Aditya Hasan Director: నైంటీస్ వెబ్ సిరీస్ దర్శకుడికి రెండు సినిమా ఆఫర్లు - ఫస్ట్ మూవీ ఏ హీరోతో అంటే?
90s web series director upcoming movies: ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైన '90స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ రెండు భారీ నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేయబోతున్నట్లు తెలిసింది.
![Aditya Hasan Director: నైంటీస్ వెబ్ సిరీస్ దర్శకుడికి రెండు సినిమా ఆఫర్లు - ఫస్ట్ మూవీ ఏ హీరోతో అంటే? Director Aditya Hasan got two movie offers after 90s web series success Aditya Hasan Director: నైంటీస్ వెబ్ సిరీస్ దర్శకుడికి రెండు సినిమా ఆఫర్లు - ఫస్ట్ మూవీ ఏ హీరోతో అంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/ab0e924fd0c4726dc321a363f9e3f6b71706366221279313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Director Aditya Hasan got two movie opportunities: ఆదిత్య హాసన్... 'నైంటీస్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ విడుదల అయ్యే వరకు ఇండస్ట్రీలో కొంత మంది ప్రముఖులకు తప్ప పెద్దగా ఎవరికీ తెలియదు. ఈటీవీ విన్ ఓటీటీలో సిరీస్ రిలీజ్ అయ్యాక ఒక్కసారి ఎవరీ దర్శకుడు? అని ప్రేక్షకులు ఆరా తీశారంటే అసలు అతిశయోక్తి లేదు. ఒక్క విజయంతో ఆదిత్య హాసన్ వైపు చూశారంతా. ఇప్పుడు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు అగ్ర నిర్మాణ సంస్థల నుంచి అతనికి పిలుపు వచ్చింది.
నితిన్ హీరోగా ఆదిత్య హాసన్ సినిమా!
'90స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' తర్వాత ఆదిత్య హాసన్ (Nithiin Aditya Hasan Movie)కు వచ్చిన పిలుపులో ఒకటి శ్రేష్ఠ్ మూవీస్ నుంచి అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. శ్రేష్ఠ్ మూవీస్ అంటే నితిన్ సొంత నిర్మాణ సంస్థ. ఆ సంస్థలో తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మాణంలో ఆయన హీరోగా సినిమాలు రూపొందుతాయి.
నితిన్ హీరోగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారట. నితిన్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యాక... 'ఇష్క్' నుంచి 'భీష్మ' వరకు ఆయనకు విజయాలు అందించిన సినిమాలు అన్నీ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్స్. '90స్' వెబ్ సిరీస్ వీక్షకులకు మంచి వినోదం అందించింది. సో... నితిన్, ఆదిత్య హాసన్ మంచి కాంబినేషన్ అవుతుంది. ఆల్రెడీ ప్రొడక్షన్ హౌస్ నుంచి దర్శకుడికి అడ్వాన్స్ వచ్చిందని సమాచారం.
సితార సంస్థలో మరో సినిమా కూడా!
నితిన్, శ్రేష్ఠ్ మూవీస్ సినిమా కాకుండా ఆదిత్య హాసన్ అడ్వాన్స్ ఇచ్చిన మరో నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతగా ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార సంస్థలు వరుస సినిమాలు నిర్మిస్తున్నాయి. అయితే... హీరో ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ముందు నితిన్ సినిమా ఉంటుందని టాక్.
Also Read: హిమాలయాలకు వెళ్లిన గోపీచంద్... ఎందుకంటే?
'నైంటీస్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' విమర్శకులతో పాటు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. వినోదం మాత్రమే కాదు... మధ్య తరగతి కుటుంబాల్లో సందర్భాలను దర్శకుడు ఆదిత్య హాసన్ హృద్యంగా ఆవిష్కరించారు. సిరీస్ చూసిన చాలా మంది తమకు తమ బాల్యం గుర్తుకు వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఆ సిరీస్ కేవలం యువతీ యువకులను మాత్రమే కాదు... పెద్దలను కూడా అమితంగా ఆకట్టుకుంది. ఇంటిల్లిపాది చూసే క్లీన్ కామెడీని ఆదిత్య హాసన్ అందించారు. అది ఎక్కువ మందికి హీరోలకు, నిర్మాతలకు నచ్చింది. అందుకని, అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే, 'నైంటీస్' వెబ్ సిరీస్ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
Also Read: బాక్సాఫీస్ వద్ద తగ్గేదేలే అంటున్న ‘హనుమాన్’ - 250 కోట్ల క్లబ్‌లోకి బిందాస్ ఎంట్రీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)