December 3rd Update: మోనిత అరెస్ట్, వంటలక్క సేవలో డాక్టర్ బాబు,మరి శౌర్య పరిస్థితేంటి!

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు