News
News
వీడియోలు ఆటలు
X

నాగ చైతన్య 'కస్టడీ సీక్వెల్'పై హింట్ ఇచ్చిన డైరెక్టర్ వెంకట్ ప్రభు

నాగ చైతన్య హీరోగా నటించిన "కస్టడీ'కి సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ వెంకట్ ప్రభు ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. 'కస్టడీ 2' ప్రీ - రిలీజ్ ఈవెంట్‌లో ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడతానని ఆయన కామెంట్స్ చేశారు.

FOLLOW US: 
Share:

Custody Sequel: టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ద్విభాషా చిత్రం, 'కస్టడీ' మే 12, 2023న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమైంది. ఈ విడుదలకు ముందు, మేకర్స్ హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. కస్టడీ కి సీక్వెల్ ఉంటుందని ఆయన ఇన్ డైరెక్ట్ గా రివీల్ చేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసు యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన 'కస్టడీ'పై నాగ చైతన్యతో పాటు మేకర్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రియమణి, అరవింద్ స్వామి లాంటి ప్రముఖ నటీనటులు కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు స్వరాలు సమకుర్చారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ తో పాటు మూవీ టీం ప్రమోషన్స్ కూడా ఇప్పటికే ప్రారంభించింది.  అందులో భాగంగా హీరో నాగ చైతన్య పలు ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

'కస్టడీ' మూవీ విడుదల నేపథ్యంలో హైదరాబాద్ లో  ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో నటీనటులతో పాటు డైరెక్టర్ వెంకట్ ప్రభు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పూర్తిగా తెలుగులోనే మాట్లాడతానన్న వెంకట్ ప్రభు.. 'కస్టడీ 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ మాటల్ని బట్టి చూస్తే కస్టడీకి సీక్వెల్ కూడా ఉండనుందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన పరోక్షంగా వెల్లడించారు. 

'కస్టడీ పార్ట్ 2' కు మేకర్స్ సిద్ధమయ్యారన్న వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో ట్రెండింగ్ గా నిలుస్తోంది. అంతే కాదు ప్రస్తుతం కస్టడీ సీక్వెల్ మూవీకి సంబంధించిన స్క్రీప్ట్ పనుల్లో వెంకట్ ప్రభు ఉన్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఈ సీక్వెల్ లో హీరోగా ఎవరు నటిస్తారు అన్న దానిపై అప్పుడే చర్చ మొదలైంది. ఇక 'కస్టడీ' సినిమా కోసం ఇప్పటికే ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కు.. తాజా అనౌన్స్ మెంట్ మరో బూస్టప్ ను ఇచ్చిందని భావిస్తున్నారు. ఈ ప్రకటనపై అక్కినేని ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన కస్టడీ సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

ఇక కస్టడీ సినిమా కోసం హీరో నాగ చైతన్య లాగానే హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి కూడా బాగానే కష్టపడ్డట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం 15రోజుల పాటు వాటర్ సీక్వెన్స్ చేశామని, అందుకు ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నామని ఆమె ఇటీవల వెల్లడించారు. ఐదు రోజుల పాటు కంటిన్యూగా నీళ్లలో ఉన్నామని కృతి శెట్టి తెలిపారు. ఊపిరి తీసుకోకుండా రెండు నిమిషాలు ఉంటేనే ఒక షాట్ పాజిబుల్ అవుతుందని చెప్పారు. ఈ సీన్స్ చేస్తున్నప్పుడు తనకు ఒకానొక సమయంలో భయం కూడా వేసిందని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి తెలిపారు.

Also Read: సమంత హార్డ్ వర్కర్ - ఫోన్ పగలగొట్టాలనిపిస్తాది: నాగ చైతన్య

Published at : 08 May 2023 12:33 PM (IST) Tags: Naga Chaitanya Kriti Shetty Venkat Prabhu Custody Custody Sequel

సంబంధిత కథనాలు

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Samantha Gown Worth : సమంత గౌను రేటు వింటే మతులు పోతాయ్ - సామ్ చాలా కాస్ట్లీ గురూ!

Samantha Gown Worth : సమంత గౌను రేటు వింటే మతులు పోతాయ్ - సామ్ చాలా కాస్ట్లీ గురూ!

టాప్ స్టోరీస్

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు