అన్వేషించండి

Gopichand: హిమాలయాలకు వెళ్లిన గోపీచంద్

Gopichand Srinu Vaitla movie: గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా అప్డేట్ ఏమిటంటే?

మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనెపూడి యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ సినిమాకు శ్రీను వైట్ల దర్శకుడు. ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...

ఇటలీ, గోవా తర్వాత హిమాలయాలకు...
Gopichand 32 Lengthy Schedule Begins Today In Himalayas: గోపీచంద్, శ్రీను వైట్ల కలయికలో మొదటి సినిమా ఇది. షూటింగ్ కొన్నాళ్ళ క్రితం స్టార్ట్ చేశారు. ఓ షెడ్యూల్ ఇటలీలో చేశారు. ఆ తర్వాత సెకండ్ షెడ్యూల్ గోవాలో చేశారు. ఇప్పుడు సినిమా యూనిట్ అంతా హిమాలయాలకు వెళ్లారు.

''హిమాలయాల్లో గోపీచంద్ సహా ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తాం. ఇంతకు ముందు రెండు షెడ్యూళ్లతో పోలిస్తే... ఇది లెంగ్తీ షెడ్యూల్'' అని నిర్మాత వేణు దోనెపూడి పేర్కొన్నారు. ఇంతకు ముందు ఆయన డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్. ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు.  

హీరోలకు కొత్త మేకోవర్ ఇవ్వడం దర్శకుడు శ్రీను వైట్ల స్టైల్. 'దూకుడు'లో మహేష్ బాబు కావచ్చు, 'బాద్ షా'లో ఎన్టీఆర్‌ కావచ్చు, 'బ్రూస్ లీ'లో రామ్ చరణ్ కావచ్చు... అంతకు ముందు ఆయా హీరోలు చేసిన సినిమాలతో పోలిస్తే వాళ్లను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేశారు. ఇప్పుడు గోపీచంద్ కూడా ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తారని, ఆయనకు శ్రీను వైట్ల న్యూ మేకోవర్ ఇస్తున్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

Also Read: బాక్సాఫీస్‌ వద్ద తగ్గేదేలే అంటున్న ‘హనుమాన్‌’ - 250 కోట్ల క్లబ్‌లోకి బిందాస్ ఎంట్రీ

గోపీచంద్ కామెడీ టైమింగ్ సూపర్ ఉంటుంది. హీరోలతో పాటు మిగతా ఆర్టిస్టుల నుంచి కామెడీ రాబట్టుకోవడంలో శ్రీను వైట్ల స్పెషలిస్ట్. 'వెంకీ'లో ఆయన తీసిన ట్రైన్ ఎపిసోడ్ అయితే... చాలా మందికి ఫేవరెట్. ఆ కామెడీ ఎపిసోడ్ తరహాలో ఈ సినిమాలో వినోదాత్మక సన్నివేశాలను రూపొందించారట.

Also Read: విజయ్ నా కళ్ల ముందు పెరిగాడు, అతడు నాకు పోటీ కాదు: రజనీకాంత్

సినిమా టైటిల్ 'విశ్వం' అని ఖరారు చేశారా?
ఈ చిత్రానికి 'విశ్వం' టైటిల్ ఖరారు చేసినట్లు టాలీవుడ్ టాక్. అయితే... ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. గోపీచంద్ సినిమా చివర సున్నా వస్తే హిట్ అనే సెంటిమెంట్ ఉంది. అలా టైటిల్స్ ఉన్న సినిమాల్లో  ఒకట్రెండు ఆశించిన విజయాలు అందుకోలేదు. కానీ, మెజారిటీ సినిమాలు హిట్ అయ్యాయి. 

గోపీచంద్ జోడీగా కావ్యా థాపర్
ఈ సినిమాలో గోపీచంద్ సరసన యంగ్ హీరోయిన్ కావ్యా థాపర్ నటిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ 'ఈగల్', సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' తర్వాత ఆమె నటిస్తున్న చిత్రమిది. ఇంకా ఈ చిత్రానికి ప్రముఖ రచయిత గోపీ మోహన్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. 'వెంకీ', 'ఢీ', 'దుబాయ్ శీను' చిత్రాలకు గోపీ మోహన్ స్క్రీన్ ప్లే అందించడమే కాదు... 'రెడీ', 'కింగ్', 'నమో వేంకటేశ', 'బ్రూస్ లీ' చిత్రాలకు కథలు సైతం అందించారు. గోపీచంద్ హీరోగా నటించిన 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాలకు కూడా పని చేశారు. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కెవి గుహన్ సినిమాటోగ్రాఫర్.

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Nov 11th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: ఫ్యామిలీ వీక్‌లో శివ, ప్రియాంకల నిశ్చితార్థం! అంగరంగ వైభవంగా ఏర్పాట్లు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: ఫ్యామిలీ వీక్‌లో శివ, ప్రియాంకల నిశ్చితార్థం! అంగరంగ వైభవంగా ఏర్పాట్లు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ పుట్టిన రోజున అన్నదానం వేడుకలో విహారి! పాడు చేయడానికి అంబిక ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ పుట్టిన రోజున అన్నదానం వేడుకలో విహారి! పాడు చేయడానికి అంబిక ప్లాన్!
Ramayana: ఆస్కార్ బరిలోకి విజువల్ వండర్ ‘రామాయణం’.. ప్రపంచ వేదికపై రికార్డు
ఆస్కార్ బరిలోకి విజువల్ వండర్ ‘రామాయణం’.. ప్రపంచ వేదికపై రికార్డు
Crime Thriller OTT : ఏడేళ్లకోసారి ఊరిలో మగవాళ్ల మరణాలు... తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ మిస్టరీ థ్రిల్లర్
ఏడేళ్లకోసారి ఊరిలో మగవాళ్ల మరణాలు... తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ మిస్టరీ థ్రిల్లర్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Bulgaria Road Accident: బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
TDP Action On MLAs: ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
Pending Municipalities Elections : ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
CII Partnership Summit: ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
Embed widget